Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: ప్రేరణ స్టడీ కేఫ్ ప్రారంభోత్సవం: సిద్ధూ తల్లి మంజుల మనసు మార్చుకుంటుందా?
Nindu Manasulu Serial Today Episode October 13th సిద్ధూ కేఫ్‌కి ప్రేరణ పేరు పెట్టడం సిద్ధూ కోసం ప్రేరణ మంజుల దగ్గరకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ, సిద్ధూల కాఫీ షాప్ ఓపెనింగ్ ఏర్పాట్లు మొదలవుతాయి. ఇంట్లో ప్రేరణకు ఇందిర హారతి ఇచ్చి బయల్దేరుదాం అని చెప్తుంది. ముగ్గురు బయల్దేరే టైంకి రంజిత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే కాఫీ షాప్ ఓపెనింగ్ అంటుంది. అక్కడే కాఫీలు, టిఫెన్స్ అక్కడే అని ఇందిర అంటుంది.
రంజిత్ ఇన్విటేషన్ లేకుండా రాను అని అంటాడు. ఐశ్వర్యకి చెప్పమని అన్నాం అని అంటే ఐశ్వర్య చెప్పడం మర్చిపోయి.. చెప్పాను అనేస్తుంది. సార్ మీరు మర్చిపోయారు అంటే లేదు నాకు గుర్తుంది అని అంటాడు. ఇక వెళ్దాం అని అంటే రంజిత్ ఆకలి వేస్తుంది అంటాడు. కామెడీనా అని ఐశ్వర్య అంటే మరి నువ్వు చెప్పింది ఏంటి అని అంటాడు. దాంతో ప్రేరణ వాళ్లకి ఐశ్వర్య రంజిత్‌ని పిలవలేదు అని అర్థమైపోతుంది. చెప్పలేదా అని ఐశ్వర్యని అడిగితే పది నిమిషాల్లో మర్చిపోయే వాడికి ఎందుకులే అని అంటుంది. రంజిత్ ఉప్మా కావాలని అడగటంతో ప్రేరణ వాళ్లు ఐశ్యర్యని చేసి పెట్టిన తర్వాత ఇద్దరినీ కేఫ్ ఓపెనింగ్‌కి రమ్మని అంటారు.
కేఫ్ దగ్గర సిద్ధూ, కుమార్, ప్రేరణ, ఇందిర హడావుడిగా పనులు చేస్తుంటారు. సిద్ధూ కాఫీ షాప్‌కి ప్రేరణ స్టడీ కేఫ్ అని పేరు పెట్టి బోర్డు పెట్టిస్తాడు. ఇందిర అది చూసి షాక్ అయి సిద్ధూతో మా అమ్మయి పేరు పెట్టారు ఏంటి బాబు అని అడుగుతుంది. ప్రేరణ పేరు అయితే బాగుంటుంది అనిపించింది ఆంటీ అని సిద్ధూ అంటాడు. ప్రేరణ దగ్గరకు ఇందిర వెళ్లి ప్రేరణ కాఫీ షాప్‌కి నీ పేరు పెట్టినట్లు నాకు ఎందుకు చెప్పలేదు అంటుంది. ప్రేరణకు ఆ విషయం తెలీకపోవడంతో ఏం అంటున్నావ్ అమ్మా కాఫీ షాప్‌కి నా పేరు పెట్టడం ఏంటి అని షాక్ అయిపోతుంది.
సిద్ధూ దగ్గరకు వెళ్లి నా పేరు పెట్టావేంటి అని అడుగుతుంది. ఐడియా నాది అయినా దీనికి ప్రేరణ నువ్వే.. స్టూడెంట్స్‌కి కొత్త ఐడియాలతో ఇక్కడికి వచ్చే వారికి ఎక్కడో ఒక చోట ప్రేరణ పొందే ఉంటారు కదా.. వాళ్ల ఆలోచనలకు ఇదే కాఫీ షాప్ ప్రేరణ కావాలి అనిపించి నీ పేరు పెట్టా అంటాడు. ప్రేరణ సంతోషంతో నవ్వుతుంది. ఇక్కడికి విచ్చే వారి ముఖంలో కూడా నవ్వు ఉండాలి అని అంటాడు. ఇక ప్రేరణకి ఇందిర పిలిచి ప్రేమగా చమటలు తుడవడం చూసిన సిద్ధూ తన తల్లిని గుర్తు చేసుకొని డల్ అయిపోతాడు. ప్రేరణ సిద్ధూకి పని చెప్తే సిద్ధూ డల్‌గా సరే అంటాడు. ప్రేరణ సిద్ధూ దగ్గరకు వచ్చి ఏంటి సడెన్‌గా డల్ అయిపోయావ్ అంటుంది. ఏంలేదు అని సిద్ధూ అంటాడు.
