Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 6th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ విహారిల పెళ్లి గురించి తెలుసుకున్న పద్మాక్షి! కొత్త అమ్మాయి అంబికేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 6th లక్ష్మీకి విహారికి పెళ్లి అయిందని పద్మాక్షి తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ అసలైన భర్త వివరాలు పద్మాక్షికి రౌడీ పంపిస్తాడు. మ్యారేజ్ సర్టిఫికేట్, ఫొటో వాట్సాప్ చేస్తాడు. పద్మాక్షి వాటిని చూసి చదువుతుంది. వధువు పేరు కనక మహాలక్ష్మీ, వరుడు విష్ణు విహారి అని ఉండటం చూసి విహారి, కనకం పెళ్లి ఫొటో చూసి పద్మాక్షి బిత్తరపోతుంది. ఫోన్ కింద విసిరి పగలగొట్టేస్తుంది. విహారి అని వెళ్లబోతే సహస్రకు మెలకువ వచ్చి తల్లి చేయి పట్టుకుంటుంది.
పద్మాక్షితో సహస్ర అమ్మ బావ ఎక్కడ బావ నా పక్కనే ఉండాలి అని అంటుంది. వాడు ఎందుకే అని పద్మాక్షి అంటే బావని పిలువు అమ్మ నాతోనే బావ ఉండాలి అని అంటుంది. పద్మాక్షి మనసులో నా కూతురు విహారిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. వాడేమో లక్ష్మీని పెళ్లి చేసుకున్నాడు.. ఇప్పుడు నేను గొడవ పడి సహస్రని దూరంగా తీసుకెళ్లిపోతే అది ఉండగలదా.. డాక్టర్ కూడా సహస్రని సంతోషంగా చూసుకోమని చెప్పారు ఇప్పుడేం ఆవేశపడకూడదు.. సహస్రని పిల్లలు పుట్టరు అని ఇంట్లో తెలిసినా వారసుడికి కోసం చూస్తున్న నా వాళ్లు ఆ లక్ష్మీని విహారికి కట్టబెట్టేస్తారు.. ఇప్పుడు నేనేం తొందర పడకూడదు ఆ లక్ష్మీని మాత్రం వదలను అని పద్మాక్షి అనుకుంటుంది.
సహస్ర తల్లితో కడుపులో చాలా నొప్పిగా ఉందమ్మా అని ఏడుస్తుంది. పద్మాక్షి ఏడుస్తూ సర్ది చెప్తే అమ్మా నేను ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుందమ్మా అని సహస్ర అంటుంది. పద్మాక్షి సహస్రతో ఏం ఆలోచించొద్దని రెస్ట్ తీసుకో విహారిని పంపిస్తా అని వెళ్లిపోతుంది. ఉదయం లక్ష్మీ ఇంటి ముందు ముగ్గు వేస్తుంటే ఓ కారు వచ్చి బకెట్ వాటర్ని ఢీ కొట్టి ముగ్గు మీద పడేలా చేస్తుంది. ఎవరా అని లక్ష్మీ కారు వైపు చూస్తే అంబిక (పాత అంబిక స్థానంలో కొత్త అంబిక) ఎంట్రీ ఇస్తుంది. అంబిక రావడం రావడమే లక్ష్మీని కోపంగా చూస్తుంది. పండు అంబిక లగేజ్ తీసుకొని వస్తాడు. అంబిక ఊరు రావడంతో అందరూ సంతోషంగా రాను అన్నావ్ వచ్చావేంటి అని అడిగితే సహస్రకు యాక్సిడెంట్ అయిందని తెలిసి వచ్చేశా అని అంబిక అంటుంది.
భక్తవత్సలానికి కాల్ చేసి వంద ఎకరాలు కొంటాను అని అడిగిన పార్థ సారధి ఊరిలోకి వస్తాడు. ఆయనతో ఊరి వాళ్లు మాట్లాడుతారు. పంచాయితీకి వీర్రాజుని కూడా పిలుస్తాడు. పార్థసారథి ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటున్నామని పొలాలు కొంటామని అంటాడు. వీర్రాజు పార్థ సారధికి అడ్డు పడుతూ ఉంటాడు. పార్థ సారధితో అంబిక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. పార్థ సారధి అంబికతో వీర్రాజు అడ్డుకుంటున్నాడు అని అంటే వాడిని సైడ్కి పిలిచి పర్సెంటేజ్ ఇస్తానని చెప్పు వాడికి డబ్బు పిచ్చి ఆ మాట వింటే ఒకే చెప్పేస్తాడు అని అంబిక అంటుంది.
పార్థసారథి వీర్రాజుని పక్కకు తీసుకెళ్తాడు. పార్థసారథి, వీర్రాజు మాట్లాడుకోవడం పండు చూస్తాడు. పార్థసారథిని చూసి పండు అంబిక ఊరు రావడానికి ముందు ఇంట్లో అంబికతో మాట్లాడటం పండు గుర్తు చేసుకుంటాడు. పోలాల్లో మైన్స్ ఉన్నాయని అంబిక, పార్థసారథితో చేతులు కలపడం పండు చూస్తాడు. పార్థసారథి వీర్రాజుతో డీల్ కుదుర్చుకొని ఒప్పించి డబుల్ రేట్కి పొలాలు అమ్మడానికి ఒప్పిస్తానని వీర్రాజు అంటాడు. పండుకి విషయం కాస్త అర్థం కావడంతో లక్ష్మీకి విషయం చెప్తాడు. దీని వెనక అంబిక ఉందని లక్ష్మీకి అర్థమై ఊరిని కాపాడాలి అని పంచాయితీకి పరుగులు పెడుతుంది. వీర్రాజు ఊరి జనాన్ని ఒప్పిస్తాడు. ఊరి జనం ఒకే చెప్పే టైంకి లక్ష్మీ ఆపుతుంది. ఇది మా ఊరి సమస్య నువ్వు వెళ్లు అని వీర్రాజు అంటే లక్ష్మీ నేను ఈ ఊరి మనిషినే అమ్మవారు నన్ను దత్తత తీసుకుందని అంటుంది. ఊరి వారికి ఫ్యాక్టరీ వల్ల ఇబ్బంది అని మీరు కూలీలు అయిపోతారని మీరు మనసు పెట్టి వ్యవసాయం చేస్తే ఇంకా డబ్బు సంపాదిస్తారని అంటుంది. అంబికకు లక్ష్మీ వచ్చిందని పార్థసారథి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















