అన్వేషించండి

chinni serial today march 18th: చిన్ని సీరియల్: అత్తామామలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన చిన్ని! శ్రేయతో ఏం చెప్పిందంటే!

chinni serial today episode march 18th తన తల్లి ఏ తప్పు చేయలేదని నాగవల్లికి కూడా తెలిసేలా చేయాలి అని చిన్ని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ వేరే గదిలో పడుకుంటా అని వెళ్తుంటే చిన్ని కావాలనే బొమ్మలు పట్టుకొని ఇక్కడ ఉంటే నిగ్రహం కోల్పోతావనే కదా బయటకు వెళ్లిపోతున్నావ్.. పైకి కోపం చూపించినా భార్య మీద చాలా ప్రేమ ఉంది అని అని అంటుంది. దాంతో మ్యాడీ నాకు నీ మీద ఏం ప్రేమ లేదు అని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మొత్తానికి మ్యాడీని ఆపేశానని చిన్ని సంతోషపడుతుంది. 

ఆఫ్ టికెట్ బాలరాజు కాలు సెట్ అవ్వాలని మసాజ్ చేస్తాడు. బాలరాజు, ఆఫ్ టికెట్ దగ్గరకు మేనేజర్ వచ్చి నేను చెప్తే అన్నీ అందరూ వింటారు కానీ చిన్ని అలియాస్ మధుమిత మాత్రం నాతో అన్నీ చేయిస్తుంది. మా బాస్ మ్యాడీకి ఆ చిన్ని కి మధ్య ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది. వాళ్లిద్దరూ గతంలో లవర్స్‌లా ఉన్నారు అదే నిజం అని నాకు తెలిస్తే ఆ చిన్నితో ఓ ఆట ఆడుకుంటా అని అంటాడు. అతను వెళ్తుంటే ఆఫ్ టికెట్ కావాలనే కాలు అడ్డుగా పెట్టి పడేలా చేస్తాడు. 

దేవా పార్వతి ఫొటో ముందు నిల్చొని ఓసేయ్ పార్వతి ఎందుకు నాకు ఇంత టార్చర్ చేస్తున్నావే.. ఆ రోజు నేను అడిగినప్పుడు ఆస్తి ఇచ్చుంటే నిన్ను చంపేవాడిని కాదు కదా.. ఇప్పుడు ఆ కావేరి కూతురు వచ్చి కావేరిని నేను చంపానని నిరూపిస్తా అంటుంది.. అదే జరిగితే నిన్ను కూడా నేనే చంపానని మ్యాడీ, నాగవల్లికి తెలిసిపోతుంది. నా దారికి అడ్డు వచ్చిన నిన్నే చంపిన వాడిని ఆ చిన్నిని చంపలేనా అని అంటాడు. ఇంతలో నాగవల్లి అక్కడికి వస్తుంది. ఆ చిన్నిని చంపాలి అన్న ఆలోచన నీ మనసులో నుంచి నీకు ఇంకా పోలేదా బావ.. అది మనకు సాయం చేయడానికి వచ్చింది.. మా అమ్మ నిర్దోషి అని 30 రోజుల్లో నిరూపిస్తా అంటుంది. అది ఎంత ప్రయత్నించినా.. తను నిరూపించలేదు ఎందుకంటే మా అక్కని వాళ్ల అమ్మ చంపేసిందన్నది పచ్చి నిజం కదా అని అంటుంది. చిన్ని ఆ మాటలు విని.. మ్యాడీతో పాటు నాగవల్లి ఆంటీకి కూడా అమ్మని చంపింది దేవా అంకుల్ అని తెలీదన్నమాట.. మ్యాడీతో పాటు ఆంటీకి కూడా నిజం నిరూపించాలని అనుకుంటుంది. మ్యాడీకి దగ్గరవ్వడానికే ఆ చిన్ని వచ్చింది.. దాని ప్రయత్నాలు ఆపాలి అని నాగవల్లి అంటే అది ఎప్పటికీ జరగదు ఆంటీ అంటుంది. నిజం నిరూపిస్తా మా అమ్మని చంపిన వాళ్లు ఎవరో బయట పెడతా.. నిజం తెలిస్తే ఆ రోజు మీరే నన్ను మెచ్చుకుంటారు అని నాగవల్లితో అంటుంది. మామయ్య గారు మీరు కూడా నన్ను మెచ్చుకుంటారు అని అంటుంది. 

