Chinni Serial Today October 14th: చిన్ని సీరియల్: దేవాని చూసేసిన మధు! వరుణ్, లోహితల్ని తిట్టి పంపేసిన నాగవల్లి! మ్యాడీకి అవమానం!
Chinni Serial Today Episode October 14th లోహిత, వరుణ్ దేవా ఇంటికి వెళ్లి బతిమాలడం, మధు దేవేంద్ర వర్మని చూసి గుర్తు పట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ పని చేస్తున్న రెస్టారెంట్ దగ్గరకు సంజు తన ఫ్రెండ్స్‌తో వస్తారు. మ్యాడీని చూసి బేరర్‌ని పిలిచి మ్యాడీ గురించి అడుగుతాడు. మ్యాడీ మాస్టర్ చెఫ్ అని తెలిసి చికెన్ మంచూరియా ఆర్డర్ చేసి ఫుడ్ బాలేదని అంటాడు.
మ్యాడీ వచ్చి ఏమైంది సంజు అని అడిగితే వంట వాడివి నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావా అని సార్ అను అంటాడు. దానికి మ్యాడీ సార్ చెప్పండి అంటాడు. ఫుడ్ బాలేదని సంజు అంటే మళ్లీ చేసి మ్యాడీ తీసుకొస్తాడు. దగ్గరుండి సంజు వాళ్లకి వేస్తాడు. ఇంట్లో గెంటేశారా ఇలా వంట వాడి అవతారం ఎత్తావ్ నాతో పెట్టుకుంటే ఈ జాబ్ కూడా లేకుండా చేస్తా అని సంజు చెప్పి ముఖం మీద టిప్ విసిరేసి వెళ్లిపోతాడు. మ్యాడీ కింద పడిన డబ్బు ఏరుకుంటాడు. సంజు చూసి కాలేజ్‌లో ఒక్క మాట అన్నా ఊరుకోడు.. ఇక్కడేంటి ఎన్ని అన్నా ఇలా పడ్డాడు అని అనుకుంటాడు. మ్యాడీ మనసులో నా కాళ్ల మీద నేను నిలబడ్డాను.. ఇక వరుణ్ బావ పెళ్లిని మమ్మీ డాడీ ఒప్పుకునేలా చేయాలి. చిన్ని కూడా నాకు దొరికిపోతే నాఅంత లక్ ఎవరూ ఉండరు అనుకుంటాడు.
వరుణ్, లోహిత ఇంటికి వెళ్తారు. శ్రేయ చూసి నాగవల్లి, వసంత వాళ్లని పిలుస్తుంది. నాగవల్లి దగ్గరకు వరుణ్, లోహిత వస్తుంటే నాగవల్లి ఆపేస్తుంది. నీ ముఖానికి సిగ్గు లేదారా.. చీ కొట్టినా దీన్ని వేసుకొని ఇంటికి వచ్చావ్.. గెట్‌అవుట్ అని అంటుంది. మా ముఖంలో సంతోషం తీసేసి బాధ పడేలా చేశావ్ పోరా అని అంటుంది. వరుణ్ తల్లితో అమ్మ నువ్వు అయినా చెప్పు అంటాడు. నీకు ఇంకా నేను అమ్మా అని గుర్తుందారా.. ఎప్పుడైతే నేను శ్రేయ చనిపోతాం అని చెప్పినా నువ్వు మమల్ని లెక్క చేయకుండా వెళ్లిపోయినప్పుడే నువ్వు చచ్చిపోయావ్ అని అంటుంది. 
వరుణ్, లోహిత ఇద్దరూ క్షమించమని అడుగుతారు. చేసిందంతా చేసి క్షమించమంటే ఎలా.. నువ్వు ఎంత తెలివిగా మమల్ని ఒప్పించాలని చూసినా అది జరగని పని.. మర్యాదగా వెళ్లిపోండి లేదంటే ఏం చేస్తానో నాకు తెలీదు.. దీని వెనక ఉన్న మధుని చంపేస్తా అంటుంది. లోహిత ఏడుస్తూ సరిగా తినడం లేదు.. ఏం చేస్తున్నామో తెలీదు అంటుంది. దానికి నాగవల్లి ఏంటి శ్రేయ ఇది రిచ్ అన్నావ్ అంటుంది. తను అలాగే చెప్పింది అత్తయ్య అని అంటుంది. మరి మీ ఇంటికి వెళ్లొచ్చు కదా అని వాళ్లు చంపేస్తారు అని లోహిత అంటుంది. మీ వాళ్లు చంపేస్తారు మేం హారతి ఇస్తాం అనుకున్నావా.. వెళ్లకపోతే ఏం చేస్తానో నాకు తెలీదు అని నాగవల్లి వార్నింగ్ ఇస్తుంది. లోహిత, వరుణ్ వెళ్లిపోతారు.
మధు రోడ్డు మీద ఆఫ్ టికెట్‌ని చూసి దగ్గరకు వెళ్లి నాన్న గురించి తెలుసా అని అడుగుతుంది. లేదు అని ఆఫ్ టికెట్ చెప్తాడు. ఇక అక్కడే మధు దేవాని చూసి ఎక్కడో చూసినట్లు ఉంది అని గుర్తు చేసుకొని ఈయన దేవేంద్ర వర్మ కదా మన మహి వాళ్ల నాన్న అని అంటుంది. మన మహి కూడా ఇదే ఊరిలో ఉండి ఉంటాడు అని చిన్ని అంటే నాకు గుర్తు రావడం లేదమ్మా అని ఆఫ్ టికెట్ అంటాడు. నాకు గుర్తుంది.. ఈయన్ను పట్టుకుంటే మహి ఎక్కడున్నాడో తెలుస్తుంది. తర్వాత నాన్న గురించి తెలుస్తుంది వెళ్లి మాట్లాడుతా అంటే ఆఫ్ టికెట్ మధుని ఆపుతాడు. ఇంతలో దేవా వెళ్లిపోతాడు. దేవా కారు వెనక మధు పరుగులు తీస్తుంది. ఇంకెప్పుడూ ఇలా చేయకమ్మా అని ఆఫ్ టికెట్ మధుని బతిమాలుతాడు. మధు ఇంటికెళ్లి దేవాని గుర్తు చేసుకొని మహి కూడా ఈ ఊరిలోనే ఉంటాడు అని అనుకుంటుంది. ఇంతలో లోహిత, వరుణ్ ఇంటికి వస్తారు. ఏమైంది అని మధు అడిగితే నీ వల్లే మా జీవితం నాశనం అయిపోయిందని లోహిత అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















