Nindu Manasulu Serial Today October 11th: నిండు మనసులు: కొడుకు ఆహ్వానాన్ని మంజుల రిజెక్ట్ చేయడానికి కారణమేంటి? గణని ఈశ్వరి ఎందుకు కొట్టింది?
Nindu Manasulu Serial Today Episode October 11th ప్రేరణకు తప్పుడు వైద్యం గురించి ఎలా తెలిసిందని గణ ఆలోచించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ తీసుకొచ్చిన డాక్టర్ రాజశేఖరానికి మంచి వైద్యం జరగడం లేదని ఇలా అయితే అతను జీవితాంతం బెడ్ మీద ఉండాల్సి వస్తుందని చెప్తారు. ప్రేరణ డాక్టర్‌ని పంపేస్తుంది. ఇప్పుడేమంటారు.. అని ఈశ్వరిని అడుగుతుంది. కన్నతండ్రికి విలువ ఇస్తాడు అన్నారు కదా.. ఇప్పుడు అర్థమైందా నా కన్న తండ్రి భుజాల మీద ఆడిన వాడు ఎంత అన్యాయం చేశాడో అర్థమైందా అని పెద్దమ్మని ప్రేరణ నిలదీస్తుంది.
ప్రేరణ ఈశ్వరితో నేను చెప్పింది తపపు అయితే మమల్ని మా నాన్నని వదిలేసి వెళ్లిపోమని చెప్పారు ఇప్పుడు అంతా రివర్స్ అయింది కదా మా నాన్నని మాకు ఇచ్చేస్తారా.. మా నాన్నతో మీ సంబంధం తెంచుకుంటారా.. కానీ నేను మీలా కండీషన్ పెట్టను.. మా నాన్న ఆరోగ్యంతో కోలుకోవడం ఎంత ముఖ్యమో మేం మా నాన్న పిల్లలం అని మా నాన్న చెప్పాలి అది నీ కొడుకు చూడాలి.. నీ కొడుకు ఎంత గొప్పవాడు అంటే మమల్ని ఇబ్బంది పెట్టాలి అని తల్లి పసుపు కుంకుమలే తుడిచేయడానికి రెడీ అయిపోయాడు అని అంటుంది. మా నాన్న మీ ఇంట్లోనే ఉండాలి కానీ మంచి వైద్యం అందాలి అలా కాదు అంటే మిమల్ని బజారుకి ఈడ్చుతా మీ పరువు కోర్టుకి లాగుతా.. ఇప్పుటి వరకు మా నాన్న కోసం శనివారం మాత్రమే వచ్చేద్దాన్ని కానీ ఇక మీదట నాకు నచ్చినప్పుడు డాక్టర్‌తో వస్తా అని చెప్పి వెళ్లిపోతుంది.
ఈశ్వరి కొడుకుని లాగిపెట్టి కొడుతుంది. కన్న తండ్రికి తప్పుడు వైద్యం చేయించాలని ఎలా అనుకున్నావ్‌రా ఇంత నీచానికి ఎలా దిగజారావురా.. ఎవరైనా తండ్రిని కాపాడుకోవాలి అనుకుంటారు.. కానీ చంపేయాలి అనుకోరు అని అంటుంది. నాన్న నోరు తెరవకుండా ఉండాలి అనుకున్నా అంతే అమ్మా ని అంటాడు. నాన్న బతకాలి కానీ మాట్లాడకూడదు అందుకే ట్రీట్మెంట్ మార్చి ఇస్తున్నా అని అంటాడు. వాళ్ల ఉనికి చెరిపేయడానికి నీ పవర్ వాడు కానీ ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకు అని ఈశ్వరి కొడుకుతో చెప్తుంది. గణ తప్పుడు ట్రీట్మెంట్ గురించి ప్రేరణకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తాడు.
