(Source: Poll of Polls)
Chinni Serial Today October 7th: చిన్ని సీరియల్: వరుణ్ పెళ్లితో దేవా ఇంట్లో పెద్ద గొడవ! లోహిత, మ్యాడీ, వరుణ్‌లను గెంటేసిన దేవా!
Chinni Serial Today Episode October 7th దేవా ఇంట్లో పెద్ద గొడవ జరగడం, మ్యాడీ, వరుణ్, లోహితల్ని దేవా ఇంటి నుంచి గెంటేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత, వరుణ్‌లు పెళ్లి చేసుకొని ఇంటికి వస్తారు. అతిథి వరుణ్ దగ్గరకు వెళ్లి ఏంటి వరుణ్ ఇది.. నాతో మాట్లాడుతా అన్నావ్.. మాట్లాడు.. కనీసం గదిలో మనం ఉన్నప్పుడు అయినా నువ్వు నాతో నిజం చెప్పాలి కదా అని చాలా ఏడుస్తుంది. మినిస్టర్ దేవా, వల్లితో మిమల్ని నేను జీవితంలో మర్చిపోలేను.. మాకు మంచి మర్యాద చేశారు అని అంటాడు. దానికి నాగవల్లి కోపంగా వెళ్లి వరుణ్‌ని కొడుతూ విన్నావారా విన్నావా అని కొడుతుంది.
మ్యాడీ ఆపాలని ప్రయత్నిస్తే నువ్వు మధ్యలోకి రాకు అని తిడుతుంది. అసలు నువ్వు మనిషివేరా.. గుండెల మీద పెట్టుకొని పెంచామ్రా కానీ నువ్వు ఆ గుండెల మీద తన్నేసి వెళ్లిపోయావ్ అని అంటుంది. అత్తయ్యా అని వరుణ్ అంటే ఎవర్రా నీకు అత్తయ్యా.. ఆ బంధాలే నీకు గుర్తున్నాయా.. అదే గుర్తుంటే సొంత తల్లి, చెల్లి చస్తాం అని చెప్పినా పట్టించుకోకుండా ఇలా తెగించి పెళ్లి చేసుకుంటావా అని అంటుంది. నీ వల్ల అందరి ముందు మా పరువు మొత్తం పోయింది అని అంటుంది. పోయింది మీ పరువు కాదు మా పరువు.. దేవా మీ ఫ్యామిలీ మొత్తం మా పరువు తీసేశారు దీని కంటే మమల్ని చెప్పుతో కొట్టి ఉంటే బాగుండేది.. దేవా నీ మీద నమ్మకంతో ఈ సంబంధం ఓకే చేశాం.. మా స్థాయి కూడా దిగి వచ్చాం.. మీరు బుద్ధి చెప్పారు.. నీ మీద నమ్మకం పోయింది అని సెంట్రల్ మినిస్టర్ అంటారు
దేవా ఏం మాట్లాడుకుండా గదిలోకి వెళ్లి గన్ తీసుకొని వచ్చి వరుణ్‌కి గురిపెడతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో మ్యాడీ వరుణ్ ముందు నిల్చొని గన్ పట్టుకొని వాళ్లిద్దరికీ పెళ్లి చేసింది నేనే డాడీ మీరు కాల్చాలి అనుకుంటే నన్ను కాల్చండి అంటాడు. దేవా గన్ పక్కన పెట్టి మ్యాడీని కొడతాడు. పెద్ద హీరో అనుకుంటావా.. మరి వీళ్లకి ఏం చెప్పాలి.. ఎన్నో ఆశలతో ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించి ప్రేమించిన వాడితో పెళ్లికి సిద్ధమైన ఈ అమ్మాయికి ఏం చెప్పాలి అని దేవా అడుగుతాడు. అంత లవ్ చేసుకుంటే ప్రేమ మేటర్ చెప్పాలి కదా అని అంటాడు దేవా.. వరుణ్ నిన్ను చిన్నప్పటి నుంచి సొంత కోడుకులా చూస్తే నువ్వు మాకు ఇచ్చిన రెస్పెక్ట్ ఇదేనా అని అంటాడు.
