అన్వేషించండి

Brahmamudi Serial Today October 5th:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సామంత్‌, అనామికల మధ్య గొడవ – రుద్రాణిని ముసుగేసి కొట్టిన స్వప్న

Brahmamudi Today Episode: అనవసరంగా కావ్యను బయటపెట్టావని ఇప్పుడు కావ్య మనకు డిజైన్స్‌ వేయనంటుందని సామంత్‌, అనామికతో గొడవపెట్టుకోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  ఇంటికి వెళ్లిన రాజ్‌, కావ్యను తిడుతుంటే అపర్ణ, ఇందిరాదేవి, కావ్యను వెనకేసుకోస్తారు. కావ్య కావాలని చేసి ఉండదని చెప్తారు. దీంతో రాజ్‌ కోపంగా తిడుతుంటాడు, రుద్రాణి కూడా కావ్యను తిడుతుంది. కుటుంబ పరువు కోసం ప్రాణాలు  అర్పించే త్యాగమూర్తిలా చూశారు కదా ఇప్పుడు ఏం చేసింది పది సంవత్సరాల గెలుపునంతా బూడిదలో పోసిన పన్నీరు చేసింది. ఇంకా నమ్మలేము అంటూ దీర్ఘాలు తీస్తున్నారా..? అంటుంది. దీంతో రుద్రాణికి అపర్ణ, ఇందిరాదేవి వార్నింగ్‌ ఇస్తారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అంటారు.

రాజ్‌: నాన్నమ్మా నేనే  సాక్ష్యం అన్నింటికీ నేనే సాక్ష్యం నన్ను కూడా నమ్మవా? నేను కూడా అమాయకుడినేనా? లేదు వ్యక్తిగతమైన కోపాన్ని వృత్తి వ్యాపారాల మీద చూపించింది. తన వచ్చిన విద్యను అడ్డుపెట్టుకుని నా మీద పగ పెంచుకుంది. కళావతి ఈ కుటుంబానికి తీరని అన్యాయం చేసింది.

 అంటూ కోపంగా పైకి వెళ్లిన రాజ్‌ బెడ్‌ రూంలోని కావ్య పోటోలు, చీరలు, బట్టలు తీసుకుని వచ్చి బయట పడేసి  పెట్రోల్‌ పోసి తగులబెట్టబోతుంటే అందరూ అడ్డుపడతారు.

రాహుల్‌: మమ్మీ ఏమైనా ప్లాన్‌ వేశావా? ఇక రాజ్‌ జీవితంలో కావ్యను రానివ్వడు.

రుద్రాణి: మరేమనుకున్నావురా ఈ రుద్రాణి అంటే..

రాజ్‌ లోపలికి వెళ్లి అగ్గిపెట్టె తీసుకొచ్చి కాల్చగానే  అప్పుడే  వర్షం పడుతుంది. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు.

అపర్ణ: స్త్రీ అంటే  ప్రకృతితలో సమానంరా.. అలాంటి స్త్రీకి అవమానం జరిగితే ప్రకృతే కాదు  పంచభూతాలు కూడా సహించవు. సహకరించవు. ఈ వస్తువులను దూరం చేసుకున్నంత సులువుగా ఆ జ్ఞాపకాలను చెరపలేవురా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కావ్య నిర్ధోషి అని ప్రకృతే చెప్తుంది. రా లోపలికి.

అందరూ లోపలికి వెళ్లిపోతారు.

రుద్రాణి: ఏంట్రా ఈ మిరాకిల్‌..నిజంగానే కావ్యకు ప్రకృతి సహకరిస్తుందా?

రాహుల్‌: పిచ్చి మమ్మీ.. హైదరాబాద్‌ ల్ వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఆగిపోతాయో ఎవ్వరికీ తెలియదు. అంత మాత్రానా పంచభూతాలు హెల్ప్‌ చేస్తున్నట్లేనా..?

రుద్రాణి: ప్రకృతి మన నెత్తి మీద పిడుగు పడేస్తుదేమో పద లోపలికి వెళ్దాం.

అని ఇద్దరూ లోపలికి వెళ్తారు. మరోవైపు కావ్య బయట కూర్చుని ఏడుస్తుంటే.. కనకం వచ్చి ఏంటని అడుగుతుంది. దీంతో ఎక్స్‌ ఫోలో జరిగిన విషయం చెప్తుంది కావ్య. కనకం షాక్‌ అవుతుంది. నీకు తెలియకుండానే నీ వల్ల తప్పు జరిగిపోయింది అని కనకం చెప్తుంది. మరోవైపు సామంత్‌ టెన్షన్‌ పడుతుంటాడు.

