Ammayi garu Serial Today October 13th: అమ్మాయిగారు సీరియల్: సూర్య, విరూపాక్షి దగ్గరవుతున్నారా! విజయాంబికను సూర్య తిట్టడానికి కారణం!
Ammayi garu Serial Today Episode October 13th విజయాంబికను సూర్యప్రతాప్ కోప్పడి కేవలం రూప కోసమే మిమల్ని ఇంట్లో ఉంచానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు రూప, విరూపాక్షిలతో అశోక్ అమ్మానాన్నల గురించి ఆలోచించాలని.. వాళ్లు ఎక్కడుంటారో తెలిస్తే కోమలి అంతు చూడొచ్చని అంటాడు. ఉదయం బంటీ ఆడుకుంటూ ఉంటే మందారం బంటీకి పాలు తాగమని ఇస్తుంది. బంటీ వద్దని మారాం చేస్తాడు. ఇంతలో రాజు, రూపలు వస్తారు.
రూప పాల గ్లాస్ తీసుకొని తాగిస్తానని అంటుంది. బంటీ వద్దు అంటూ పరుగులు తీస్తాడు. నన్ను పట్టుకుంటే పాలు తాగుతా అని రూప, రాజులకు చెప్తాడు. ఇద్దరూ బంటీ వెనక పరుగులు తీస్తారు. మరోవైపు ఒకేసారి సూర్యప్రతాప్, విరూపాక్షిలు బయటకు వస్తారు. ఒకర్ని ఒకరు చూసుకొని నిల్చొండిపోతారు. రాజు, రూప వాళ్లు చూస్తూ ఉండిపోతారు. బంటీ అమ్మమ్మ తాతయ్యని చూసి మీరు ఇద్దరూ సేమ్ కలర్ బట్టలు వేసుకున్నారని అంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. (ఇద్దరూ పసుపు రంగు బట్టలు వేసుకుంటారు.) బంటీ తాతయ్యతో మీరు అమ్మమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్తాడు. గిఫ్ట్ ఇవ్వకపోతే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి మీరు అమ్మమ్మ గొడవ పడితే నాకు ఇష్టం ఉండదు అని బంటీ అంటాడు.
విరూపాక్షి సూర్యప్రతాప్‌ని చూసి నవ్వుతుంది. ఇక బంటీ మాత్రం గిఫ్ట్ ఇవ్వమని చెప్తాడు. విజయాంబిక, దీపక్‌లు రగిలిపోతారు. ఏదో ఒకటి చేసి ఆ బంటీని ఆపాలిరా అని అంటుంది. దగ్గరకు వచ్చి బంటీ తాతయ్య పని మీద వెళ్తున్నారు ఇబ్బంది పెట్టకు అని అంటుంది. దానికి బంటీ ఇవ్వకపోతే తాతయ్య అమ్మమ్మ గొడవ పడతారు. అలా గొడవ పడటం మీకు ఇష్టమేమో కానీ నాకు ఇష్టం లేదు.. తాతయ్య మీరు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పండి అంటాడు. సూర్యప్రతాప్ ఏం మాట్లాడకుండా కిందకి వచ్చేస్తాడు. బంటీ దగ్గరకు వచ్చి ముందు పాలు తాగు అని చెప్తాడు. దాంతో బంటీ నువ్వు గిఫ్ట్ ఇస్తాను అని అంటే పాలు తాగుతా అంటాడు.
విజయాంబిక మనసులో తమ్ముడు ఆలోచిస్తున్నాడు అంటే ఇస్తాను అని చెప్తాడు. అదే జరిగితే విరూపాక్షికి మరి కొంచెం దగ్గర అవుతాడు అది జరగకూడదు అని అనుకుంటుంది. ఇంతలో సూర్యప్రతాప్ సాయంత్రం వచ్చేటప్పుడు గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తా అని చెప్తాడు. విజయాంబిక షాక్ అయిపోతుంది. విరూపాక్షి, రాజు, రూపలు చాలా సంతోషిస్తారు. కోమలి మనసులో సూర్యప్రతాప్, విరూపాక్షికి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గు మనేది.. కాని ఇప్పుడు ఎంత మంట పెట్టినా ఏం జరగడం లేదు.. అలా అయితే నా పని అయిపోతుంది.. అందుకే అలా అవ్వకుండా చూసుకోవాలి ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలి అని కోమలి అనుకుంటుంది.
