Jagadhatri Serial Today October 6th: జగద్ధాత్రి సీరియల్: జగద్ధాత్రి-జేడీ ఒక్కరేనని కౌషికికి తెలిసిపోయిందా! శ్రీవల్లికి ఘోర అవమానం!
Jagadhatri Serial Today Episode October 6th కౌషికికి జగద్ధాత్రినే జేడీ అని అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode సురేశ్ తల్లి దగ్గరకు వెళ్లిపోతా అని చెప్తాడు. తల్లిని చూసుకో కానీ భార్యాపిల్లల్ని కూడా చూసుకోవాలి కదా అని చెప్తుంది. దానికి సురేశ్ అమ్మ ఆరోగ్యం బాలేదు సెట్ అయ్యాక వచ్చేస్తా అని అంటాడు. కౌషికి భర్తని పంపిస్తుంది కానీ బాధ పడుతుంది.
కౌషికి జేడీకి అని కాల్ చేస్తుంది. జగద్ధాత్రి ఇంట్లోనే ఉంటూ ఏంటి వదిన కాల్ చేసింది అని అనుకుంటూ బాల్కానీలో మాట్లాడుతుంది. ఇక హాల్‌లో కౌషికి మాట్లాడుతూ ఉంటే యువరాజ్ పాటలు పెడతాడు. అదే సాంగ్ జేడీ మాట్లాడుతున్నప్పుడు కూడా వినిపించడంతో కౌషికికి అనుమానం వస్తుంది. దాంతో కౌషికి ఛానెల్ మార్చుతూ పరిశీలిస్తుంది. జేడీతో మాట్లాడుతూనే అనుమానంగా ఇళ్లంతా వెతుకుతుంది. బయట జగద్ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది. కౌషికి జగద్ధాత్రి దగ్గరకు అనుమానంగా వెళ్లే టైంకి కౌషికిని శ్రీవల్లి పిలుస్తుంది.
కౌషికి శ్రీవల్లితో వస్తా అని చెప్తుంది. జగద్ధాత్రి కౌషికిని చూసి అలర్ట్ అయిపోతుంది. జగద్ధాత్రి కూడా వేరే ఫోన్ మాట్లాడుతున్నట్లు స్పీకర్ పెట్టి మాట్లాడుతుంది. ఇక కౌషికితో కేథార్ జేడీలా వాయిస్ మార్చి మారుతాడు. కౌషికి మనసులో ఒక్కోసారి జగద్ధాత్రి, జేడీ ఒక్కరే అనిపిస్తుంది అని అనుకుంటుంది. కేథార్, జగద్ధాత్రి దగ్గరకు రాగానే జగద్ధాత్రి కేథార్‌కి థ్యాంక్స్ చెప్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కేథార్ కౌషికికి అనుమానం రావడం టీవీ టెస్ట్ చేయడం చూసి పరుగున జగద్ధాత్రి దగ్గరకు వచ్చి ఫోన్ మార్చేస్తాడు. జగద్ధాత్రి ఫోన్ తీసుకొని జేడీలా కౌషికితో మాట్లాడి.. రమ్య జగద్ధాత్రి మాట్లాడేలా ప్లాన్ చేస్తాడు. జగద్ధాత్రి, కేథార్‌లు సురేశ్ భార్య పిల్లలతోనే ఉండేలా చేయాలని అనుకుంటారు.
కౌషికితో పాటు ఇంట్లో అందరూ చీరలు సెలక్ట్ చేసుకుంటుంటారు. జగద్ధాత్రి వచ్చి ఏమైంది అని అడిగితే రేపు మాధురికి సీమంతం అని అందరి కోసం చీరలు తీసుకొచ్చా అని చెప్తుంది. వైజయంతి కూతురి సీమంతం అని సంబరపడిపోతుంది. కౌషికి జగద్ధాత్రికి కూడా చీర సెలక్ట్ చేసుకోమని చెప్తుంది. నిషికి చీర తీసి బాగుందా అని అడుగుతుంది. బాగుంది అని యువరాజ్ నాకు నచ్చలే అని నిషిక అంటుంది. అయితే నన్ను ఎందుకు అడిగావ్ అని యువరాజ్ అంటాడు. ఇక జగద్ధాత్రి ఒక్కో చీర వేసుకొని కేథార్ వైపు చూస్తుంటే కేథార్ చూపులతో చీర సెలక్ట్ చేస్తాడు. జగద్ధాత్రి చీర సెలక్ట్ అయిన తర్వాత జగద్ధాత్రి శ్రీవల్లికి చీర సెలక్ట్ చేస్తుంది.
శ్రీవల్లి ఎగ్జైట్ అయి ఎలా వదిన నాకు ఏ రంగు నచ్చిందో అదే సెలక్ట్ చేశారు అని శ్రీవల్లి తీసుకొని థ్యాంక్స్ చెప్తుంది. ఇంతలో నిషికి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఉంది.. నీకు తీసుకోవడం ఎక్కువ నువ్వు దానికి తీసుకుంటావా అని నిషిక శ్రీవల్లి చేతిలో చీర లాక్కొని విసిరేస్తుంది. వైజయంతి కూడా శ్రీవల్లికి చీర వద్దు అంటుంది. ఏంటి వదినా ఇది వీళ్లు మాట్లాడే దానికి అర్థం ఉందా.. అని జగద్ధాత్రి అంటుంది. ఇంతలో వైజయంతి శ్రీవల్లి నువ్వేం బాధ పడకు నీ కోసం నేను బట్టలు తీసుకున్నా అని అంటుంది. వైజయంతి తీసుకొచ్చి ఓ బ్యాక్ శ్రీవల్లి చేతిలో పెడుతుంది. కొత్తవా అవి అని కేథార్ అడిగితే పోయిన సంవత్సరం పని మనిషికి ఇచ్చాను.. అది ఇక్కడే వదిలేసి వెళ్లిపోయింది నువ్వు కట్టుకో నీకు బాగుంటుందని అంటుంది. సుధాకర్ కోప్పడితే ఏ ఇది పనిపిల్లలాంటిదే కదా.. ఇదేమైనా జమిందారు ఫ్యామిలిలో పుట్టిందా అని అంటుంది.
కౌషికి శ్రీవల్లితో వాళ్లకి ఎంత చెప్పినా వినదు.. ఆ బట్టలు వదిలేసి జగద్ధాత్రి సెలక్ట్ చేసింది తీసుకో అంటుంది. పర్లేదులే అక్క నేను కనీసం సామాన్యుల ఫ్యామిలీలో కూడా పుట్టలేదు. అనాథని నాకు ఏ బట్టలు అయినా పర్లేదు.. అనాథాశ్రమంలో ఎవరైనా బట్టలు ఇస్తారా అని ఎదురు చూశాను.. ఎక్కడైనా చినిగిపోయి ఉంటే కుట్టుకొని వేసుకునేదాన్ని వాటితో పోల్చితే ఇవి చాలా బెటర్ అని అంటుంది. కౌషికి శ్రీవల్లితో నువ్వు అక్కడ పడినవి చాలు ఇక్కడ పడొద్దు.. నువ్వు మా మనిషివి నేను ఇస్తున్నా తీసుకో అని చీర ఇస్తుంది. శ్రీవల్లి వద్దు అనేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