ప్రేరణ కోసం ఇంట్లో అందరూ కంగారు పడుతుంటే ప్రేరణ ఇంటికి వస్తుంది. ప్రేరణ తల్లి వాళ్లతో కొడుకు చేసిన పనికి ఈశ్వరి వణికిపోయిందని ఇక నాన్నని నిర్లక్ష్యం చేయరు అని అంటుంది. ఇందిర ప్రేరణతో నాన్నని చూసుకోవడానికి ఆ ఇంటికి వెళ్తాను అని అంటుంది. ఐశ్వర్య వద్దు అని అంటుంది. ప్రేరణని ఇందిర ఒప్పిస్తుంది. దాంతో ప్రేరణ ఒకే అంటుంది. కానీ గణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని అంటుంది. ఇక ప్రేరణకు సిద్ధూ కాల్ చేసి రేపట నుంచి కాఫీ షాప్ పనులు చేయించానని చెప్తాడు. ప్రేరణ సంతోషంగా తల్లి వాళ్లకి విషయం చెప్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు.
సిద్ధూ తల్లి దగ్గరకు వెళ్తాడు. ఇన్విటేషన్ కార్డు ఇస్తే విజయానంద్ తీసుకోబోతే విజయానంద్‌కి ఇవ్వకుండా తల్లికి ఇచ్చి రేపే మా స్టడీ కేఫ్ ఓపెనింగ్ మొదటి పత్రిక నీకు చెల్లికి మాత్రమే ఇస్తున్నా.. మీ సపోర్టు లేకుండా ఏం చేయలేను అన్నారు కదా ఇదే నా మొదటి అడుగు.. నువ్వు చెల్లి తప్పకుండా రావాలి అని అంటాడు. దానికి మంజుల నువ్వు మొదటి అడుగు కాదు వంద అడుగులు ఎక్కాలి అని అనుకున్న వారిలోనేను మీ నాన్న మొదట ఉంటాం.. కానీ నేను ఓపెనింగ్‌కి రాలేను.. నా భర్తకి ఆహ్వానం లేని చోటుకి నేను రాలేను అని అంటుంది. ఇక సాహితి వచ్చి కంగ్రాట్స్ చెప్తుంది. అందరం వస్తామ్ అమ్మ అని సాహితి అంటుంది. దాంతో మంజులు వెళ్లిపోతుంది.
ఇందిర భర్తతో మీ కూతురు ఎదిగిపోయింది మీ బాధ్యత తను భుజాన వేసుకుంది అని కాఫీ షాప్ గురించి చెప్తుంది. ఇంతలో గణ అక్కడికి వస్తాడు. దాంతో ఈశ్వరి అలర్ట్ అయిపోయి రాజశేఖరం ఒళ్లు తుడుస్తుంది. గణ ఏయ్ అనగానే ఏంటి బాబు అని అంటుంది. గణ ఇందిరతో నీకు మా నాన్న ముందే తెలుసా అని అడుగుతాడు. లేదు అని ఇందిర అంటుంది. పోనీ నేను తెలుసా అని అంటే లేదు అని అంటుంది. టైంకి అన్నీ చేస్తావ్ మా నాన్న నీకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తున్నావ్ అని అంటాడు. జీతం తీసుకుంటున్నా కదా సార్ అందుకే అని అంటుంది. ఇంతలో సుధాకర్ వచ్చి మంచి పని మనిషి సార్ త్వరలోనే మీ నాన్న పరుగెడతారు అని అంటే మా నాన్న ఎప్పుడు లేస్తాడో నాకు తెలుసు అని గణ వెళ్లిపోతాడు. ఏం మనిషిరా బాబు అని సుధాకర్ అంటాడు. ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కుమార్ సిద్ధూతో ఓపెనింగ్ అదిరిపోవాలిరా నీ బిజినెస్ పార్టనర్ కాస్త నీ లైఫ్ పార్టనర్ కావాలి అని అంటాడు. దాంతో సిద్ధూ రేయ్ అంటూ కుమార్‌ని కొట్టాలనిఅనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















