అన్వేషించండి

Navaratri 3rd day: ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శనివారం అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత ఇదే!

Annapurna Devi Alankaram:విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ...అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమివ్వనుంది

Dussehra Navratri 2024  Third Day:  ఆశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. ఇంద్రకీలాద్రిపై  నవరాత్రి ఉత్సవాల్లో  భాగంగా దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది.  మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండో రోజు వేదమాత గాయత్రిగా అనుగ్రహించిన అమ్మవారు మూడో రోజు శనివారం  అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శమిస్తుంది. 

అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞాన వైరగ్య సధ్ధ్యర్థం. భిక్షాం దేహిచ పార్వతి
మాత చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర:
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్

సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే ఆకలిదప్పులుండవు. ప్రాణకోటికి జీవనాధారం అన్నం...అందుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. 
 
లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. 

ఈ రోజు అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దధ్యోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. 

Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!
 
ఆలయాల్లో అన్నపూర్ణేశ్వరిని దర్శించుకున్నా..ఇంట్లో నిత్య పూజ చేసుకున్నా.. ఈ అష్టకం చదువుకుంటే మంచిది.

శ్రీ అన్నపూర్ణేశ్వరీ  అష్టకం (Sri Annapurna Ashtakam )

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||  
అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే

జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ||  
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః

బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ||

బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా తరలిరావడమే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం.అన్నపూర్ణ దేవిని తెలుపు, పసుపు పూలతో పూజించాలి. ఈ రోజు అన్నపూర్ణాదేవి స్తోత్రాలతో పాటూ ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరి కూడా చదువుకుంటే శుభఫలితాలు పొందుతారు. 

Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Pawan Kalyan in Palnadu: సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
సరస్వతి భూముల్ని పరిశీలించిన పవన్ కల్యాణ్ - జగన్ పై సంచలన ఆరోపణలు
YS Sharmila: వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీది పాపం, కూటమి సర్కార్ చర్యలు ప్రజలకు శాపం - విద్యుత్ ఛార్జీలపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్
Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే
Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 
Embed widget