ఎవరీ నారా రోహిత్? ఆయన బ్యాగ్రౌండ్ తెలుసు... మరి, వరుసలు? ఎవరికి ఏమవుతారో తెలుసుకోండి.

నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకు స్వయానా తమ్ముడి కొడుకు నారా రోహిత్.

రోహిత్ తండ్రి పేరు రామూర్తి నాయుడు. ఉమ్మడి ఏపీలో చంద్రగిరి ఎమ్మెల్యే (1994)గా ఎన్నికయ్యారు.

రోహిత్ నారాకు భువనేశ్వరి పెద్దమ్మ అవుతారు. తల్లి, పెద్దమ్మతో రోహిత్.

నారా లోకేష్, నారా రోహిత్ కజిన్స్. అంటే... వరుసకు అన్నదమ్ములు.

బాలకృష్ణకు నారా రోహిత్ మేనల్లుడి వరుస. అంటే... అసలు మేనల్లుడు లోకేష్ తమ్ముడు కదా!

జూనియర్ ఎన్టీఆర్, నారా రోహిత్ సైతం కజిన్స్ అవుతారు. అయితే వాళ్ళది బావ బామ్మర్ది వరుస.

నారా రోహిత్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కానున్నారు. ఆయనకు కాబోయే భార్య పేరు సిరి లేళ్ల. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది.

'ప్రతినిధి 2'లో నారా రోహిత్, సిరి లేళ్ల నటించారు. పవన్ 'ఓజీ'లో సిరి ఓ క్యారెక్టర్ చేశారు.

'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది.

'బాణం' తర్వాత వరుసగా విజయాలు అందుకున్న రోహిత్ స్పీడుకు ఆ తర్వాత బ్రేకులు పడ్డాయి.

కొంత గ్యాప్ తీసుకుని మల్టీస్టారర్ 'భైరవం'తో నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చారు.

సోలో హీరోగా నారా రోహిత్ రీ ఎంట్రీ సినిమా 'సుందరకాండ'. ఆగస్టు 27, 2025లో రిలీజ్ అయ్యింది.

పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా ఎటువంటి దర్పం, అహం చూపించకుండా అందరితో కలిసిపోతారు రోహిత్.