కేజీఎఫ్ స్టార్ యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. తన కెరీర్ ప్రారంభంలోనే యశ్ అనే పేరును స్టేజ్ నేమ్‌గా మార్చుకున్నారు. అదే ఇప్పుడు అతనికి స్టార్ డమ్‌ని తెచ్చింది.
సినిమాల్లోకి రాకముందు యశ్ టీవీ సీరియల్స్‌తో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. నందా గోకుల, సిల్లీ లల్లీ, మలేబిల్లు, ప్రీతి ఇల్లాడ మేలే సీరియల్స్‌లో నటించాడు.
గూగ్లీ (2013), మిస్టర్ అండ్ మిసెస్ రామచారి (2014), మాస్టర్ పీస్ (2015) సినిమాలతో హార్ట్‌త్రోబ్‌గా యశ్‌కి గుర్తింపు వచ్చింది. కె.జి.యఫ్. చాప్టర్ 1 (2018) యశ్ని సూపర్‌స్టార్‌ని చేయగా.. కె.జి.యఫ్. చాప్టర్ 2 (2022) స్టార్‌డమ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
యశ్ టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సినిమాతో 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కేజీఎఫ్ 3లో మరోసారి రాఖీగా కనిపించే అవకాశముంది. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అలాగే రామాయణ్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెడుతున్నాడు యశ్. దీనిలో రావణ పాత్రలో కనిపించనున్నారు.
2007లో 'జంబడ హుడిగి'తో సినీరంగ ప్రవేశం చేసిన యశ్ నికర ఆస్తి 53 కోట్లు ఉంటుందని అంచనా. వార్షిక వేతనం 7 నుంచి 8 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆస్తులు, స్థిరాస్తుల విలువ సుమారు 6 కోట్లు. బ్రాండ్ ఎండార్స్మెంట్లకు అతను తీసుకునే ఫీజు 60 లక్షలు.
హోజింగ్కామ్ ప్రకారం యశ్ బెంగళూర్‌లో అందమైన డూప్లెక్స్ హౌజ్‌ని కలిగి ఉన్నాడు. దీని విలువ 4 కోట్లు ఉంటుదట. MercedesBenz GLS, Audi Q7, BMW 520D, mariyu Pajero Sport కార్లు యశ్‌కి ఉన్నాయి.
యశ్ తన భార్య రాధికతో కలిసి యశో మార్గ ఫౌండేషన్ను స్థాపించారు. దీని ద్వారా పేదలకు సహాయం చేస్తూన్నారు ఈ కపుల్స్. కొప్పల్ జిల్లాలో సరస్సులను పునరుద్ధరించడానికి 4 కోట్లు పెట్టుబడి పెట్టారు.