అన్వేషించండి

Jagadhatri Serial Today October 13th: జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ మనిషి నిషికను చంపేసిందా! కౌషికి పాత్ర ఏంటి? జేడీని కౌషికి చూసేసిందా!

Jagadhatri Serial Today Episode October 13th నిషికను చంపడానికి మీనన్ ఓ అమ్మాయిని పంపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, నిషికలకు పిల్లలు పుట్టడం లేదని ఇంటికి వచ్చిన వాళ్లు అవమానిస్తారు. కేథార్ బాధగా వెళ్లిపోతాడు. జగద్ధాత్రి కేథార్ కోసం వెళ్తుంది. ఇక మీనన్ యువరాజ్ తనకి నో చెప్పడంతో యువరాజ్‌ని బెదిరించడానికి టీనాని వజ్రపాటి ఇంటికి పంపిస్తాడు.

టీనా మేకప్ ఆర్టిస్ట్‌ అని చెప్పి ఇంట్లోకి వస్తుంది. ప్రియాని పిలిస్తే నువ్వు వచ్చావ్ ఏంటి అని కౌషికి అడిగితే తను పని మీద వెళ్లి నన్ను పంపిందని అంటుంది. ఏం అవసరం లేదు వెళ్లిపో అని నిషిక అంటే వైజయంతి ఆ మాటలు పట్టించుకోవద్దు వెళ్లి ఫేషియల్ చేసుకో అని చెప్పి ఒప్పించి నిషిని పంపిస్తుంది. మరోవైపు జగద్ధాత్రి కేథార్ దగ్గరకు వెళ్తుంది. మనలో ఏం లోపం లేదు అన్నా ఉందీ అంటున్నారు.. కనీసం మనుషుల్లా ప్రవర్తించడం లేదు మనసు చివుక్కుమంటోదని జగద్ధాత్రి అంటుంది. మనమేంటో మన మనసుకి తెలుసు కదా.. ఎందుకు మనకు పిల్లలు వద్దు అనుకుంటున్నామో మనకు తెలుసు కదా.. మనకి పిల్లలు కావాలి అని ఉంది కానీ వాళ్లు నీ తండ్రి ఎవరూ అని అడిగితే చెప్పుకోలేక కదా మనం ఆగుతున్నాం.. మా తాత ఎవరో అని చెప్పుకోలేరు అనే కదా ఆగుతున్నాం అని కేథార్ అంటాడు.

కేథార్ జగద్ధాత్రితో ఇక నా స్వార్థం కోసం నిన్ను బాధ పెట్టాలి అనుకోవడం లేదు.. త్వరలోనే మనం తల్లిదండ్రులు అవుదాం అని అంటాడు. తల్లి ప్రేమ నువ్వు చూస్తావ్.. తండ్రిగా నేను ఆ ప్రేమ ఆస్వాదిస్తా అని అంటాడు. మరోవైపు టీనా నిషికకు మేకప్ చేయడానికి ఐటెమ్స్ తీసి మీనన్‌తో మాట్లాడుతుంది. మీనన్‌ టీనాతో యువరాజ్ భార్య ప్రాణాలు తీసేయ్ అని చెప్తాడు. నీ భార్య శవంతో ఈ భాయ్ అంటే నీకు ఏంటో అర్థమైపోతుందని మీనన్ అనుకుంటాడు.

టీనా గదిలో డోర్ విండోస్ అన్నీ లాక్ చేస్తుంది. తర్వాత నిషిక తలకు మసాజ్ చేస్తా అని ఓ కవరుతో నిషిక ముఖాన్ని బిగించేస్తుంది. ఊపిరి ఆడక నిషికి ఇబ్బంది పడుతుంది. ఇక కేథార్ జగద్ధాత్రిని మాధురి దగ్గరకు వెళ్తాడు. జగద్ధాత్రి బయటకు వచ్చే టైంకి నిషిక ముఖం మీద కవర్ తీసేస్తుంది. దాంతో టీనా నిషికను కొడుతుంది. నిషిక కేకలు జగద్ధాత్రి విని డోర్ దగ్గరకు వెళ్తుంది. ఏదో పడినట్లు సౌండ్ వినిపించింది మరి గదిలో ఎవరు ఉన్నారు అనుకుంటుంది. యువరాజ్ నిషిక ఏమైనా గొడవ పడుతున్నారా అనుకుంటుంది. కానీ యువరాజ్ వదిన గదిలో ఉన్నాడు కదా అని గుర్తొచ్చి అనుమానంతో వెనక వైపు కిటికీ దగ్గరకు వెళ్తుంది.