ప్రేరణ కుమార్‌తో ఏమైంది సిద్ధూ అలా ఉన్నాడు. గేటు వైపు చూస్తున్నాడు అని అడిగితే వాళ్ల అమ్మ వస్తుందేమో అని చూస్తున్నాడు. రారు అని తెలిసి కూడా ఆశగా చూస్తున్నాడు అని చెప్తాడు. పంతులు పూజకి టైం అయిందని అనడంతో ఇందిర సిద్ధూ దగ్గరకు వెళ్లి మీ వాళ్లు ఎవరూ రాలేదు.. మీ అమ్మగారితో కొబ్బరి కాయ కొట్టిస్తే మంచిది ఇంకా రాలేదు అంటుంది. సిద్ధూ ఇంకా డల్ అయిపోతాడు. ప్రేరణ ఇందిరను పక్కకు తీసుకెళ్లి సిద్ధూ వాళ్ల అమ్మ వాళ్ల గురించి ఎందుకు అడుగుతావ్ అని కోప్పడి సిద్ధూకి వాళ్ల అమ్మవాళ్లకి మధ్య పెద్దగా సంబంధాలు లేవు.. అయినా సిద్ధూ పిలిచాడు కానీ వాళ్లు రాను అనేశారు.. అందుకే బాధపడుతున్నారు అని అంటుంది.
ప్రేరణ, కుమార్‌ని తీసుకొని సిద్ధూ వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఇంతలో విశ్వనాథ్ గారు వస్తారు. సిద్ధూ విశ్వనాథ్‌ని చూసి పలకరించి మాట్లాడుతారు. ప్రేరణ స్టడీ కేఫ్ అని చూసి మంచి పేరు పెట్టారని విశ్వనాథ్ అంటారు. ప్రేరణ గురించి అడిగితే పనిలో ఉంది సార్ పిలుస్తా అంటే విశ్వనాథ్ వద్దు అంటాడు. కేఫ్ చూడటానికి వెళ్తారు. కుమార్ ప్రేరణతో కలిసి వాళ్ల ఇంటికి వెళ్తుంది. సిద్ధూ బాధ చూసి వచ్చారు కానీ కన్న కొడుకు పిలుస్తే రాని ఆవిడ మీరు పిలిస్తే వస్తారా అని అడుగుతాడు. కన్నతల్లి మనసు మీద నమ్మకంతో వెళ్తున్నా అని ప్రేరణ వెళ్తుంది.
మంజుల దేవుడి ముందు సిద్ధూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. ప్రేరణ ఇంట్లోకి వెళ్లి మంజులని కలుస్తుంది. విజయానంద్ షాక్ అయిపోతాడు. ప్రేరణ మంజుతో దేవుడితో ఏం కోరుకున్నారు మేడం.. మీకు డబ్బు హోదా అన్నీ ఉన్నాయ్ ఇంకేం కోరుకున్నారు. నేను చెప్పనా మీరు మనస్శాంతి కోరుకున్నారు. మీకున్న ఆ లోటు భర్తీ చేసేది మీ అబ్బాయి. మీ మనస్శాంతి ఎక్కడుందో మీరు గుర్తించనంత కాలం మీ బాధ పోదు. బిడ్డ ఏమైనా సాధించేది అమ్మ దీవెన వల్లే కదా.. బిడ్డకు అమ్మ దేవత కదా.. ఆ దేవత మీరు అయి మీ అబ్బాయి బాగుండాలి అని మీరు దేవున్ని కోరుకోవడం ఏంటి మేడం.. అమ్మ నిజం.. దేవుడు నిజం.. అమ్మ దీవెన ఓ వరం.. ఆ వరం కోసం అక్కడ మీ అబ్బాయి ఎదురు చూస్తుంటే మీరు ఎందుకు ఇంటికి పరిమితం అవ్వాలి.. ఎందుకు సిద్ధూని దూరం పెట్టాలి అని ప్రేరణ అడుగుతుంది. ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్ దూరం పెట్టింది ఎవరు అని మంజుల అంటే.. నాకు నిజంగా తెలీదు మేడం కానీ నేను వచ్చింది మీ కోసం తపిస్తున్న మీ అబ్బాయి గురించి చెప్పడానికి వచ్చా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















