అన్వేషించండి

Podharillu Serial Today March 18th: మహా, చక్రి విడాకుల వ్యవహారం పోలీసులకు ఎలా తెలిసింది..? కానిస్టేబుల్ మహాకు ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

Podharillu Serial Today Episode March 18th:మహా,చక్రి విడాకుల వ్యవహారం పోలీసులకు ఎలా తెలిసింది..? కానిస్టేబుల్ మహాకు ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

Podharillu Serial Today Episode: మహా విడాకులు కోరుతుందని మీరే ఎలాగైనా కాపాడాలంటూ చక్రి కానిస్టేబుల్‌ను బ్రతిమలాడతాడు. వాళ్ల ఇంట్లో వాళ్లు బ్లాక్‌మెయిల్‌ చేసి ఆమెను నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారని చెబుతాడు. మీరు ఎలాగైనా మహాకు ఫోన్‌ చేసి చిన్న వార్నింగ్ ఇస్తే ఆమె ఈ ప్రయత్నాలు ఆపుతుందని చెప్పడంతో అతను సరేనంటాడు. ఇంటికి వచ్చిన మహా ఆధార్‌కార్డు గురించే ఆలోచిస్తుంటుంది. ఆధార్‌ కార్డులేకుండా కనీసం హాస్టల్‌లో రూమ్‌ కూడా ఇవ్వడం లేదు కదా...మరి పోలీసుస్టేషన్‌లో మా పెళ్లి ఎలా చేశారని అనుమానిస్తుంటుంది.ఇదే విషయాన్ని మాధవ్‌ను అడుగుతుంది.
 
పెళ్లి చేయాలంటే ఏం కావాలని అడిగితే... నాకు మాత్రం ఏం తెలుసని మాధవ్ అంటాడు. మరి పోలీసులు మా ఆధార్‌కార్డు లేకుండా పెళ్లి రిజిస్ట్రేషన్  ఎలా చేశారని అంటుంది.  మీ నాన్న వాళ్లు వచ్చారు కదా వాళ్ల దగ్గర ఏమైనా తీసుకుని ఉండి ఉంటారని అంటాడు. వాళ్లు పెళ్లి ఆపడానికి వచ్చారు కదా...వాళ్ల దగ్గర ఎందుకు ఉంటుందని సమాధానమిస్తుంది. మరి చక్రిని అడగకపోయావా అంటే...అడిగానని తనకు ఏం తెలియదని చెబుతున్నాడని చెబుతుంది. అసలు ఇప్పుడు ఆ పెళ్లి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా అని మాధవ్ ప్రశ్నించగా....ఏంలేదులే ఊరికే అడిగానని తప్పించుకుంటుంది.
 
ఆధార్‌కార్డు జిరాక్స్‌ ఉంటే సరిపోతుంది కాబట్టి మా వదినకు ఫోన్ చేసి ఆధార్‌ కార్డు ఫొటో పంపమని అడుగుతానని మహాలక్ష్మీ నిహారికకు ఫోన్ చేస్తుంది. విడాకుల సంగతి ఏమైందని నిహారిక ఆరా తీయగా...లాయర్‌ను వెళ్లి కలిశామని కానీ విడాకులు తీసుకోవడం కుదరదని చెప్పాడని చెబుతుంది. చక్రి ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అనగా...అలాంటిదేమీ లేదని ఆధార్‌కార్డు ఉంటేనే విడాకులకు అప్లై చేయాలని చెప్పాడని చెబుతుంది.అది నిజమే కదా అని నిహారిక అనగా....నేను ఇంట్లో నుంచి వచ్చేప్పుడు ఆధార్‌ కార్డు తెచ్చుకోవడం మర్చిపోయానని అంటుంది. అందుకే నేను  ఏ పనిచేయాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతుంది. నువ్వు కొంచెం ఆధార్‌కార్డు  జిరాక్స్‌ పంపిస్తే....నాకు ఉపయోగపడుతుందని చెప్పడంతో సరేనని వాళ్ల వదిన హామీ ఇస్తుంది.
పోలీసుస్టేషన్‌ నుంచి కానిస్టేబుల్‌ మహాకు ఫోన్ చేస్తాడు. తనను తాను పరిచయం చేసుకుని చక్రి బాగానే చూసుకుంటున్నాడా అని ఆరా తీస్తాడు. బాగానే చూసుకుంటున్నాడని మహా చెబుతుంది.మరి ఇంట్లోవాళ్లతో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడగ్గా...అలాంటిదేమీ లేదని అందరూ చాలా మంచివాళ్లని నన్ను బాగానే చూసుకుంటున్నారని చెబుతుంది. మరి అన్నీ బాగానే ఉంటే...విడాకులు ఎందుకు తీసుుకోవాలనుకుంటున్నావని అడగ్గా....మహా ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. ఈ విషయం మీకు ఎలా తెలిసిందని కానిస్టేబుల్‌ను ప్రశ్నిస్తుంది. మీ పెళ్లి పోలీసుస్టేషన్‌లో జరిగింది కాబట్టి...మీరు లాయర్‌ను కలవగానే ఆయన ఎంక్వైయిరీ కోసం మమ్మల్ని సంప్రదించాడని చెబుతాడు. మీరు ఏ లాయర్‌ను కలిసినా వాళ్లు ఈ పెళ్లి గురించి మమ్మల్నే అడుగుతారని అంటాడు. మీ నాన్న ఐజీ స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చినా కాదని మేం మీ పెళ్లి చేశామని...ఇప్పుడు మీరు మీ ఇష్టం వచ్చినట్లు విడాకులు తీసుకుంటామంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. నువ్వు విడాకులు ఇస్తే....మీ నాన్నవాళ్లు చక్రి కుటుంబంపై దాడి  చేసి అతన్ని చంపేసినా చంపేస్తారని అంటాడు.నిన్ను తీసుకెళ్లి మళ్లీ ఆ పిలకజుట్టుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని హెచ్చరిస్తాడు. నీకోసం చావుకు కూడా సిద్ధమైన చక్రి కుటుంబాన్ని అలా వదిలేసి వెళ్లిపోతావా అని నిలదీస్తాడు. కాబట్టి నువ్వు విడాకులు తీసుకోవాలన్న ఆలోచనను మర్చిపొమ్మని హెచ్చరిస్తాడు.
కానిస్టేబుల్‌ ఫోన్ చేసి హెచ్చరించిన విషయం మహా చక్రికి చెబుతుంది.అతను నాకు కూడా ఫోన్ చేశాడని చెబుతాడు. కాబట్టి ప్రస్తుతానికి ఈ విడాకుల గొడవ పక్కన పెట్టి తర్వాత చూద్దామని చక్రి చెబుతాడు.దీంతో మహా ఉసూరుమంటూ వెళ్లిపోతుంది.
 
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 8th:కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కత్తి పట్టి శకుంతలని చంపడానికి వెళ్లిన లక్ష్మీ! విహారి ఆఫీస్ కాంట్రాక్ట్ బరిలో లక్ష్మీ!
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Godavari Serial Today July 8th: 'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
'గోదావరి' సీరియల్: నందుకి అమెరికా సంబంధం ఫిక్స్! రెండు రోజుల్లో పెళ్లి!
Nindu Manasulu Serial Today July 8th: నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Embed widget