Chinni Serial Today October 13th: చిన్ని సీరియల్: హోటల్‌లో వంట వాడిగా హోంమినిస్టర్ కొడుకు! వరుణ్‌ని తీసుకొని లోహిత ఎక్కడికెళ్లింది?
Chinni Serial Today Episode October 13th హోంమినిస్టర్ కొడుకు మ్యాడీ వంట వాడిలా పని చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ మధు తల్లిదండ్రులకు సాయంగా ఉండటానికి ఏదో ఒక పని చేయాలని అనుకుంటాడు. ఉదయం మధు ముగ్గు వేస్తుంటే మ్యాడీ వెళ్లి మాట్లాడుతాడు. సుబ్బు, స్వరూప, చంటి అందరూ కలిసి మాట్లాడుకొని సెల్ఫీ తీసుకుంటారు.
లోహిత అదంతా దూరం నుంచి చూసి వీళ్లేంటి మ్యాగీ, నూడిల్స్ కలిపినంత ఈజీగా మ్యాడీతో రిలేషన్ కలిపేస్తున్నారు. ఈ మధుని ఇక్కడే ఆపాలి లేదంటే మ్యాడీని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి మహారాణిలా వచ్చేస్తుంది అని అనుకుంటుంది. లోహిత కోసం చందు, సరళ కంగారు పడతారు. ఇళ్లు వదిలి పెట్టి 3 రోజులు అయింది లోహి ఎందుకు ఇలా చేస్తుందా అని అనుకుంటారు. పెళ్లి చూపులు ఆగిపోయావని అందరూ లోహి ఎవరినో ప్రేమించి లేచిపోయిందని అంటున్నారని బాధ పడతాడు. లోహిత ఫ్రెండ్ మధు నిజం చెప్తుందని తను లోహిత గురించి కచ్చితంగా చెప్తుందని మధుకి విషయం అడగాలి అనుకుంటాడు. లోహిత ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మధు అడ్రస్ అడుగుతాడు.
అడ్రస్ దొరకడంతో మధు ఇంటికి చందు బయల్దేరుతాడు. మ్యాడీ, మధు బయటకు వెళ్తారు. ఎక్కడికి వెళ్తున్నాం అని మధు ఓ చోట స్కూటీ ఆపి మ్యాడీని అడుగుతుంది. మ్యాడీ ఏదైనా ఒక జాబ్ చేస్తాను అంటాడు. నువ్వు జాబ్ చేయడం ఏంటి అని మధు అడిగితే మీ నాన్నకి మేం భారం అవ్వకూడదు మధు.. బావ, లోహి నా బాధ్యత వాళ్ల కోసం ఎంత కష్టం అయినా భరిస్తాను.. వాళ్లని ఓడిపోనివ్వను.. అర్థం చేసుకో అని మధుని ఒప్పించి చాలా చోట్ల ఉద్యోగం కోసం తిరుగుతాడు. ఎన్ని చోట్లకు వెళ్లినా మ్యాడీకి నిరాశే మిగులుతుంది. ఎక్కడా ఉద్యోగం దొరకదు. చివరకు ఓ ట్రక్ దగ్గర వాంటెడ్ కుక్ అని చూసి అక్కడికి వెళ్తాడు.
ఆ హోటల్ యజమానిని అడిగితే ఇక్కడ అన్ని రకాల వెరైటీల చేయాలి మధ్యాహ్నం సౌత్ ఇండియా స్టైల్లో చేయాలి అని చెప్తాడు. దానికి మ్యాడీ నాకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, చైనీస్, జపనీస్, ఇంకా చాలా రకాల వంటలు వచ్చు అంటాడు. మధు మనసులో ఇన్ని రకాల వంటలు వచ్చా అని నోరెళ్ల బెడుతుంది. మ్యాడీ ఆ ఓనర్‌కి ఒక్క ఛాన్స్ ఇవ్వమని డెమో ఇస్తానని అంటాడు. ఓనర్ సరే అనడంతో మ్యాడీ గరిటె పట్టుకుంటాడు. నూడిల్స్, చికెన్, పిజ్జా, మంచూరియా.. ఇలా చాలా ఐటెమ్స్ చేసి ఓనర్‌కి టేస్ట్ చేయమని చెప్తాడు. ఓనర్ తిని అద్భుతం అని మ్యాడీతో చెప్తాడు. నీ దగ్గర చాలా టాలెంట్ ఉందయ్యా.. మాస్టర్ కుక్‌గా జాయిన్ అయిపోమని అంటాడు. రోజుకి 500 వందలు ఇస్తానని అడ్వాన్స్‌గా 2000 ఇస్తాడు. మ్యాడీ డబ్బు పట్టుకొని ఎమోషనల్ అయిపోతాడు. మధుని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతాడు.
మ్యాడీ చేతిలో డబ్బు పెట్టి మీ ఫ్యామిలీకి మీ నాన్న హెడ్ అయితే నాకు నువ్వే కదా హెడ్ అని అంటాడు. నేను ఈవినింగ్ వస్తా అని చెప్పి మధుని పంపేస్తాడు. జాయిన్ అయిన రోజే మ్యాడీ చాలా అర్డర్లు తీసుకొని అదరగొట్టేస్తాడు. అందరూ ఫుడ్ సూపర్ అని అంటారు. నా కాళ్ల మీద నేను నిలబడ్డాను.. ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయగలను అన్న ధైర్యం వచ్చింది.. ఇదంతా మీ వల్లే మమ్మీడాడీ థ్యాంక్స్ అని అనుకుంటాడు. చందు మధు వాళ్ల ఇంటికి వస్తాడు. లోహిత చందుని చూసి లోపలికి పరుగులు పెడుతుంది. బేబీ మా అన్నయ్య వస్తున్నాడు మ్యానేజ్ చేయ్ అని తన ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తుంది. దాంతో లోహిత ఫ్రెండ్ చందు దగ్గరకు వెళ్లి మధు, లోహిత అందరూ ట్రిప్‌కి వెళ్లారని చెప్తుంది. లోహిత ఫ్రెండ్ చందుని పంపేస్తుంది.
వరుణ్ లోహిత దగ్గరకు వచ్చి అతను ఎవరు నువ్వు అతన్ని చూసి భయపడుతున్నావ్ అంటే అతను మా కంపెనీలో అకౌంట్స్ చూస్తుంటాడు. నన్ను చూస్తే మా ఇంట్లో చెప్పేస్తాడు అని అంటుంది. వరుణ్ నమ్మేస్తాడు. ఇక లోహిత వరుణ్‌తో మీ అత్తామామల దగ్గరకు వెళ్లి వాళ్లని బతిమాలుదాం.. మ్యాడీ కష్టపడితే మనం చూడలేం కదా అని వరుణ్‌ని ఒప్పిస్తుంది. వరుణ్ భయపడుతూనే ఒప్పుకుంటాడు. ఇద్దరూ బస్‌స్టాప్ దగ్గర ఉంటే మధు చూస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే మ్యాడీ ఇంటికి అని లోహిత చెప్తుంది. మధు వద్దు అని ఎంత చెప్పినా లోహిత వినకుండా వరుణ్‌ని తీసుకొని వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















