Ammayi garu Serial Today October 6th: అమ్మాయిగారు సీరియల్: తల్లీకొడుకులు రాఘవని చంపేశారా.. హాస్పిటల్‌లో హైడ్రామా! కోమలి భయం!
Ammayi garu Serial Today Episode October 6th రాఘవని చంపేయాలని దీపక్ విజయాంబిక హాస్పిటల్‌కి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవని చంపేయాలని విజయాంబిక, దీపక్ అనుకుంటారు. రూప రాజు వాళ్లతో రాఘవని జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంది. విజయాంబిక దీపక్‌లు రాఘవని చంపేయాలని ఉదయం హాస్పిటల్‌కి వెళ్తారు. సెక్యూరిటీ నుంచి తప్పించుకోవడానికి దీపక్ డాక్టర్ వేషం వేస్తాడు.
విజయాంబిక సెక్యూరిటీని తప్పించడానికి మాస్క్ పెట్టుకొని వచ్చి నా బిడ్డని ఎవరో ఎత్తుకెళ్లిపోతున్నారని ఏడుపు నటిస్తూ పోలీసుల్ని డైవర్ట్ చేస్తుంది. పోలీసులు వెళ్లగానే దీపక్ రాఘవ దగ్గరకు వెళ్తాడు. నర్సుని బయటకి పంపించి రాఘవని మా మామయ్య దగ్గర ఛీ కొట్టించుకునే పరిస్థితి దగ్గర నుంచి కాపాలా పెట్టించుకునే స్థాయికి ఎదిగావ్ ఇంకా నిన్ను బతకనిస్తే మాకే ప్రమాదం అని అనుకుంటాడు. ఇంతలో రాజు, రూపలు హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్‌తో మాట్లాడుతారు.
రాఘవని చంపేయాలని దీపక్ ముఖం మీద మాస్క్ తీసేస్తాడు. వైర్లు అన్నీ పీకేస్తాడు. ఇంతలో రాజు, రూపలు డాక్టర్‌తో కలిసి రాఘవ దగ్గరకు వస్తుంటారు. విజయాంబిక చూసి చాలా టెన్షన్ పడుతుంది. ఇంతలో డాక్టర్ నర్సుని చూసి నువ్వు పేషెంట్ దగ్గర ఉండకుండా ఇక్కడ ఉన్నావ్ ఏంటి అంటే వేరే డాక్టర్ ఉన్నారు నన్ను పని మీద పంపారు అంటుంది. అతన్ని వేరే డాక్టర్ చూడటం ఏంటి.. ఏదో జరుగుతుంది అని డాక్టర్ రాజు, రూపలకు చెప్పి రాఘవ దగ్గరకు పరుగులు తీస్తాడు.
రాజు, రూపలు రాఘవ దగ్గరకు వచ్చి రాఘవని చూసి షాక్ అయిపోతారు. ఆక్సిజన్ పైపు, వైర్లు తీసేసి ఉండటం చూసి బిత్తరపోతారు. డాక్టర్ చకచకా అన్నీ ఏర్పాటు చేస్తారు. రాఘవకు వెంటనే ట్రీట్మెంట్ అందిస్తాడు. రాఘవ మాకు ఎంతో ఇంపార్టెంట్‌నో తెలుసు కదా ఇలా ఇంటే ఎలా అని రూప, రాజులు కోప్పడతారు. విజయాంబిక, దీపక్‌లు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. కోమలి విషయం తెలుసుకొని రెండు నిమిషాల్లో మీ ప్రాణాలు దక్కాయని రాఘవ గురించి వదిలేసి ఇప్పుడేం చేయాలో అది ఆలోచించండి అని చెప్తుంది. ఇంతలో సూర్యప్రతాప్ ఇంటికి కోమలి పెరిగిన అనాథాశ్రమానికి చెందిన ఇద్దరు పెద్ద మనుషులు వస్తారు. కోమలి వాళ్లని చూసి బిత్తరపోయి వణికిపోతుంది. విజయాంబిక, దీపక్‌లకు వాళ్ల గురించి చెప్పి ఈ రోజుతో నా పని మీ పని అంతా అయిపోయిందని తెగ కంగారు పడుతుంది.
సూర్యప్రతాప్‌తో అమ్మ అనే అనాథాశ్రమం నుంచి వచ్చిన వాళ్లు మాట్లాడుతారు. ఫ్రండ్స్ కావాలా అని సూర్యప్రతాప్ అడిగితే వద్దు సార్ పాతికేళ్లగా విరూపాక్షి అమ్మగారే మా ఆశ్రమాన్ని దత్తత తీసుకొని చూసుకుంటున్నారు. మా అమ్మ అనాథాశ్రమానికి అమ్మ విరూపాక్షి గారే అని చెప్తారు. అమ్మగారు ప్రతీ పెళ్లి రోజుకి మా ఆశ్రమంలోనే గడుపుతారు. కానీ ఈసారి రాలేదు.. అని అంటారు. కోమలి ఆ మాటలు విని ప్రతీసారి వస్తే నేను చూడలేదు ఏంటా అని అనుకుంటుంది. చిన్న పని మీద వెళ్తూ మిమల్ని చూడటానికి వచ్చాను అమ్మగారు అని వాళ్లు అంటారు. విరూపాక్షి రంగారావు వాళ్లకి డబ్బు ఇస్తుంది. ఇక రంగారావు సూర్యప్రతాప్‌తో సార్ ఎప్పుడూ అమ్మగారు ఒక్కరే వస్తుంటారు. ఈసారి మీకు కుదిరితే మీరు రండి సార్ అని అంటాడు. రూప తల్లి దగ్గరకు వెళ్లి ఇంత మంచి పని చేసినా మాకు తెలీకుండా ఉంచావా అమ్మ అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



















