Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కనకం నాటకం బయటపెట్టిన రుద్రాణి – స్వప్నను ఓదార్చిన కావ్య
Brahmamudi Today Episode: సీమంతంలో ప్లాస్టిక్ పండ్లను పెట్టిన కనకం నాటకాన్ని రుద్రాణి పసిగట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఫన్నీగా జరిగింది.
![Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కనకం నాటకం బయటపెట్టిన రుద్రాణి – స్వప్నను ఓదార్చిన కావ్య brahmamudi serial today episode January 15th written update Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కనకం నాటకం బయటపెట్టిన రుద్రాణి – స్వప్నను ఓదార్చిన కావ్య](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/15/28b2c52454f5866f223dd28c23c2c5f51736906272382879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brahmamudi Serial Today Episode: వచ్చిన రాజ్ ఫ్యామిలీ మొత్తం సీమంతం కోసం కనకం ఇంటికి వస్తారు. ఇంటి ముందు నిలబడి కనకం ఏర్పాట్లు బాగానే చేసినట్టు ఉంది అంటుంది ఇదిరాదేవి. కనకాన్ని ప్రతి విషయంలో అవమానించాలని ముందే ప్లాన్ ప్రకారం వచ్చిన రుద్రాణి వాళ్ల స్థాయి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటుంది. దీంతో స్వప్న, కావ్య రుద్రాణిని తిడతారు. ఇంట్లోకి వెళ్తుంటే స్వప్న తన నెక్లెస్ మర్చిపోయి వచ్చాను అంటుంది. నెక్లెస్ లేకపోయినా నువ్వు మహాలక్ష్మీలా ఉన్నావని సుభాష్, కావ్య అంటారు. స్వప్న సరే నువ్వేంటి దివాలా తీసిన దానిలా ఒక్క నగ వేసుకోలేదు అంటుంది రుద్రాణి. ఇంట్లోనే మర్చిపోయానని సర్ది చెప్తుంది కావ్య. కనకం ఎదురుగా వచ్చి స్వాగతం పలుకుతుంది.
కనకం: అబ్బబ్బా ఏం మెరిసిపోతున్నావే.. దుగ్గిరాల ఇంటికి కోడలివి అనిపించుకున్నావు.
రుద్రాణి: మేం మా బాధ్యతలు బాగానే చేస్తున్నాం కానీ నువ్వే దుగ్గిరాల ఇంటి వియ్యంకురాలివి అనిపించుకోలేకపోతున్నావు..
కనకం: రుద్రాణి గారికి వెటకారం బాగా ఎక్కువ..
రుద్రాణి: నీకు కామన్ సెన్స్ తక్కువ
కనకం: అదేంటి అలా అన్నారు
ధాన్యలక్ష్మీ: ఈ ఏర్పాట్లు చూస్తే ఎవరైనా అలానే అనుకుంటారు
కనకం: అదేంటి బాగాలేదా..? అన్ని దగ్గరుండి నేనే చేయించాను
రుద్రాణి: అందుకే ఇంత చీఫ్‌గా ఉన్నాయి
కనకం: వదిన గారు భలే కామెడీ చేస్తున్నారు..
రుద్రాణి: ఇలా మాటలతో మభ్యపెడుతూ తూతూ మంత్రంగా చేయిస్తావని నేను ముందే ఊహించాను
అపర్ణ: అందరూ నువ్వు ఊహించనట్టు ఉండరు రుద్రాణి.. పరిస్థితులను అర్థం చేసుకో
కావ్య: అయినా ఆకాశమంత పందిరి ముఖ్యం కాదు మా అక్కను దీవించే విశాల హృదయాలు ముఖ్యం. ఇక్కడ అలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు
రుద్రాణి: అది మీకు గౌరవంగా ఉండొచ్చేమో కానీ మాకు పుట్టబోయే మనవడికి అవమానంగా ఉంటుంది. దరిద్రాన్ని తల్లి కడుపులో ఉన్నప్పుడే అనుభవించే కర్మ పట్టిందేమో
ధాన్యలక్ష్మీ: పోనీలే ఉన్నంతలో సర్దుకుపోదాం
రుద్రాణి: అంతదూరం నుంచి అన్ని సర్దుకుని వచ్చింది ఇక్కడ సర్దుకుపోవడానికా..?
అని రుద్రాణి మాట్లాడుతుంటే ఇందిరాదేవి తిడుతుంది. ఇంతలో స్వప్న నా సీమంతం అంటే ఎంతో ఊహించుకున్నాను కానీ ఇలా చేస్తారని అనుకోలేదు అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. స్వప్న వెనకాలే వెళ్లిన కావ్య.. స్వప్నను కన్వీన్స్ చేసేలా మాట్లాడుతుంది.
కావ్య: అక్కా అక్కడ సీమతం చేస్తే.. గ్రాండ్‌గా ఉంటుందేమో కానీ అక్కడికి వచ్చే బంధువులు మన డబ్బును చూసి వస్తారు. మనం సంతోషంగా ఉంటే కుళ్లుకుంటారు. అదే మన కష్టాల్లో ఉంటే నలుగురి చెప్పి నవ్వుకుంటారు. కానీ ఇక్కడకు వచ్చే వాళ్లంతా మనఃస్పూర్తిగా దీవించడానికే వస్తారు. పప్పను అన్నం పెట్టినా సంతోషంగా తిని హ్యాపీగా నిన్ను దీవించి వెళ్తారు. కానీ అక్కడ మనం ఎంత ఖర్చు పెట్టినా చేసిందంతా ఒక్కమాటతో వేస్టే అంటూ తేల్చేస్తారు. కూరలో ఉప్పు తక్కువైనా అసలు తిండే బాగాలేదని దెప్పి పొడుస్తారు.
స్వప్న: అవును కావ్య నువ్వు చెప్పింది నిజమే..
కావ్య: అయినా ఇది మనం పుట్టి పెరిగిన ఇల్లు. ఈ ఇంటికి మనకు ఎన్ని తీపి గుర్తులు ఉన్నాయి.
అంటూ కావ్య చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. దీంతో స్వప్న సంతోషంగా నువ్వు ఇక్కడ సీమంతం చేసుకోమనడమే కరెక్టు అంటుంది. రుద్రాణి తనకు బాగా ఆకలి వేస్తుందని సీమంతం కోసం పెట్టిన ప్లాస్టిక్ పండ్లు తినబోతుంది. సీమంతం శ్రీను వచ్చి అడ్డుకుంటాడు. శ్రీనును కొట్టి తినబోతుంటే కనకం వచ్చి ఆపుతుంది. అయినా వినుకండా ఒక పండు కొరికి ఇవి ప్లాస్టిక్ పండ్లా అంటూ తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు కావ్యను బెడ్‌రూంలోకి పిలిచిన రాజ్.. తమ మొదటి రోజు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)