Brahmamudi Serial Today November 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లో వాళ్లను తిట్టిన స్వప్న – సారీ చెప్పిన రాహుల్
Brahmamudi serial today episode November 21st: ఆఫీసు నుంచి వచ్చిన స్వప్న ఇంట్లో వాళ్లను తిడుతుంటే రాహుల్ వచ్చి సారీ చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: సుభాష్, అపర్ణ ల వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌ను వెరైటీగా ప్లాన్ చేసిన రాజ్, కావ్యలు అందులో భాగంగా అపర్ణ, సుభాష్‌ల పెళ్లిచూపులు ఫ్రోగ్రాం ఏర్పాటు చేస్తారు. అందరూ పెళ్లి చూపుల ఫ్రోగ్రాంలో హ్యాపగా ఉండగా ఆఫీసు నుంచి స్వప్న వస్తుంది.
కావ్య: అక్కా ఏంటి అలా ఉన్నావు
స్వప్న: ఇళ్లంతా చప్పట్లలో మారిమోగిపోతుంది నవ్వులతో నిండిపోతుంది. అందరి ముఖాల్లో కాంతి నిండిపోతుంది.. బాగుంది చాలా బాగుంది
అప్పు: ఏంటి ఈ సందడి మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావా..? బావకు క్యారేజ్ ఇవ్వడానికి నువ్వే వెళ్లావు కదా..?
కావ్య: అక్కా రేపు అత్తయ్య వాళ్ల వెడ్డింగ్ డే అని తెలుసు కదా ఎందుకు వెళ్లావు..
స్వప్న: నాభర్తకు మీరు పని ఇచ్చే యజమానులే కానీ తిండి పెట్టి ఆకలి తీర్చే వాళ్లు కాదు కదా..?
ఇందిరాదేవి: నీ మొగుడికి ఎవరో తిండి ఎలా పెడతారు..? స్వయంగా నీ చేత్తో వండిన తిండి పెట్టాలనుకున్నావు.. క్యారేజ్ తీసుకెళ్లావు.. దానికే ఎందుకు ఈ పుల్ల విరిపు మాటలు
స్వప్న: కళ్లు చెదిరే నిజాలు చూసినప్పుడు ఇలాంటి పుల్ల విరుపు మాటలే వస్తాయి అమ్మమ్మ..
రాజ్: నిజాలేంటి..? అబద్దాలేంటి..? ఇప్పుడు ఏమైంది స్వప్న
కావ్య: ఎందుకు అక్క అదో రకంగా ఉన్నావు..
స్వప్న: ఎదుటి వాళ్లు ఏ రకంగా ఉన్నారో మీరు ఇట్టే చెప్పగలరు.. కానీ మీరు ఎప్పుడు ఏ రకంగా మారుతున్నారో మీకు తెలియదు.. తెలుసుకునే ప్రయత్నం ఊడా చేయరు..
సుభాష్: ఇప్పుడు ఏం జరిగిందని అంత ఉక్రోషంగా మాట్లాడుతున్నావు స్వప్న
కావ్య: అక్కా ఎవరు మారారని ఎవరి గురించి మాట్లాడుతున్నావు అక్కా
స్వప్న: మీరు మారారు.. నేను మీ గురించే మాట్లాడుతున్నాను. మనుషుల్ని గిల్లి జోల పాడేవాళ్లు ఉంటారు. వాత పెట్టి వెన్న రాసే వాళ్లు ఉంటారు. కానీ అందరి ముందు అందలం ఎక్కించి చాటుగా అధః పాతాళానికి తొక్కే వాళ్లను మిమ్మల్నే చూస్తున్నాను..
రాజ్: ఏం మాట్లాడుతున్నావు స్వప్న అసలు ఏం జరిగింది
స్వప్న: ఆదరించే చోట నిన్ను ఎవరైనా చీదరించుకుంటే నీ భార్య ఒప్పుకుంటుందా..? గౌరవించే మనుషులు అగౌరవ పరుస్తూ అవమానిస్తే కావ్య సహిస్తుందా…? ఇప్పుడు నా భర్త కూడా ఆఫీసులో అదే స్థితిలో ఉన్నాడు
ఇందిరాదేవి: వాడికి ఏమైంది ఇప్పుడు వాణ్ని ఎవరు అవమానించారు..
స్వప్న: చెప్పింది చేయాల్సిన కింది స్థాయి ఉద్యోగులు నా భర్త మాటలు పట్టించుకోవడం లేదు. ఆర్డర్ వేస్తే చేతులు కట్టుకుని వినాల్సిన మనుషులు రాహుల్‌ను లెక్క చేయడం లేదు.. అతను మాట్లాడితే నాన్సెన్స్ ప్రశ్నిస్తే న్యూసెన్స్ ఇదంతా చూశాక నేనెలా తట్టుకుంటాను.. అసలు దీని అంతటికి కారణం ఎవరు..?
సుభాష్: ఇంకెవరు నీ మొగుడే..? గౌరవ మర్యాదలు అడుక్కుంటేనో కొనుక్కుంటేనో రావు అవి మన క్యారెక్టర్ ను బట్టి వస్తాయి
ప్రకాష్: వాడి గురించి ఆఫీసులో అందరికీ తెలుసు కాబట్టి అలా జరిగి ఉంటుంది. వాడికి గౌరవం దక్కాలంటే అంత తేలిక కాదు..
స్వప్న: అవును నా మొగుడికి గౌరవం దక్కాలంటే తేలిక కాదు.. అతను మారాడు అని మీరందరూ నమ్మాలంటే తేలిక కాదు.. కానీ అవకాశం ఇచ్చి లాగేసుకోవడం తేలికే..
అంటూ స్వప్న అందరినీ ప్రశ్నిస్తుంటే రుద్రాణి కూడా తోడై అందరిని తిడుతుంది. ఇంతలో రాహుల్ వచ్చి స్వప్నను రుద్రాణిని వారించి రాజ్, కావ్యకు సారీ చెప్పి వెల్లిపోతాడు. తర్వాత స్వప్న దగ్గరకు వెళ్లి సారీ చెప్పి ఓదార్చినట్టే నటిస్తూ తన మాటలతో స్వప్న మరింత రెచ్చగొడతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















