Nindu Manasulu Serial Today February 28th:నిండు మనసులు: ఇందిర-గణల మధ్య యుద్ధం! కూతుళ్లకు ముప్పు! సిద్ధూ ఆరాటం ఎందుకు!
Nindu Manasulu Serial Today Episode February 28th ప్రేరణ, ఐశ్వర్యల్ని చంపేస్తానని గణ ఇందిరను భయపెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సుధాకర్‌ని ఇందిర ఓరేయ్ తమ్ముడు అని పిలవడంతో గణ, ఈశ్వరిలకు సుధా ఇందిర తమ్ముడు అని తెలిసిపోతుంది. అమాయకంగా ముఖం పెట్టి ఇంత చేస్తావా.. వాళ్ల వెనక ఉండి నడిపించింది నువ్వేనా అని అంటుంది. వాళ్లకి నాకు ఏం సంబంధం లేదు అని సుధా అంటాడు. మీ ఇద్దరి మధ్య అక్కాతమ్ముళ్లు సంబంధం లేకపోతే ఆమె అలా ఎందుకు పిలుస్తుంది. మిమల్ని వదలను అని గణ అంటాడు. నేను చెప్పేది వినండి సార్ అని బతిమాలుతాడు. వాళ్లకి అంత ధైర్యం ఎక్కడిది అనుకుంటే నీ వల్లే కదా.. ఈ ధైర్యం లేకుండా చేయాలి గణ అని ఈశ్వరి అంటుంది.
సుధాకర్ గణతో చెప్పేది వినండి సార్ తనకి నాకు ఏం సంబంధం లేదు.. తను నా అక్క కాదు.. సాయం చేశానని తమ్ముడు అని పిలిచింది.. అంతే కానీ మీ నమ్మిన బంటుని ఇలా అనుమానిస్తారా.. అని మొసలి కన్నీళ్లు కార్చుతాడు. నిజం దాచినా దాగదు.. ఇప్పుడు వెళ్లి మందులు తీసుకురా మీ అక్క చెప్పినవి అని అంటాడు. తను మా అక్క కాదు సార్.. నేను మీ నమ్మిన బంటు.. అని అంటాడు. మరోవైపు ప్రేరణ కుమార్‌కి కాల్ చేస్తుంది. సిద్ధూకి చెప్పి స్పీకర్ పెడతాడు. ఐషూ కాఫీ బాగా పెడుతుంది కదా మరి అలా అయింది ఎందుకు.. నువ్వు చూసుకోవాలి కదా.. ఆ పెద్ద మనిషి కూడా అక్కడే ఉన్నాడు కదా.. ఐశ్వర్య బదులుగా తనకే కాఫీ పెట్టమని అంటుంది. సిద్ధూ ప్రేరణ వినేలా ఏరా మాకు పరీక్షలు లేవా.. మేం ఎందుకు పెడతాంరా.. విలువైన టైంని నేను కాఫీలకు స్పెండ్ చేయలేను.. ఆవిడకేనా లక్ష్యం ఉంది.. మాకు లేదా చెప్పరా కుమార్ అని అంటాడు. తనకే పెట్టమని చెప్పు అని ప్రేరణ అంటే నేను పెట్టను చెప్పరా అని అంటాడు. కావాలనే చేస్తున్నాడు కదా అని ప్రేరణ అంటుంది. చెప్పు కుమార్.. అడుగు కుమార్ అని కుమార్ని మధ్యలో పెట్టుకొని ఇద్దరూ గొడవ పడతారు.
