Illu Illalu Pillalu Serial Today October 7th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నల్లి అక్క మీద ప్రేమ సీరియస్..! ధీరజ్, ప్రేమల ముద్దు మేటర్ నర్మద సాల్వ్ చేస్తుందా!
Illu Illalu Pillalu Serial Today Episode October 7th ధీరజ్ తనని ముద్దు పెట్టాడా లేదా అని తెలుసుకోవడానికి ప్రేమ నర్మద సాయం తీసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode రామరాజు వల్లీ తల్లిదండ్రులను ప్రశ్నించడం, చందు నిజం చెప్పే టైంకి ఇడ్లీబాబాయ్ గుండెపోటు నాటకం ఆడి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆటోలో భాగ్యం వాళ్లు వెళ్తుంటే కాస్త దూరం వెళ్లిన తర్వాత ఆటోకి ఎదురుగా నర్మద వచ్చి నిల్చొంటుంది.
నర్మద కోపంగా కిందకి దిగండి అని అంటుంది.ఆనంద్‌రావు నొప్పి నొప్పి అని కుడిపైపు చేయి పెట్టి నొప్పి నొప్పి అని తెగ యాక్టింగ్ చేస్తాడు. గుండె ఎడమ వైపు ఉంటుంది కుడి వైపు కాదు.. మర్యాదగా దిగండి లేదంటే నేను హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తా అని అంటుంది. దాంతో భాగ్యం కిందకి దిగుతుంది. ప్రేమ ఫొటోల విషయం ప్రేమ పుట్టింట్లో ఎందుకు చెప్పారు.. అంత చనువు మీకు వాళ్లతో ఎందుకు ఉంది అని అడుగుతుంది ఆవిషయం చెప్పడం వెనక మీ ఉద్దేశం ఏంటి.. రెండు కుటుంబాలకు పడదు అని తెలిసి కూడా మీరు విషయం చెప్పారు అంటే అర్థమేంటి అని నర్మద అడుగుతుంది. మా కూతుర్ని ఆ ఇంటికి ఇచ్చిన వాళ్లం ఎందుకు ఆ ఇంటి నాశనం కోరుకుంటాం అని భాగ్యం అనేస్తుంది.
ప్రేమ కూడా మీ కూతురి లాంటిదే కదా.. మరి ప్రేమ గురించి చెప్పి తన జీవితం నాశనం చేయాలి అనుకున్నారేంటి అని అడుగుతుంది. ఇడ్లీ అంత తెల్లని మనసు మాది మేం అలా చేయమని అంటారు. మీ నిజ స్వరూపం తెలిసినా మీ గురించి చెప్పలేదు.. ఆ కృతజ్ఞత మీకు లేదు. ఇక నుంచి మీ మీద ఒక కన్ను మీ అమ్మాయి మీద ఒక కన్ను వేసుకుంటా. మీరు మా గురించి కుట్రలు చేసినా తన పుట్టింటి వాళ్లతో రాయబారాలు చేసినా మీ సంగతి తేల్చుతా అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది నర్మద. నిజంగానే గుండె నొప్పి వచ్చిందని ఇడ్లీబాబాయ్ ఆటో ఎక్కిపోతాడు.
ప్రేమ విశ్వరూపం చూసిన వల్లీ తల మీద దుప్పటి కప్పుకొని గజగజ వణికిపోతుంది. ఇక ప్రేమ బయట కూర్చొని రాత్రి ఏం జరిగింది అని ఆలోచిస్తుంది. ఇంతలో వల్లీ ప్రేమ దగ్గరకు వెళ్లి చెల్లి నువ్వు నా సొంత చెల్లి.. నా మంచి తనం మీరు అర్థం చేసుకోవడం లేదు.. అంటే దానికి ప్రేమ నువ్వు ఎలాంటి నల్లివో నాకు తెలుసు ఓవర్ చేయకు అని అంటుంది ప్రేమ. నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు అని నేను నిజం చెప్పాలి అని వచ్చాను.. మొన్న మా అమ్మతో మాట్లాడుతూ నువ్వు కల్యాణ్ ప్రేమించుకున్న విషయం మా అమ్మకి చెప్పేశాను.. మా అమ్మ మాటవరసకి మీ పుట్టింటి వాళ్లకి చెప్పేసింది అని వల్లి చెప్తుంది. దాంతో ప్రేమ నన్ను నువ్వు రోడ్డు మీదకి లాగుతావా.. నీ అంతు చూస్తా మీ గురించి ఇప్పుడే మామయ్యకి చెప్తా అని ప్రేమ వెళ్తుంటే వల్లి ప్రేమని బతిమాలుతుంది. నర్మద వచ్చి ఆపుతుంది. ఏంటి అక్క ఆపుతున్నావ్.. నా క్యారెక్టర్ మీద నింద వేశారు.. ఓ ఆడపిల్ల మీద నింద వేస్తే ఎలా ఉంటుంది.. ఈ నల్లి బల్లిని వదలను అని అంటుంది. నర్మద ప్రేమని ఆపి వాళ్ల అమ్మానాన్నలకు నేను బుద్ధి చెప్పా ఇది భయపడి ఏడుస్తుంది..వదిలేయ్ అంటుంది.
వల్లీ సారీ చెప్పి సొంత అక్కాచెల్లిల్లా ఉందా అంటే ఏంటే ఉండేది.. ఇలాగే భయపడు ఇక నుంచి మామయ్యకి ఏ క్షణం చెప్తానో తెలీక బాధపడతావ్.. త్వరలోనే చాలాచాలా త్వరలోనే నిన్ను నీ పుట్టింటికి పంపేస్తా అంటుంది. ఈ విషయం ప్రేమకి ఎలా తెలిసింది అని నర్మద అంటే నేను చెప్పా అని వల్లీ అంటుంది. ఇకనైనా బుద్ధిగా ఉండు అని నర్మద వల్లికి చెప్తుంది. కుక్కతోక వంకర అన్నట్లు వల్లీ మళ్లీ ప్రేమ మీద బుసలు కొడుతుంది.
బతుకమ్మ పూజకు అందరూ రెడీ అవుతారు. అన్నదమ్ములు మార్కెట్ నుంచి పువ్వులు తీసుకొని వస్తుంటారు. ప్రేమ బయట కూర్చొని ధీరజ్‌కి ముద్దు పెట్టానా లేదా అని ఆలోచిస్తుంది. ఇంతలో నర్మద వచ్చి ఏమైంది అని అడిగితే విషయం చెప్తుంది. ధీరజ్ ముద్దు పెట్టాడో లేదో అర్థం కావడం లేదని అంటుంది. అది తెలీదా అంటే అప్పుడు నేను మందు తాగాను మైకం కమ్మేసింది అక్క అని అంటుంది. ధీరజ్ కిస్ చేశాడో లేదో నాకు తెలియాలి అని ప్రేమ అక్కకి గోకి నువ్వు కాస్త ధీరజ్‌ని అడగొచ్చు కదా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ నా వల్ల కాదు అని నర్మద అంటుంది. అక్క ప్లీజ్ అక్క అని ప్రేమ బతిమాలుతుంది. నర్మద ధీరజ్‌ని ఆపి ఫంక్షన్ బాగా జరిగిందా.. నువ్వు ప్రేమ అక్కడ ఏదో చేశారు అంట అని అడుగుతుంది. ధీరజ్ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















