Nuvvunte Naa Jathaga Serial Today October 13th: నువ్వుంటే నా జతగా: మిథున-దేవా మధ్య ఏం జరుగుతోంది! ఆస్తి కోసం త్రిపుర ప్లాన్, దొంగ ఎంట్రీతో ట్విస్ట్!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 13th మిథున పేరు మీద ఉన్న ఆస్తి రాహుల్ పేరున రాయించమని పద్మ త్రిపురకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున, దేవా ఇంట్లో ఇరుక్కున్న సీన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దేవా మిథున చేసిన వంట తినను అని బిల్డప్ ఇచ్చి తన వంట తానే చేస్తాడు. అయితే కుక్కరు పేలిపోవడంతో వంట పాడవుతుంది. దాంతో మిథున తినమన్నా దేవా తినకుండా బెట్టు చేసి తర్వాత మిథున చూడకుండా చాటుగా తింటాడు. అయితే దేవా చాటుగా తినడం మిథున చూసేస్తుంది.
త్రిపుర తన తల్లి పద్మతో మాట్లాడుతుంది. పద్మ త్రిపురతో నిన్ను ఆ ఇంటి కోడల్ని చేసింది.. మిథునని మన ఇంటి కోడల్ని చేయాలి అనుకుంది ఆస్తి మీ అక్కాతమ్ముళ్లు చేతుల్లోనే ఉంటుందని కానీ మిథున ఆదిత్యల పెళ్లి అయ్యేలా లేదని పద్మ అంటుంది. దానికి త్రిపుర నేను రాహుల్ పెద్ద ప్లాన్ చేశాం.. మిథున దేవా విడిపోవడం పక్కా.. మిథునకు తమ్ముడికి పెళ్లి కావడం పక్కా అని చెప్తుంది. పద్మ కూతురితో ఇంతకు ముందు ఇలాగే చెప్పావ్ .. ఈ సారి అలాగే అవ్వదు అని గ్యారెంటీ ఏంటి.. పైగా మీ మామయ్యకి ఆ దేవా మీద పాజిటివిటీ ఉంది.. మిథున దేవాని రౌడీయిజం నుంచి మార్చేసింది అంటే ఇక మీ మామయ్య పక్కా ఒప్పుకుంటారు. దేవాని అల్లుడిగా ఒప్పుకుంటే మిథున పేరు మీద ఉన్న ఆస్తి దేవాకి దక్కుతుంది. వాడి కుటుంబం మొత్తం అనుభవిస్తారు. అందుకే మిథున పేరు మీద ఉన్న ఆస్తి మీ ఆయన పేరు మీద రాసేలా చేయమని పద్మ త్రిపురకు సలహా ఇస్తుంది. ఆస్తి ఎక్కడికీ పోదు.. మిథున ఎక్కడికీ పోదు.. అని త్రిపుర అంటుంది.
దేవా ఇంటికి ఓ దొంగ దూరుతాడు. తన లవర్ పుట్టిన రోజుకి నగలు అడగటంతో వాటిని కొనివ్వడానికి దొంగ అవతారం ఎత్తుతాడు. ఇక మిథున, దేవా పడుకోవడానికి రెడీ అవుతారు. దేవా మిథునని చూసి నా మిథునకి వంట రాదు అనుకున్నా సూపర్‌గా చేసింది. మొత్తానికి హ్యాపీ అనుకుంటూ అనుభవించు రాజా అని పాట పాడుతాడు. మిథున లేచి ఇందాక వరకు ఆకలి అని కడుపు పట్టుకొని మెలికలు తిరిగిపోయావ్.. ఇంతలోనే అనుభవించు రాజా అంటున్నావ్.. మాటలు కూడా ఫోర్స్‌గా వస్తున్నాయి అంటే కడుపు ఫుల్లుగా తినేశావా.. ఇంతకీ వంట ఎలా ఉంది అని అడుగుతుంది. నన్ను అడుగుతావేంటి నేను ఏమైనా దొంగలా తిన్నానా అని దేవా అడుగుతాడు. దాంతో మిథున నువ్వు పిల్లాలి తినడం నేను చూశా అని అంటుంది.దేవా మనసులో అబ్బా దొరికిపోయానురా అనుకుంటాడు. ఇంతలో ఇంటిలో దొంగ దూరుతాడు. మిథున, దేవా సౌండ్‌లు విని వచ్చి చూస్తారు.
రాహుల్‌తో త్రిపురు మిథున పేరు మీద ఉన్న ఆస్తి తన పేరు మీద రాయాలని చెప్పమని అంటుంది. రాహుల్ సరే అడుగుతా అని వెళ్లి అడగలేకపోతాడు. దాంతో త్రిపుర అడగకపోతే ఆ రౌడీ ఆస్తి తీసుకెళ్లిపోతాడు అని అంటుంది. కొడుకు అల్లుడు గుసగుసలు విన్న హరివర్థన్ ఏమైందని త్రిపురని అడుగుతాడు. త్రిపుర మామతో దేవా ఆస్తి కోసమే మిథునని పెళ్లి చేసుకున్నాడు. రేపో మాపో మిథునని అడ్డు పెట్టుకొని ఆస్తి ఇవ్వమంటాడు అందుకే మిథున పేరు మీద ఉన్న ఆస్తి కూడా మీ అబ్బాయి పేరున రాసేయండి అని త్రిపుర అడుగుతుంది. ఇంత వరకు ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ ఆస్తి టాపిక్ ఏంటి అని హరివర్థన్ అడుగుతాడు. దేవాకి ఆస్తి మీద ఆశే లేదు ఎందుకు ఏదేదో అంటున్నావ్ అని త్రిపురని అత్త అంటుంది. త్రిపుర మౌనంగా ఉన్న మామతో మీరు మీ నిర్ణయం చెప్పండి అని అంటుంది. ఏం చేయాలో ఏంటో నాకు తెలుసు అని హరివర్థన్ వెళ్లిపోతాడు.
మిథున, దేవాలు దొంగ కోసం వెతుకుతూ ఉంటారు. మిథున కాంతం వాళ్ల గది తాళం బద్దల కొట్టడం చూసి దేవాని పిలుస్తుంది. దేవా దొంగ టవల్ మీద కాలు పెట్టడం దొంగలాగేయడంతో మిథున దేవా ఒకరి మీద ఒకరు పడిపోతారు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు. మిథున దేవాతో ఇదే వంక చూసుకొని నా మీద పడతావేంటి.. కనపడవు కానీ చాలా కొంటె వేషాలు ఉన్నాయని అంటుంది. అవునులే నువ్వు పెద్ద అతిలోక సుందరివి అని కావాలనే పడ్డాను అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