పరిస్థితులకు భయపడి ఆవిడలా నేను దాక్కోవడం లేదురా కుమార్.. ఆవిడని కూడా అలాగే కేఫ్‌కి రమ్మని చెప్పాను చెప్పరా కుమార్ అని సిద్ధూ అంటుంది. దాంతో ప్రేరణ కుమార్‌తో కేఫ్‌కి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే జాగ్రత్తగా చూసుకో అని చెప్పి నేను కేఫ్కి రాను అని అంటుంది. ఇందిర భర్తకి సేవలు చేసి ఈశ్వరి, గణలతో మీ నిర్లక్ష్యం వల్ల ఆయన కోలుకోవడం లేదు.. జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది. గణ ఇందిరను ఆపి మాకు సలహాలు ఇచ్చే స్థాయికి ఎదిగాను అనుకుంటున్నావా.. అసలు నా గురించి పూర్తిగా తెలిస్తే తట్టుకోలేవు.. ఇంకోసారి మా ఆయన అంటూ ఇంట్లో అడుగు పెడితే ఏం చేస్తానో నాకు తెలీదు అంటే ఏం చేస్తావ్ అని ఇందిర అడుగుతుంది. ఇప్పుడు నా దగ్గర పవర్ ఉంది దాన్ని అడ్డు పెట్టుకొని ఏమైనా చేస్తా అంటాడు. భయపెడుతున్నావా,. ఆయన కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తా అని అంటుంది. దీనికి మన ముందు నిల్చొనే అర్హత ఉందా అని ఈశ్వరి అంటే అర్హత గురించి నువ్వు అనొద్దు.. నీ స్థాయి ఏంటో నాది అదే స్థాయి అంటుంది ఇందిర.
గణ అరుస్తూ మీరు వైజాగ్ నుంచి ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోండి లేదంటే కోలుకోని దెబ్బ తింటారు అంటే మేం రోజూ వస్తాం ఏం చేస్తావో చేయ్ అని అంటుంది ఇందిర. నీ ధైర్యం నీ కూతుళ్లు కదా వాళ్లని చంపేస్తా అప్పుడు నీ ధైర్యం పోతుంది అని అంటాడు. నేను జరగబోయేదే చెప్తున్నా నీ కూతుళ్లు అవమానంతో ఒక్కొక్కరు చస్తారు..అప్పుడు నువ్వు కుళ్లి కుళ్లి చస్తావ్ అంటాడు. ఇందిర భయంతో ఏడుస్తుంది. ఇంతలో సుధాకర్ మందులు తీసుకొని వస్తాడు. మరోవైపు ఐశ్వర్య కిచెన్‌లో ప్రయోగాలు చేస్తూ ఉంటే సిద్ధూ కుమార్‌లు వెళ్లి మీ అక్క చెప్పినట్లు బాధ్యతగా లేవు ఏంటి అన్నీ సక్రమంగా ఉండాలి అని అన్నీ చెప్తారు. ఇంత ఉంటుందా అని ఐశ్వర్య నోరెళ్లబెడుతుంది. ఐశ్వర్యతో కేఫ్‌లో పనులు అన్నీ చేయిస్తారు. ఒక్క రోజు ఇన్ని చేస్తే నీ పరిస్థితి ఏంటా అంటారు దాంతో ఐశ్వర్య నేనేం చేయను అని పారిపోతుంది.
ఇందిర ఇంటికి డల్‌గా వస్తే ఏమైందని ప్రేరణ అడుగుతుంది. దాంతో ఇందిర జరిగింది చెప్తుంది. గణకి భయపడి మనం వెళ్లిపోవడం ఏంటమ్మా.. ఏది ఏమైనా మనం ఇక్కడే ఉండాలి అంత వరకు ప్రాణాలు అయినా పోనీ కానీ ఇక్కడే ఉంటా అని ప్రేరణ అంటుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి నా వల్ల కాదు అక్క అని అంటుంది. నేను అక్కడికి వెళ్లలేను అని ప్రేరణ అంటుంది. సిద్ధూ గారు నిన్ను ఏం అనడం లేదు కదా అతను ఎప్పటిలా ఉండాలి అంటున్నాడు మరి ఎందుకు దూరం పెట్టాలి అనుకుంటున్నావ్ అంటుంది. ఎవరి లిమిట్స్‌లో వాళ్లు ఉంటే మంచిది అని ప్రేరణ అంటే దానికి సిద్ధూ ఓకే ప్రేరణ ఇంటి లోపలికి రావడం నేను లిమిట్స్ క్రాస్ చేసినట్లు అనిపిస్తే బయటే వెయిట్ చేస్తా అని వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.























