Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today February 28th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: వ్యభిచారం కేసులో లక్ష్మీ అరెస్ట్! అసలు ట్విస్ట్ ఇదే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode February 28th లక్ష్మీని వ్యభిచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ భుజంగం అడ్రస్ వెతుక్కుంటూ వ్యభిచారం జరిగే ఇంట్లోకి వెళ్తుంది. ఇంతలో కొంతమంది అధికారులు రైడ్ కోసం అక్కడికి వెళ్తారు. అంబిక మొత్తం విని లక్ష్మీని ఇరికించే అవకాశం వచ్చిందని వీర్రాజుకి ఏం చేయాలో చెప్తుంది. పోలీసులు వచ్చేలోపు వీర్రాజు లక్ష్మీ ఉన్న వైపు వెళ్తాడు. మరోవైపు విహారి ఇంటికి వచ్చి యమున కోసం వెతుకుతాడు. ఓ చోట యమున కనిపించడంతో సంతోషంగా ఉంటాడు. ఇంతలో పండు రావడంతో అమ్మని కనిపెట్టుకొని ఉండమని అంటాడు.
విహారికి సంధ్య కాల్ చేసి లక్ష్మీ ఫోన్ కలవడం లేదు.. తను ఇచ్చిన అడ్రస్ కోసం ఎంక్వైరీ చేస్తే ఆ అడ్రస్ ఇల్లీగల్ పనులు జరుగుతాయని.. ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని అంటుంది. లక్ష్మీ హాస్పిటల్‌లో ఉందని వెంటనే విహారి లక్ష్మీకి కాల్ చేస్తాడు. లక్ష్మీ లేదని డాక్టర్ చెప్తుంది. డాక్టర్ లక్ష్మీ ప్రెగ్నెంట్ అని చెప్పేలోపు విహారి ఫోన్ కట్ చేసేస్తాడు. విహారి వాళ్లకి ఎప్పుడు ఈ విషయం తెలుస్తుందో అని అనుకుంటుంది. లక్ష్మీ గురించి విహారి చాలా కంగారు పడతాడు. విహారి వెంటనే సంధ్యకి కాల్ చేస్తాడు. మీరు చెప్పిన అడ్రస్‌కే వెళ్లుంటుంది అని అంటే అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదం అని అంటుంది. సంధ్య అర్జెంట్ పని మీద శ్రీశైలం వెళ్తున్నా అని చెప్తుంది.
లక్ష్మీ ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఈ ఇళ్లు చాలా తేడాగా ఉంది అని అనుకుంటుంది. విహారిని బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని కనిపెట్టాలని అనుకుంటుంది. వీర్రాజు లక్ష్మీని చూసి ఫాలో అవుతాడు. లక్ష్మీని ఓ గదిలోకి నెట్టేసి తలుపు వేసేసి ఫోన్ తీసుకుంటాడు. తర్వాత లక్ష్మీ ఫోన్ తీసుకొని వీర్రాజు పారిపోతాడు. లక్ష్మీ ఎంత తలుపు కొట్టినా ఎవరూ తీయరు. ఇక విహారి లక్ష్మీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. లొకేషన్‌కి పోలీసులు వచ్చేస్తారు.
పోలీసులు వచ్చి ఇంట్లో అన్న అందరినీ అరెస్ట్ చేస్తారు. అందరితో పాటు లక్ష్మీని కూడా అరెస్ట్ చేస్తారు. లక్ష్మీ తనకు ఏ తప్పుచేయలేదు అని అంటే ఇక్కడ వ్యాపారం చేస్తూ బాగా నటిస్తున్నావ్ అని అంటారు. లక్ష్మీ ఎంత చెప్పినా వినకుండా లక్ష్మీతో పాటు అందరినీ పోలీసులు తీసుకెళ్తారు. అప్పుడే విహారి అక్కడికి వస్తాడు. కనకాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అని విహారి అడిగితే నీ కనకం ఇక్కడ వ్యాపారం చేస్తుందని చెప్తారు. విహారి లక్ష్మీని వదలకపోవడంతో పోలీసులు విహారిని లాగేస్తారు.
లక్ష్మీని తీసుకొని పోలీసులు వెళ్లిపోతారు. అప్పుడే విహారికి అజ్ఞాత వ్యక్తి భుజంగం కాల్ చేసి నీ ప్రాణానికి ప్రాణం అంటే మీ అమ్మ అనుకున్నావా .. ఎలా ఉంది ట్విస్ట్ .. నాకు కోపం వచ్చింది అందుకే నీ పెళ్లాన్ని అరెస్ట్ చేయించా అంటాడు. మరోవైపు సహస్ర, పద్మాక్షిలు డాక్టర్‌ని కలిసి మాట్లాడుతారు. ఇంతలో నర్సు పద్మాక్షిని ఢీ కొట్టడంతో లక్ష్మీ ఫైల్ కింద పడిపోతుంది. ఒకమ్మాయి ప్రెగ్నెంట్ అయి చెప్పేలోపు వెళ్లిపోయిందని నర్స్ అంటుంది.
ఎవరు ఆ దురదృష్ట వంతురాలు అని సహస్ర అంటుంది. ఇంతలో కనకం వ్యభిచారం చేయించే ఇళ్లు నడుపుతుందని న్యూస్ వస్తుంది. పద్మాక్షి, సహస్ర అది చూస్తారు. లక్ష్మీని పోలీసులు తీసుకెళ్లడం సుభాష్ వీడియో తీస్తాడు. లక్ష్మీని పోలీసులు సెల్‌లో వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