నిషిక టీనాని బతిమాలుతుంది. టీనా నిషిక గొంతు నులుపి తలగడ అడ్డు పెట్టడం జగద్ధాత్రి కిటికీ నుంచి చూస్తుంది. నిషి నిషి అని అరుస్తుంది. నిషిని టీనా కొట్టడంతో నిషి పడిపోతుంది. టీనా నిషికి గన్ గురి పెట్టే టైంకి జగద్ధాత్రి గదిలోకి వస్తుంది. జగద్ధాత్రి చూసి షాక్ అయిపోతుంది. టీనా జగద్ధాత్రిని చూడదు. జగద్ధాత్రి సెంటు బాటిల్‌తో గన్ మీద తంతుంది. పోలీస్ జగద్ధాత్రి ఆదిశక్తిలా టీనాని వాయించేస్తుంది. టీనా గన్‌తోనే టీనాని బెదిరించి ఎవరు పంపించారు అని అడుగుతుంది. టీనా చెప్పకపోవడంతో టీనా అరచేతిలో కాల్చేస్తుంది. బులెట్ సౌండ్ విన్న కేథార్ జేడీ అని అనుకుంటాడు. కౌషికితో పాటు ఇంట్లో అందరూ సౌండ్ విని కంగారు పడతారు.

టీనా జగద్ధాత్రిని తోసేసి పారిపోతుంది. నిషిని ఏమైనా చేసిందేమో అని అందరూ కంగారుగా మేడ మీదకు వస్తారు. అందరూ మేడ మీదకు రావడం జగద్ధాత్రి గన్‌ తీసుకొని టీనా కోసం బయటకు పరుగులు తీయడం కౌషికి చూస్తుంది. కేథార్ కూడా చూస్తాడు. నిషిని అందరూ లేపుతారు. జగద్ధాత్రి ఆలోచించి ఇది వచ్చింది పార్లర్ నుంచి కాదు నిషిని చంపడానికి ఎవరు అయింటారు అని అనుకుంటుంది. అందరూ ఏమైందని అడిగితే టీనా చంపడానికే వచ్చిందని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. నిషి కౌషికిని చూస్తూ వదిన నన్ను చంపించాలని అనే దాన్ని రప్పించుంటుందని అంటుంది. అలా ఎలా అనుకుంటావ్ నిషి అని కౌషికి అంటుంది. నేను సాక్ష్యాలు లేకుండా మాట్లాడటం లేదు అది నాతో చెప్పింది చెప్పిన మాట వినకపోతే చంపేస్తా అని అంది అని అంటుంది. యువరాజ్‌కి వచ్చింది భాయ్ మనిషే అని అర్థమైపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
Nindu Manasulu Serial Today October 23rd: నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
నిండు మనసులు: ప్రేరణలో మార్పు! తల పట్టుకున్న సిద్ధూ, ఇందిర! నిజం చెప్పేస్తుందా!
Godavari Serial Today October 23rd: 'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
'గోదావరి' సీరియల్: జాను, సంజయ్‌ల ఫస్ట్‌నైట్! అగ్రిమెంట్ పక్కన పెట్టేసి కలిసిపోయారుగా!
Meghasandesam Serial Today October 23rd: ‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  
‘మేఘసందేశం’ సీరియల్‌: అపూర్వను పూల్‌ను చేసిన ఆకాష్‌ - కొత్త ప్లాన్‌ చెప్పిన భూమి  

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం
BRS Legal Notice Strategy: రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
రాజకీయ విమర్శలకు లీగల్ నోటీసుల నోటీసుల కౌంటర్ - లీగల్ పోరాటం బీఆర్ఎస్‌కు సేఫా.. లేక రాజకీయంగా డిఫెన్సివ్ గేమా?
Embed widget