Illu Illalu Pillalu Serial Today October 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి ఐలవ్‌యూ చెప్పిన ధీరజ్! కలెక్టర్ మెచ్చుకున్న కోడళ్లని రామరాజు అర్థం చేసుకుంటాడా!
Illu Illalu Pillalu Serial Today Episode October 13th ప్రేమకు ధీరజ్ ఐలవ్‌యూ అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ వస్తారు. అందరితో పాటు రామరాజు విష్ చేసినా ఆయన పట్టించుకోరు..అక్కడే ఉన్న నర్మద విష్ చేయడంతో కలెక్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అని నర్మదని గుర్తు పడతారు. నర్మదతో మాట్లాడుతారు. ఇక నర్మద తన ఫ్యామిలీని పరిచయం చేస్తాను అని రామరాజు, వేదవతి, సాగర్, చందు, తిరుపతిని పరిచయం చేస్తుంది. మామయ్య గారు కష్టపడి పని చేశారు.. 20 మందికి పని కల్పిస్తున్నారు.. కోడళ్లని కూతుళ్లులా చూసుకుంటారు ఇలా మొత్తం రామరాజు గురించి చెప్తుంది. కలెక్టర్ రామరాజుని పొగుడుతారు.
కలెక్టర్ పోలీసులతో పాప తప్పిపోయింది కదా దొరికిందా మంచి పని చేశారు ఇలాగే డ్యూటీ చేస్తూ ఉండండి అని అంటారు. దానికి పోలీస్ మేం కాదు సార్ అని ప్రేమని చూపించి ప్రేమ పాపని కాపాడింది అని చెప్తారు. కలెక్టర్ ప్రేమని పొగుడుతారు. నర్మద ప్రేమతో తను నా తోటి కోడలు అని చెప్తుంది. దాంతో కలెక్టర్ ఒక కోడలు నిజాయితీ పరురాలు మరో కోడలు సోషల్ రెస్పాన్స్ ఉంది.. మీ కోడళ్లు మీ తలెత్తేలా చేస్తారు అని నర్మద, ప్రేమని పొడుగుతారు. వల్లీ కుళ్లుకుంటుంది. వేదవతి ఇద్దరు ముద్దుల కోడళ్లని దగ్గరకు తీసుకొని అందరి ముందే ముద్దాడుతుంది. ముగ్గురు అన్నదమ్ములు, వేదవతి ఇద్దరు కోడళ్లు ఇద్దరు కూతుళ్లు ఒక్కటైపోవడంతో వల్లీ ఈర్ష్యతో అరుస్తుంది.
భాగ్యం, ఆనంద్‌రావుల వ్యాపారం జోరుగా సాగుతుంది. శ్రీవల్లి బయటకు వెళ్లి తల్లిదండ్రుల్ని చూసి షాక్ అయిపోతుంది. తల్లి దగ్గరకు వెళ్లి ఇంకెక్కడ మీకు చోటు లేనట్టు ఇక్కడే కొట్టు పెడతారా మా మామయ్యకి తెలిస్తే అయిపోతుంది అని అంటుంది. అప్పుడే మీ మామయ్యకి తెలిసిపోయింది అని భాగ్యం అనడంతో అయ్యయ్యో అని ఏడుస్తుంది. ఏమైంది అని భాగ్యం అడిగితే నాకు విలువ లేకుండా పోయింది.. ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు అని అంటుంది. ఏమైంది అని భాగ్యం అడిగితే కలెక్టర్ గారు నర్మద, ప్రేమల్ని పొగిడేశారని అంటుంది. ఆ ఇద్దరు కోడళ్ల కంటే నాదే పై చేయి అవ్వాలి ఏదో ఒకటి చేయ్ అమ్మా అని అంటుంది. నర్మద గవర్నమెంట్ ఉద్యోగం చూసి రెచ్చిపోతుంది. నర్మదని చూసి ప్రేమ రెచ్చిపోతుంది.. ఇద్దరి అంతు చూసే ఆలోచన నా దగ్గర ఉంది నువ్వు రిలాక్స్ అయిపో అని భాగ్యం కూతురితో చెప్తుంది.
రామరాజు దగ్గరకు వేదవతి వెళ్లి మన కోడళ్లు పరువు తీయడానికే వచ్చారు అన్నారు కానీ వాళ్లు మీ పరువు పెంచడానికి పాటు పడుతున్నారని కలెక్టర్ గారు అన్నారు. మన కోడళ్లని మనం అర్థం చేసుకోవడం లేదు కానీ బయట వాళ్లకి వాళ్ల మంచి అర్థమవుతుంది. వాళ్లు ప్రేమ పెళ్లి చేసుకొని వచ్చారని మీకు కోపం ఉంది కానీ వాళ్లు మన కోసమే మన గౌరవం కోసమే ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని వేదవతి రామరాజుకి చెప్తుంది. వాళ్లు మన అదృష్టం వాళ్లని మనం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే మన ఇళ్లు కూడా సంతోషంతో నిండిపోతుందని చెప్తుంది.
ప్రేమ ధీరజ్ కోసం వెతుకుతూ ఉంటే నర్మద లేడీ సూపర్‌స్టార్ అని అంటూ వస్తుంది. నీ ప్రేమ గురించి చెప్పావా అంటే లేదు అక్క చెప్పే టైంకి పాప గురించి తెలిసింది.. ఇప్పుడు చెప్పాలి అని చూస్తున్నా అని అంటుంది. ధీరజ్ చేతిలో గులాబి తీసుకుంటూ రావడం చూసిన నర్మద ఇక నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు.. నీ ప్రేమ దేశపు యువరాజు నువ్వు చేసిన పనికి ఇంప్రెస్ అయి చేతిలో గులాబి తీసుకొని వచ్చేస్తుంటాడు అని అంటుంది. ప్రేమ తెగ సిగ్గు పడిపోతుంది. ప్రేమ ధీరజ్ దగ్గరకు వచ్చి ఈ మధ్య నీతో మాట్లాడుతుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. మనసులో అలజడి.. అది కూడా కొత్తగా హాయిగా ఉంది.. ఈ ఫీలింగ్ ఏంటా అని నా మనసుని చాలా సార్లు అడిగా నా మనసు నీ పేరు చెప్పింది. నా మనసుని కొత్తగా తాకిన ఈ ఫీలింగ్ పేరు ప్రేమ అని అర్థమైంది.. అని మోకాలి మీద కూర్చొని ఐలవ్‌యూ ప్రేమ అని చెప్పి గులాబి ఇస్తాడు. ప్రేమ పొంగిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















