October Month Festivals 2024: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!
Festivals list in October 2024: బతుకమ్మ, దసరా ఉత్సవాలతో ప్రారంభమయ్యే ఆశ్వయుజ మాసం/ అక్టోబరు నెల.. ధనత్రయోజశి, నరకచతుర్థశి, దీపావళి అమావాస్యతో ముగుస్తుంది. ఈ నెలలో పండుగల డేట్స్ ఇవే...
Aswayuja Masam Festivals : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు అశ్విని నక్షత్రానికి దగ్గరగా ఉండటంతో ఈ నెలకు ఆశ్వయుజం అని పేరొచ్చింది. ఆషాడం మొత్తం గురుపూజకు, శ్రావణం మొత్తం లక్ష్మీ పూజకు, భాద్రపదం విఘ్నేశ్వర ఆరాధనకు, ఆశ్వయుజం శక్తి ఆరాధనకు, కార్తీకం శివారాధనకు విశిష్టమైనవి. ఈ నెలలో వచ్చే శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కతిలోనే విలక్షణమైనవి. ఏటా నవరాత్రులు రెండుసార్లు నిర్వహిస్తారు.. ఉత్తరాయణంలో చైత్ర నవరాత్రులు, దక్షిణాయనంలో శరన్నవరాత్రులు నిర్వహిస్తారు. ఆశ్వయుజంలో అనుసరించే నవరాత్రులు ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని, విజయాన్ని ప్రసాదిస్తాయని దేవీభాగవతంలో ఉంది.
Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!
అక్టోబరులో వచ్చే పండుగలు
అక్టోబరు 01 మంగళవారం మాస శివరాత్రి
అక్టోబరు 02 బుధవారం మహాలయ అమావాస్య/ బతుకమ్మ పండుక ప్రారంభం
అక్టోబరు 03 గురువారం శరన్నవరాత్రులు ప్రారంభం ..కలశ స్థాపన
అక్టోబరు 09 బుధవారం సరస్వతీదేవి పూజ
అక్టోబరు 10 గురువారం బతుకమ్మ పండుగ - దుర్గాష్టమి
అక్టోబరు 11 శుక్రవారం మహర్నవమి
అక్టోబరు 12 శనివారం విజయ దశమి, శమీపూజ
అక్టోబరు 17 గురువారం గౌరీ పూర్ణిమ, వాల్మీకి జయంతి
అక్టోబరు 19 శనివారం అట్లతద్ది
అక్టోబరు 20 ఆదివారం సంకటహర చతుర్థి
అక్టోబరు 28 సోమవారం అందరకీ ఏకాదశి
అక్టోబరు 30 బుధవారం ధనత్రయోదశి
అక్టోబరు 31 గురువారం నరకచతుర్థశి , దీపావళి - లక్ష్మీపూజ
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
సరస్వతీ పూజ
శరన్నరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ జరుగుతుంది. నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేయలేనివారు..మూలా నక్షత్రం రోజు నుంచి విజయదశమి వరకూ శక్తిపూజ చేసినా ఉత్తమ ఫలితాలు పొందుతారు.
మహర్నవమి
నవరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత ప్రధానమైనవి..వాటిలో మొదటి రోజు మహర్నమవి. దసరా పూజకు ఈ రోజే ప్రధానం. ఆ తర్వాత రెండు రోజులు శమీపూజ, అమ్మవారి ఉద్వాసన చేస్తారు. ట
విజయదశమి
తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారిని పూజించిన వారు..ఈ రోజు ఉద్వాసన చెబుతారు. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేస్తారు. సంధ్యాసమయంలో విజయముహూర్తంలో శమీపూజ చేస్తే చేపట్టిన సకల కార్యాల్లో విజయం తథ్యం అని భావిస్తారు.
Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
జమ్మిచెట్టు దగ్గర చేయాల్సిన ప్రార్ధన
అమంగళానాం శమనీం దుష్ఫుతస్య చ ।
దుస్వపష్ననాశనీం ధన్యాం ప్రపద్యేహం శమీంశుభామ్ ॥
శమీ శమయతే పాపం శమీ లోహిత కంటకా ।
ధరిత్ర్యర్హున బాణానాం రామస్య ప్రియవాదినీ ॥
కరిష్యమాణయాత్రాయాం యథాకాలం సుఖంమయా।
తత్ర నిర్విఘ్న కర్రీత్వం భవ శ్రీరామపూజితే॥
ఆశ్వయుజ పౌర్ణమి
ఆశ్వయుజ మాసం పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు శక్తి ఆరాధనకు విశేషమైన రోజులు. ఈ రోజు లలితా సహస్రనామ పారాయణం మంచి ఫలితాలను ఇస్తుంది.
అట్లతద్దె
చంద్రుడి కళలో గౌరీదేవిని ఆరాధించే రోజు ఇది. ఈ పండుగ కన్యలకు, వివాహితులకు అత్యంత ముఖ్యమైనది. పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత చంద్రుడిని , గౌరీదేవిని పూజిస్తారు. ముత్తైదువులకు అట్లు వాయినంగా సమర్పించి ఆ తర్వాత ఉపవాసం విమరిస్తారు. ఈ నోము నోచుకుంటే అవివాహితులకు మంచి భర్త..వివాహితులకు సౌభాగ్యం లభిస్తుందని స్వయంగా శివుడు పార్వతీదేవికి చెప్పిన నోము ఇది.
దీపావళి
శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులు ఎంత ప్రత్యేకమైనవో..ఆశ్వయుజమాసం చివర్లో వచ్చే చివరి మూడు రోజులూ అంతే ముఖ్యమైనవి. పౌర్ణమి తర్వాత వచ్చే త్రయోదశి రోజు ధన త్రయోదశి, ఆ తర్వాత నరక చతుర్థశి, ఆశ్వయుజం ఆఖరిరోజు దీపావళి అమావాస్య జరుపుకుంటారు. ఇల్లంతా దీపాల వెలుగులతో నింపేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. ఈ రోజు లక్ష్మీపూజ నిర్వహిస్తారు.