Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 11th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: ఊరికి మరో శ్రీమంతుడైన విహారి! యమున కోసం పొలాలు అమ్మేసిన లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 11th యమున కోసం లక్ష్మీ సంతకం చేసిన డాక్యుమెంట్స్‌ని విహారి చింపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, విహారి చెరో వైపు తిరుగుతూ ఊరి జనంతో పొలం అమ్మొద్దని చెప్తుంటారు కానీ ఎవరూ ఇద్దరి మాట వినరు. ఇక యమునని కిడ్నాప్ చేసిన వీర్రాజు లక్ష్మీకి కాల్ చేసి పొలాలు అమ్మినట్లు సంతకం పెడితేనే యమునని విడుదల చేస్తామని అంటాడు.
విహారికి పంతులు యుమన గుడికి రాలేదు అని తెలియడంతో కంగారుగా యమున సెల్‌కి ఫోన్ చేస్తాడు. వసుధ ఫోన్ లిఫ్ట్ చేసి యమున ఇంకా రాలేదు అంటుంది. అమ్మ ఇంటికి రాలేదు.. గుడికి వెళ్లలేదు ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో ఓ రౌడీ డీ కొట్టడం ఇన్‌హేలర్ పడిపోవడం గుర్తు చేసుకొని వీర్రాజు ఇంటికి వెళ్తాడు. అక్కడ యమునని కట్టిన కుర్చీ చూసి షాక్ అయిపోతాడు. యమున తప్పించుకొని రోడ్డు మీద పరుగులు పెడుతుంది. విహారి యమున కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. రౌడీలు రోడ్డు మీద పరుగెడుతున్న యమున కాళ్లలో కర్ర విసిరి కొడతారు. యమున పడిపోయే టైంకి విహారి పట్టుకుంటాడు.
విహారి ఆ రౌడీలను చితక్కొడతాడు. యమున విహారిని పట్టుకొని త్వరగా ఇంటికి వెళ్దాం పద నాన్న నన్ను కిడ్నాప్ చేసి లక్ష్మీతో పొలాలు రాయించుకోవాలని చూస్తున్నారని అంటుంది. ఇద్దరూ పరుగులు తీస్తారు. భక్తవత్సలం ఇంటి దగ్గర అందరూ పంచాయితీకి వస్తారు. అందరూ తమ పొలాలు అమ్మేయడానికి రెడీగా ఉన్నామని అంటారు. అంబిక కావాలనే మా వదిన గుడికి వెళ్లారు ఇంకా రాలేదా అని అడుగుతుంది. ఇంకారాలేదని లక్ష్మీ వాళ్లతో చెప్తుంది. పొద్దున్న వెళ్లినావిడ ఇంకా రాలేదు ఏంటి అని కాదాంబరి అంటుంది. ఇక వీర్రాజు కూడా వచ్చి అందరికీ సంతకాలు పెట్టమని అంటాడు. అగ్రిమెంట్ మీద సంతకాలు పెడితే ఇప్పుడే అడ్వాన్స్ ఇస్తారని అంటాడు.
అంబిక యమునని జాగ్రత్తగా చూసుకోమని అంటే వీర్రాజు అంబికతో యమున తప్పించుకుందని అంటాడు. అంబిక కంగారు పడి త్వరగా లక్ష్మీతో సంతకం పెట్టించుకోవాలని అంటుంది. పార్థసారథి లక్ష్మీకి తన నిర్ణయం అడుగుతాడు. తన నిర్ణయం నిన్నే చెప్పింది కదా అని భక్తవత్సలం అంటారు. అందరి అంచనాలు తలకిందుల చేస్తూ లక్ష్మీ ఆ రెండు వందల ఎకరాలు అమ్ముతానని అంటుంది. ఏంటి లక్ష్మీ నువ్వు అన్నది అని భక్తవత్సలం అడిగితే ఇంకా నీకు అర్థం కాలేదా నాన్న లక్ష్మీ అవకాశవాది అయిందని అని అంటుంది పద్మాక్షి. ఇలాంటి దాన్ని నెత్తిన పెట్టుకున్నారు కదా మంచిదైంది అని అంటుంది. కాదాంబరి కోపంతో ఈ మహాతల్లిని తెచ్చింది ఎక్కడ అని అడుగుతుంది.
లక్ష్మీ అందరితో నేను పొలాలు అమ్మాలి అనుకుంటున్నా ఎవరూ ఏం అడగొద్దు అని అంటుంది. వీర్రాజు లక్ష్మీకి మొదటి సంతకం పెట్టమని అంటాడు. ఒకసారి ఆలోచించు లక్ష్మీ అని భక్తవత్సలం అంటారు. ఆస్తి రాసిచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నాన్న అని అంబిక అంటుంది. లక్ష్మీ సంతకం పెట్టడానికి వెళ్తుంది. లక్ష్మీ సంతకం పెట్టేస్తుంది. తర్వాత వీర్రాజు ఒక్కొక్కరితో సంతకాలు పెట్టేస్తాడు. ఇంతలో విహారి యమునని తీసుకొని వచ్చి ఆగండీ అని అరుస్తాడు. యమునని చూసిన లక్ష్మీ హ్యాపీగా ఫీలవుతుంది. వీర్రాజు విహారితో అగ్రిమెంట్ అయిపోయిందని అంటాడు. అంబిక విహారితో లక్ష్మీ కూడా సంతకం పెట్టేసిందని చెప్తుంది. నిజంగా సంతకాలు పెట్టావా అని విహారి అడుగుతాడు. అవును అని లక్ష్మీ తలూపుతుంది. వీర్రాజు విహారికి డాక్యుమెంట్స్ ఇచ్చి సంతకం చూడమని అంటాడు.
విహారి వాటిని చూసి చింపేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇది క్రైమ్ అని పార్థసారథి అంటే ఇది క్రైమ్ అయితే మా అమ్మని కిడ్నాప్ చేసి లక్ష్మీని బెదిరించడం ఇంకా పెద్ద క్రైమ్ అని అంటాడు. నేనేం చేయలేదు అని పార్థసారథి అంటాడు. ఇక లక్ష్మీ పొలాలు అమ్మను అని చెప్తుంది. లక్ష్మీ తప్ప మిగతా రైతులు పొలాలు అమ్ముతామని అంటే విహారి అడ్డుకుంటాడు. మాకు చాలా అవసరాలు ఉన్నాయి మాకు డబ్బు కావాలి అని అంటే మీ అవసరాలు నాకు తెలుసు అని విహారి అంటాడు. నువ్వు మా పొలాలు కొంటావా అని వీర్రాజు అడిగితే కొనను కానీ మీ పొలాలు నేను లీజుకు తీసుకుంటా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