సామంత్‌: లాస్ట్‌ వరకు వచ్చి ఎందుకిలా చేశావు. ఇప్పుడు మనం వెనకుండి నడిపిస్తున్నామని చెప్పడం వల్ల లాభం ఏంటి?

అనామిక: ఇప్పుడు నీకొచ్చిన కష్టం ఏంటి?

సామంత్‌: కష్టం కాదు నష్టం వచ్చింది. ఆ కావ్య ఇప్పుడు డిజైన్స్‌ వేయనని చెప్పేసింది కదా?

అనామిక: ఆ కావ్యను తీసుకొచ్చింది కూడా నేనే కదా?

సామంత్‌: పంపించింది కూడా నువ్వే కదా?

అనామిక: అబ్బా ఇప్పుడేదో కొంపలు  మునిగినట్లు  ఎందుకలా టెన్షన్‌ పడుతున్నావు. ముందు ఇలా రా కూర్చో..

 అంటూ సామంత్‌ కు మందు ఇస్తూ కూల్‌ చేస్తుంది అనామిక. తర్వాత  రుద్రాణికి ఫోన్ చేస్తుంది.

రుద్రాణి: హలో అనామిక..

అనామిక: మీ గొంతు  వింటుంటే మంచి పార్టీ మూడ్‌ లో ఉన్నట్టున్నారు.

రుద్రాణి: దానికి కారణం నువ్వే కదా..ఇన్ని రోజులుగా నేను చేయలేని పని ఈరోజు నువ్వు చేశావు. రాజ్‌ కు కావ్య మీద పర్మినెంట్ గా ధ్వేషం పెరిగేలా చేశావు. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లు బద్ద శత్రువులు  అయిపోయారు.

అనామిక: దాని కోసమే కదా ఆంటీ ఇష్ట కష్టపడింది. ఇప్పుడు ఆ రాజ్‌ పరిస్థితి ఎలా  ఉంది.

రుద్రాణి: ఎలా ఉంటుంది. ఒడ్డున పడ్డ చేపలా గిలాగిలా కొట్టుకుంటున్నాడు. సొంత భార్య చేతిలో ఓడిపోయినందుకు తట్టుకోలేకపోతున్నాడు. ఆ దృష్యం చూస్తుంటే నా కెంత ఆనందంగా ఉందో తెలుసా?

అనామిక: నాకు మాత్రం బాధగా ఉంది ఆంటీ.

రుద్రాణి: అదేంటి.

అనామిక: ఆ మధురమైన సన్నివేశాలు నేను చూడలేకపోతున్నాను కదా..?

 అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతల స్వప్న వచ్చి వింటుంది. షాక్‌ అవుతుంది. వెనక నుంచి వచ్చి రుద్రాణికి ముసుగు వేసి కొట్టి వెళ్తుంది. రుద్రాణి ఎవరు నన్ను కొట్టింది అని ఆలోచికస్తుంది.  ఇంతల రాహుల్‌ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. నన్ను ఎవరో ముసుగు వేసి కొట్టారురా అని చెప్తుంది. మళ్లీ స్వప్న వచ్చి మిమ్మల్ని ముసుగు వేసి కొట్టారా? అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. ఎంతో మంది కొంపలు కూల్చుంటారు కదా వారిలో ఎవరో వచ్చి కొట్టి ఉంటారు. జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం

ALSO READ: ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శనివారం అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20i Update: భారత్ భారీ స్కోరు , అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
భారత్ భారీ స్కోరు , అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20i Update: భారత్ భారీ స్కోరు , అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
భారత్ భారీ స్కోరు , అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
kadiri Registrar: ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
ఏపీలో రోడ్డెక్కిన రిజిస్ట్రేషన్లు - టీ షాపులో కూర్చుని రిజిస్ట్రార్ సంతకాలు, కదిరిలో ఘటన
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Abhishek Century: అభిషేక్ స్టన్నింగ్ సెంచరీ - సిక్సర్లతో ఊచకోత, టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
అభిషేక్ స్టన్నింగ్ సెంచరీ - సిక్సర్లతో ఊచకోత, టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
Embed widget