Chinni Serial Today October 6th: చిన్ని సీరియల్: వరుణ్ పెళ్లితో నాగవల్లి ఆగ్రహం.. మధుపై దాడి! లోహిత, వరుణ్ పరిస్థితి ఏంటి?
Chinni Serial Today Episode October 6th వరుణ్, లోహితలు పెళ్లి చేసుకొని దేవా ఇంటికి రావడం, నాగవల్లి మధు మీద ఫుల్ ఫైర్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ, మధులు దగ్గరుండి వరుణ్, లోహితల పెళ్లి చేసేస్తారు. మ్యాడీ వరుణ్‌తో ఇక ఇంటికి వెళ్దాం.. అంటాడు. వరుణ్ భయపడతాడు. మనం చేసిన పనికి వాళ్లకి కోపంగా ఉంటుంది కానీ తప్పదు వెళ్దాం అని అంటాడు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకుందాం అని ఫొటో తీసుకుంటారు. పెళ్లి పెద్ద మధుకి కూడా మహి థ్యాంక్స్ చెప్తాడు.
మధు మ్యాడీతో ఇప్పుడు ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి అని అంటుంది. మా అమ్మ ఫైర్.. నాన్న వైల్డ్ ఫైర్.. అత్తలోనూ మాస్ బయటకు వస్తుంది అని మ్యాడీ అంటాడు. దానికి వరుణ్ బావ మా అమ్మకి మా లవ్ మేటర్ నిన్న రాత్రి తెలిసింది అని జరిగింది చెప్తాడు. ఇంటికి వెళ్తే గొడవ అవుతుందని మనకి ముందే తెలుసు కదా ఫేస్ చేద్దాం పదండి అని తీసుకెళ్తాడు.
సెంట్రల్ మినిస్టర్ భార్య ఆయనతో మొదటి నుంచి ఈ సంబంధం వద్దు అన్నాను విన్నారా.. ఇప్పుడు పదండీ ముగ్గురం విషం తాగి చచ్చిపోదాం అని మీన అంటుంది. దేవా మీనతో మేడం మీరు టెన్షన్ పడొద్దు అంటే అరగంటలో రింగ్ పెట్టాల్సిన వాడు తిరిగి వస్తాడు అంటే ఎలా నమ్మాలి అని అడుగుతుంది. అతిథి తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. ఇప్పటి వరకు పోయిన పరువు చాలా ఇక పోదాం అని మీన అంటుంది. మినిస్టర్ దేవా మీద కోప్పడతాడు. అంతా కలిసి మా పరువు తీసేశారు.. ఇప్పుడు మమల్ని ఏం చేయమంటావో చెప్పు అని ప్రశ్నిస్తాడు. అందరూ తల దించుకుంటారు.
నాగవల్లి, వసంత బయట ఉంటే నాగవల్లికి రౌడీలు కాల్ చేస్తారు. గుడిలో నుంచి వరుణ్‌ని తీసుకొస్తుంటే మ్యాడీ కొట్టాడని చెప్తారు. ఏంట్రా చెప్తున్నావ్ అని నాగవల్లి అడిగితే వరుణ్ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేం ఆపాలని ప్రయత్నిస్తే మ్యాడీ కొట్టారని చెప్తాడు. నాగవల్లి షాక్ అయిపోతుంది. వసంత అడిగితే నాగవల్లి వరుణ్ పెళ్లి చేసుకున్న విషయం చెప్తుంది. వసంత చాలా చాలా ఏడుస్తుంది. ఇంతలో మ్యాడీ వాళ్లు లోహిత, వరుణ్‌తో ఇంటికి వస్తారు. నాగవల్లి, వసంత చూసి షాక్ అయిపోతారు. వరుణ్ లోహిత చేయి పట్టుకొని తీసుకెళ్తాడు.
నాగవల్లి దగ్గరకు వెళ్లి అందర్ని కోపంగా చూసి మధుని లాగిపెట్టి కొడుతుంది. మ్యాడీ పట్టుకుంటే వదలరా ఈ రోజు దీన్ని చంపకుండా వదలను.,.. ఎవరే నువ్వు నీ లెవల్ ఏంటి స్టేటస్ ఏంటి.. అడుక్కు తినే దానివి నీకు ఏం అర్హత ఉందని నా మేనల్లుడి పెళ్లి చేశావని అంటుంది. మధు సారీ చెప్తుంది. నోర్ముయ్ చంపేస్తా అని నాగవల్లి అని అంటుంది. మ్యాడీ మాట్లాడబోతే ఆపరా.. చేసింది అంతా ఇదే కదా.. నేను మొత్తం సీసీ కెమెరాలో చూశా ఇది నీకు మొత్తం చెప్పడం నేను చూశా దీని రాయభారాలు నాకు తెలుసు అంటుంది. డబ్బు కోసమే ఇదంతా చేశావ్ కదా అని అడుగుతుంది. వరుణ్ మీ మామయ్యకు ఏం సమాధానం చెప్తావ్.. పరువు తీసేశావ్ కదరా అంటుంది.
లోహిత నాగవల్లితో మేడం తప్పు చేశాం కానీ పెద్ద మనషుతో మమల్ని క్షమించండి అని అడుగుతుంది. నాగవల్లి మధుని చాలా తిడుతుంది. అసలు నిన్ను ఎలా పెంచారే కొంచెం కూడా మేనర్స్ లేదా.. ఇప్పటి వరకు మేం తెచ్చుకున్న పేరు మర్యాద అంతా తీసేశావ్ అని మధు గొంతు నలిపేస్తుంది. ఇంకొక్క క్షణం నా కళ్ల ముందు ఉంటే కచ్చితంగా చంపేస్తా అని నాగవల్లి అంటుంది. ఇంతలో దేవా నాగవల్లిని పిలవడంతో మ్యాడీ చూసి మధు, స్వప్న వెళ్లిపోండి మా డాడీ వస్తున్నారు ఇంతకు వంద రెట్లు ఉంటుంది. వెళ్లిపోండి అని పంపేస్తాడు. వరుణ్, లోహిత, మహి లోపలికి వెళ్తారు. దేవా ఒక్క చూపు చూడగానే లోహిత, వరుణ్ షాక్ అయిపోతారు. వరుణ్‌ని దేవా లాగిపెట్టి కొడితే కింద పడిపోతాడు. వరుణ్‌కి పెళ్లి అయిపోవడంతో అతిథి చాలా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















