విజయ్ సేతుపతి బెస్ట్ పర్​ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలివే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: IMDb

విక్రమ్ వేధా - రేటింగ్ 8.2/10

ఈ థ్రిల్లర్​లో సేతుపతి ఆర్ మాధవన్​తో కలిసి నటించారు. ఈ సినిమా ఒక డైనమిక్ రిజల్ట్ ఇచ్చింది. గ్యాంగ్​స్టార్ పాత్రలో నటించిన విజయ్.. తన నటనతో అభిమానులను బాగా ఆకట్టుకున్నారు.

Image Source: IMDb

వైఫ్​ ఆఫ్ రణసింగం రేటింగ్ 7.2/10

వైఫ్​ ఆఫ్ రణసింగం సినిమాతో రైతుల దుస్థితిని, భూమి హక్కుల కోసం రాజకీయంగా చేసిన పోరాటాలను తెరపైకి తెచ్చారు. సేతుపతి పాత్ర కార్పొరేట్ స్వాధీనానికి వ్యతిరేకంగా రైతులు చేసే పోరాటానికి మద్దతు ఇస్తుంది. ఈ సినిమాలో విజయ్ నటించలేదు జీవించారు.

Image Source: IMDb

జవాన్ - రేటింగ్ 6.9/10

సేతుపతి బాలీవుడ్​లో షారుఖ్ ఖాన్​తో కలిసి నటించిన సినిమా జవాన్. అవినీతిని బయటపెడుతూ నేరాలు చేయడానికి ఖైదీలను నియమించుకునే జైలు వార్డెన్ కథను ఇది వివరిస్తుంది. దీనిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న భిన్నమైన పాత్రలో విజయ్ కనిపిస్తారు.

Image Source: IMDb

విడుదలై భాగం 1 - రేటింగ్ 8.3/10

విడుదలైలో విజయ్ సేతుపతి అవినీతిపై పోరాడే తిరుగుబాటు నాయకుడిగా నటించారు. ఆదర్శవాదిగా కథకు ప్రాణం పోశాడు విజయ్.

Image Source: IMDb

మహారాజా - రేటింగ్ 8.5/10

విజయ్ సేతుపతి ఇంట్లో దొంగతనం జరిగిన తరువాత అతని జీవితం ఎలా తలకిందులైంది. అతను పోలీసులకు తన లక్ష్మిని దొంగిలించారని చెప్పిన తర్వాత.. లక్ష్మీ ఎవరు? అనే దాని నుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది.

Image Source: IMDb

సూపర్ డీలక్స్ రేటింగ్ 8.2య10

విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రంలో సూపర్ డీలక్స్ కచ్చితంగా ఉంటుంది. దీనిలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ సినిమాలో ట్రాన్డ్​జెండర్ మహిళగా నటించి మెప్పించారు విజయ్.

Image Source: IMDb

మాస్టర్ రేటింగ్ 7.4/10

ఈ సినిమా ఇద్దరు స్ట్రాంగ్ వ్యక్తుల మధ్య జరిగే గొడవను చూపిస్తుంది. దీనిలో విజయ్ సేతుపతి భవాని పాత్ర పోషించాడు. పిల్లలతో నేరాలు చేయించే క్రూరమైన గ్యాంగ్ స్టర్​గా నటించారు.

Image Source: IMDb

విక్రమ్ - రేటింగ్ 8.3/10

దర్శకుడు లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాలో విజయ్ విలన్ పాత్ర పోషించి.. లక్షలాది మంది అభిమానులను గెలుచుకున్నాడు.

Image Source: IMDb

96 : రేటింగ్ - 8.5/10

96 విజయ్ సేతుపతి నటుడిగా ఓ మెట్టు ఎక్కించిన సినిమాగా చెప్పొచ్చు. రియాలస్టిక్ పాత్రలో, ఇంట్రోవర్ట్​గా అద్భుతమైన నటనను కనబరిచారు విజయ్.

Image Source: IMDb