నాగవల్లి దేవాతో దాని కాన్ఫిడెంట్ చూస్తే అక్కని వాళ్ల అమ్మ చంపలేదు అని అనిపిస్తుంది అని అంటుంది. నేను చూశా కదా నాకు నిజం తెలుసు కదా కావేరినే చంపింది అని దేవా అంటే అంతేలే బావ నీకే నిజం తెలుసు కదా అని అంటుంది. లోహిత శ్రేయతో నీకు మ్యాడీకి పెళ్లి అవుతుంది అని అంటే ఏంటి అయ్యేది నాకు నమ్మకం లేదు.. పార్వతి అత్తయ్య ఫొటో పక్కన ఆ చిన్ని వాళ్ల అమ్మ  ఫొటో పెడితేనే అత్తయ్యా ఏం చేయలేదు.. ఇక నాకు బావకి పెళ్లి ఏం చేస్తుంది అని అంటే కచ్చితంగా చేస్తుందని లోహిత శ్రేయకి నమ్మకం కలిగించాలని మాట్లాడుతుంది. ఇంతలో చిన్ని వచ్చి నీకు మ్యాడీకి పెళ్లి జరగదు శ్రేయ అనవసరంగా లోహిత, నాగవల్లి అత్తయ్యా మాటలు నమ్మొద్దు అని అంటుంది. లోహిత చిన్నిని హంతకురాలి కూతురివినీమాటలు ఎవరు నమ్ముతారు  అని అంటే మా అమ్మ నిర్దోషి అని నేను నిరూపిస్తా మ్యాడీకి నిజం తెలిసేలా చేస్తా నా భర్తని నేను దక్కించుకుంటా అని చిన్ని అంటుంది. 

మ్యాడీ కింద పడక వేసుకుంటే నువ్వు కింద పడుకుంటావా నేను మాత్రం దర్జాగా బెడ్ మీద పడుకుంటా అని వెళ్లి సైలెంట్‌గా చాప మీదకు వచ్చేస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని మ్యాడీ అంటే పతినే ప్రత్యక్ష దైవం కదా అంటుంది. దాంతో వెళ్లు ఇక్కడి నుంచి అని మ్యాడీ అనడంతో మధు మళ్లీ బొమ్మలు పట్టుకొని మాట్లాడుతుంది. నిగ్రహం లేనప్పుడు అలాగే దూరంగా పడుకుంటారు.. విగ్రహం ఫుల్ నిగ్రహం నిల్ అని సెటైర్లు వేస్తుంది. దాంతో మ్యాడీ వెళ్లి బెడ్ మీద పడుకుంటాడు. నాగవల్లి దగ్గరకు లోహిత వెళ్లి మ్యాడీ నుంచి చిన్నిని దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో నాకు తెలుసు.. కానీ ఊహించని విధంగా చిన్ని మళ్లీ వచ్చింది.. దాన్ని ఎలా పంపాలా అని చూస్తున్నారు కదా అంటుంది. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Abhishek Yannam: 'ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
ఇంటింటి రామాయణం' సీరియల్ అభిషేక్.. మోడలింగ్ నుంచి బుల్లితెర స్టార్ వరకు!
Jaya Chiravuri: యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
యూఎస్‌లో వ్లాగర్, యూట్యూబ్‌లో సంచలనం.. బుల్లితెరపై ఎంట్రీ.. జయ చిరవూరి రియల్ లైఫ్ స్టోరీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget