అన్వేషించండి

Brahmamudi Serial Today November 26th:  ‘బ్రహ్మముడి’ సీరియల్: అప్పు, కళ్యాణ్‌ లను అవమానించిన అనామిక – విశ్వరూపం చూపించిన ధాన్యలక్ష్మీ  

Brahmamudi Today Episode:  పానీపూరి తింటున్న  అప్పు, కళ్యాణ్‌ లను అనామిక ఘోరంగా అవమానించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:  కావ్య, అపర్ణ ఇంట్లో లేకపోవడంతో ఇంటి మెయింటనెస్‌ ఎవరు చూసుకుంటారు అంటూ ప్రకాష్‌, రాజ్‌ను ప్రశ్నించగానే ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి పిన్ని ఉంది కదా..? అంటాడు రాజ్‌.  ఇప్పటికే ఇంట్లో వేరు కుంపటి పెట్టుకున్న మీ పిన్ని ఇంటి బాధ్యతలు ఎలా చూసుకుంటుంది.. అంటూ ప్రకాష్‌ చెప్పగానే ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది. నేను నా కొడుకు కళ్యాణ్‌ కోసం ఇదంతా చేస్తున్నాను అంటుంది. ఇంతలో సుభాష్‌ మీరు ఆపండి అంటూ రాజ్‌ నువ్వు మీ మమ్మీని తీసుకొస్తావా…? తీసుకురావా..? అది చెప్పు నాకు అంటాడు. దీంతో రాజ్‌ నేను తీసుకురాలేనని చెప్పి పైకి వెళ్లిపోతాడు. సుభాష్‌, అపర్ణకు ఫోన్‌ చేస్తాడు.

సుభాష్‌: హలో అపర్ణ నువ్వు ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగిపోతుంది.

అపర్ణ: ఏంటండి మీరు మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారు.  అనుకున్నవన్ని జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుందండి కష్టపడాలి సాధించాలి.  మీరేం టెన్షన్‌ పడకండి.. ఇంకో రెండు రోజుల్లో వాడు వాడి తప్పు తెలుసుకుని వస్తాడు చూడండి.

ఇంతలో కావ్య అక్కడకు వస్తుంది.

కావ్య: తప్పు చేస్తున్నావు అత్తయ్యా  మీ అబ్బాయితో కలిసి వెళ్లిపోవాల్సింది.  

అపర్ణ: నేను ఇక్కడ నీకు భారంగా ఉన్నానా..? నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను. అయినా ఈ మధ్య నాకు సలహాలు ఇచ్చే వాళ్లు ఎక్కువ అయిపోయారు.

కావ్య: మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది. కొంచెం ప్రేమగా ఉండేవారు. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నా మీద అరుస్తున్నారు.

అపర్ణ: ఇన్ని రోజుల ప్రేమగా చెప్పినందుకే నువ్వు నీ మొగుడు కలిసి కాపురాన్ని ఇలా వెలగబెట్టారు.

 అంటూ అపర్ణ, కావ్య తిట్టి ముందు చికెన్‌ రెడీ చేయ్‌ నీ చేతి వంట తిని చాలా రోజులైంది అంటుంది. సరేనని కావ్య వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీ ఆలోచిస్తూ  కూర్చుంటే రుద్రాణి వెళ్తుంది.

రుద్రాణి:  నువ్వు ఎంతలా ఆలోచించినా ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ నీ కొడుక్కు జరిగే న్యాయం ఏమీ ఉండదు.  నా మాటలు నీకు కోపం తెప్పించవచ్చు కానీ ఆలోచిస్తే నిజం కనిపిస్తుంది.

ధాన్యలక్ష్మీ: నిజం కనిపిస్తుంది కాబట్టే వేరు కుంపటి పెట్టాను.

రుద్రాణి: పెట్టి ఏం సాధించావు. నీ వంట నువ్వు చేసుకోవడం తప్పా.. ఈ ఇంట్లో మన పొజిషన్‌ ఏంటో మన మాటకు ఇచ్చే విలువ ఏంటో  నువ్వే ఆలోచించు. నీ కొడుకుకు న్యాయం కావాలని అడిగితే టైం అడిగారు. అదే కావ్యను ఆఫీసులోంచి పంపించేయగానే మా వదిన అక్కడకు వెళ్లి కూర్చుంది. కావ్యను ఇంటికి తీసుకొచ్చేయాలి. కళ్యాణ్‌ గురించి అయితే టైం కావాలని అంటున్నారు.

అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. ఎలాగైనా ఆస్థి పంపకాలు జరిగేలా చూడాలని మనసులో అనుకుంటుంది. మరోవైపు కళ్యాణ్‌, అప్పు రోడ్డు మీద వెళ్తూ.. పానీపూరి బండి దగ్గర ఆగి పానీపూరి తింటుంటారు. ఇంతలో అనామిక వస్తుంది.

అనామిక: నా గెస్‌ నిజమైంది. ఆదర్శ ప్రేమికులు రోడ్డు మీద పడ్డారు.

అప్పు: మనుషులు అన్నాక రోడ్డు మీదే తిరుగుతారు.

అనామిక: రోడ్డు మీద తిరగడానికి, రోడ్డున పడటానికి చాలా తేడా ఉంది అప్పు.

అప్పు: అసలు ఏంటి నీ సమస్య..

అనామిక: సమస్యలు మీ దగ్గర పెట్టుకుని నన్ను అడుగుతావేంటి..?  

అప్పు: మాకేం సమస్యలు లేవే.. మేము హ్యాపీగానే ఉన్నాము.

అనామిక: ఇలా రోడ్డు పక్కన దొరికినవి తింటూ హ్యాపీగా ఉన్నారా..?

అప్పు: మేము ఏ ఫుడ్డు తిన్నా.. నీ బాడీలో ఉన్నంత కొలెస్ట్రాల్‌ , కొవ్వు మాకు లేవులే..

అనగానే అనామిక కోపంగా కళ్యాణ్‌ను తిడుతుంది. నువ్వేప్పటికైనా అసమర్థుడివే అంటూ కించపరుస్తుంది. నడిరోడ్డు మీద అప్పు, కళ్యాణ్‌లను ఇంసల్ట్‌ గా మాట్లాడుతుంది. అప్పు కోపంతో అనామికను కొట్టబోతే కళ్యాణ్‌ ఆపుతాడు. అనామిక వెళ్లిపోతుంది. అపర్ణ లేదని తనకు రూంలో నిద్ర పట్టడం లేదని సుభాష్‌ వెళ్లి రాజ్‌ రూంలో పడుకుంటాడు. మమ్మీ లేకపోతే నిద్ర పట్టడం లేదనడం విచిత్రంగా ఉందని రాజ్‌ అంటాడు. మరోవైపు కళ్యాణ్‌ విషయంలో ప్రకాష్‌ ఏమీ చేయడం లేదని ధాన్యలక్ష్మీ కోపంగా ప్రకాష్‌ను బెడ్‌ రూంలోంచి బయటకు గెంటి వేస్తుంది.  ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Chevireddy Bhaskar Reddy: అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
అత్యాచారం అంటూ తప్పుడు ప్రచారం- అడ్డంగా బుక్కైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి- పోక్సో కేసు నమోదు
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Embed widget