వసంత వచ్చి ఎవరే నువ్వు వరలక్ష్మీ వ్రతానికి వచ్చి నా కొడుకునే బుట్టలో వేస్తావా.. నా కూతురితో స్నేహం చేసి నా కొడుకుని మాయ చేసి ఏకంగా పెళ్లి చేసుకున్నావ్ అంటే నువ్వు ఎంత కన్నింగ్ ఆడదానివే అని దండలు తీసి విసిరేస్తుంది. నీలాంటి కొడుకుని కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని వసంత వరుణ్‌ని అంటుంది. మ్యాడీ అందరిని ఒప్పించాలని ప్రయత్నిస్తే నువ్వు మన పరువు ఆలోచించావా.. కనీసం మాట అయినా చెప్పావా అని అందరూ తిడతారు.
మినిస్టర్ దేవాతో ఈ అవమానం మర్చిపోను.. నీ పొలిటికల్ జీవితం మొత్తం నాశనం చేస్తా అని వార్నింగ్ ఇచ్చి ఫ్యామిలీని తీసుకొని వెళ్లిపోతాడు. దేవా ధనుంజయంకి సారీ చెప్తాడు. మీరు ఏదో చేస్తారు అని కాదు నాఫ్యామిలీ వల్ల ఒక ఆడపిల్ల ఏడ్చినందుకు అని చెప్తాడు. ఇక మధు, స్వప్నలు ఓచోట ఆగుతారు. చిన్ని విషయానికే అంత గొడవ జరిగింది మరి ఇంత పెద్ద విషయానికి ఏం చేస్తుందో అని బాధ పడుతుంది. మ్యాడీకి కాల్ చేస్తా అంటే స్వప్న ఆపుతుంది. మ్యాడీ వాళ్లని హ్యాండిల్ చేస్తాడు. వాళ్లకి ఏం కాకుండా చూసుకుంటాడు అని స్వప్న చెప్తుంది.
దేవా కుప్పకూలిపోయి లైఫ్‌లో మొదటి సారి ఈ దేవా ఒకరికి సారీ చెప్పడం.. ఎలా నాగవల్లి పిల్లల్ని పెంచారు.. ఒకడేమో మనల్నికాదని పెళ్లి చేసుకున్నాడు.. ఇంకొకడు వాళ్లకి పెళ్లి చేశాడు.. అంటాడు. నాగవల్లి కోపంగా చూడండ్రా ఆయన ఎప్పుడు ఇలా బాధ పడటం చూడలేదు.. మీ వల్ల ఆయన ఎలా బాధ పడుతున్నారో చూడండ్రా అని అంటుంది. వసంత ఏడుస్తూ అన్నయ్య తప్పు నాది మీరు బాధ పడొద్దు.. మీరు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటే మా వల్ల మీ పరువు పోయింది మమల్ని చంపేయండి అని అంటుంది. లోహిత మాట్లాడాలని చూస్తే నోరెత్తితే చంపేస్తా.. మా వాడిని పెళ్లి చేసుకునేవరకు వచ్చావ్ అంటే ఎన్ని స్కెచ్‌లు వేసుంటావ్ అని నాగవల్లి అంటుంది.
మ్యాడీ వరుణ్ వాళ్లని తీసుకొని దేవా దగ్గరకు వెళ్లి దీవించమని అంటే దేవా కోపంగా బయటకు వెళ్లిపోండి అని అంటాడు. లోహిత మనసులో ఈ ఇంట్లో పాతుకుపోదాం అనుకుంటే వీళ్లు గెంటేస్తున్నారుఅని అనుకుంటుంది. వరుణ్‌తో దేవా చిన్నప్పుడు నుంచి నీ వేలు పట్టుకొని వెలుగులోకి తీసుకొస్తే నువ్వు నన్ను చీకటిలోకి పంపేశావ్ అంటాడు. నాగవల్లి కోపంతో నిన్ను కాదే దీన్ని అనాలి అని శ్రేయని చూపించి మనిషిని చూసి గుర్తు పట్టాలి ముంచేదో కాదో అని అంటుంది. దేవా మ్యాడీని గెంటేస్తాడు.. వరుణ్,లోహితల్ని వెళ్లిపోమని అంటాడు. దేవా ముగ్గురిని గెంటేసి వాళ్ల గురించి ఆలోచిస్తే నాలో ఉన్న మృగాన్ని చూస్తారు అని హెచ్చరిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