రూప తల్లిదగ్గరకు వెళ్లి నాన్నకి నీ మీద కోపం పోయింది అమ్మా.. ఎవరూ లేనప్పుడు నువ్వు కాఫీ ఇస్తే తీసుకున్నారు.. ఇప్పుడు అందరి ముందు ఇవ్వమ్మా తీసుకుంటారో లేదో చూద్దాం అని అంటుంది. వద్దు మీ నాన్న ఇబ్బంది పెడతారని విరూపాక్షి అంటే ఏం కాదు వెళ్లు అని రూప అంటుంది. సూర్యప్రతాప్, చంద్రప్రతాప్ ఫైల్స్ చూసి వెళ్లిపోతుంటే విరూపాక్షి వెళ్లి కాసేపు ఆగండి చంద్ర కాఫీ ఇస్తాను అని అంటుంది. సరే వదిన అని చంద్ర అంటాడు. సూర్యప్రతాప్ కూడా ఏం మాట్లాడకుండా కూర్చొంటాడు. విరూపాక్షి సంతోషంగా కాఫీ పెట్టడానికి వెళ్తుంది. విజయాంబిక కుళ్లుకుంటూ రూపని చూస్తే రూప కళ్లెగరేస్తుంది.
విరూపాక్షి కాఫీ చేసి తీసుకెళ్తుంటే విజయాంబిక అడ్డుగా వెళ్లి విరూపాక్షిని ఆపి నా తమ్ముడికి కాఫీ ఇచ్చి దగ్గరైపోవాలి అనుకుంటున్నావా నేను అది ఎప్పటికీ జరగనివ్వను అని విరూపాక్షి దగ్గర కాఫీ లాక్కుంటుంది. బంటీ ఆడుకుంటూ బాల్ రూప వైపు వేస్తాడు. రూప బాల్ తీసుకొని విజయాంబికను కోపంగా చూస్తుంది. నీ పని చెప్తా అత్త అనుకుంటూ కాఫీ తీసుకొని వస్తున్న విజయాంబిక కాళ్లలో విసిరేస్తుంది. బాలు మీద కాలేసిన విజయాంబిక బొక్కా బోర్లా పడుతుంది. కాఫీ కప్పులతో కింద పడిపోతుంది. చూసుకోవాలి కదా అని సూర్యప్రతాప్ అంటే దీపక్ వచ్చి ఇదంతా రుక్మిణి చేసిందని అంటాడు. సూర్యప్రతాప్ కోపంగా చాల్లే ఆపండి మీ తల్లీకొడుకులు ఎప్పుడూ ఏదో ఒకటి చేసి పక్కోళ్ల మీద పడేస్తారు అని అంటాడు.
చంద్ర అక్కతో అయినా వదిన తేవాల్సిన కాఫీ నువ్వు తెచ్చావేంటి అక్క అంటే విరూపాక్షి తెస్తే తమ్ముడు తాగడు అని నేను తెచ్చా అంటుంది. దానికి సూర్యప్రతాప్ నువ్వు తెస్తే తాగుతా అనుకున్నావా అని అడుగుతాడు. విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మారిపోయాడా అని చంద్ర మనసులో అనుకుంటాడు. సూర్యప్రతాప్ విజయాంబిక వాళ్లతో ఎలాంటి పరిస్థితుల్లో మిమల్ని ఈ ఇంట్లో ఉంచానో తెలుసు కదా.. ఎంతలో ఉండాలో అంతలో ఉంటే అందరికీ మంచిది అని అంటాడు. విరూపాక్షి విజయాంబిక దగ్గరకి వెళ్లి ఇంత వరకు సూర్యలో నా మీద కోపం నీ మీద నమ్మకం కనిపించేది కానీ మొదటిసారి నీ మీద కోపం చూశా అని విరూపాక్షి అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















