Anchor Suma: రియల్ ఎస్టేట్ చీటింగ్‌పై స్పందించిన యాంకర్ సుమ - అసలు జరిగింది ఇదంటూ వివరణ
Raki Avenues controversy: రియల్ ఎస్టేట్ సంస్థ వివాదంపై తాజాగా యాంకర్ సుమ స్పందించింది. దీనిపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నానని, తనకు కూడా లీగల్ నోటీసులు అందాయంటూ వివరణ ఇచ్చింది.
Anchor Suma Aout Raki Avenues controversy: ప్రముఖ యాంకర్ సుమ తాజా ఓ వివాదంలో చిక్కుకున్న ఓ వార్త చక్కర్లు కొడుతుంది. రియల్ ఎస్టేట్ చీటింగ్ వ్యవహారంలోకి బాధితులు యాంకర్ సుమను లాగుతున్నారు. గతంలో ఆమె చేసిన రియల్ ఎస్టేట్ యాడ్‌ని నమ్మి అందులో డబ్బులు పెట్టి మోసపోయామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సుమ స్పందించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సుమ ఈ వ్యవహారంపై తాజాగా స్పందించింది. ఈ ప్రకటనతో తనకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక సుమ లేఖ రిలీజ్ చేసి ఇలా వివరణ ఇచ్చింది.
"రాకీ అవెన్యూస్‌కి సంబంధించిన మోసం ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. నా నా వృత్తిలో భాగంగా గతంలో రాకీ అవెన్యూస్ యాడ్‌లో నేను నటించాను. కానీ దానితో నా ఒప్పందం 2016 నుంచి 2018 వరకే ముగిసింది. ఆపై దీనికి సంబంధించిన ప్రకటన రద్దు కూడా చేశారు. ఇప్పుడు ఆ సంస్థతో నాకు ఎలాంటి సంబంధం, లావాదేవీలు కానీ లేవు. ఒప్పందం తర్వాత నేను ఆ కంపెనీకి సంబంధించిన ఎలాంటి ప్రకటనలో నటించలేదు. అయితే, కొంత కాలం తర్వాత పాత ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని నా దృష్టికి వచ్చింది.
View this post on Instagram
అయితే రీసెంట్‌గా నేను రాకీ అవెన్యూల ఆస్తుల కొనుగోలుదారుల నుంచి కొన్ని లీగల్ నోటీసులు అందుకున్నాను. ఆ తర్వాత నేను వారి నోటీసులకు సమాధానం కూడా ఇచ్చాను. కానీ ఈ వ్యవహరంలోకి అక్రమంగా నన్ను లాగుతున్నారు. కానీ, రాకీ అవెన్యూలకు పంపిన లీగల్ నోటీసులో కొనుగోలుదారుల జాబితాను కూడా పరిశీలించమని వారిని కోరాను. నేను కూడా ఈ సమస్యను పరిష్కరించేందకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. అదికారిక అధికారిక ఛానెల్‌ల నుంచి వచ్చే ఏదైనా ప్రకటనలు, ప్రమోషన్‌లు, వీడియోలను గుర్తించి తప్పుడు సమాచారాన్ని అరికట్టండి. ధృవీకరించబడిన సమాచారాన్ని మాత్రమే ఇతరులతో పంచుకోవాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ సుమ తన ప్రకటనలో పేర్కొంది.
ఇంతకీ అసలేమైందంటే..
రాజమండ్రిలో రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తామంటూ ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు సుమతో యాడ్ ప్రకటన ఇచ్చింది. ఇందులో అపార్ట్‌మెంట్స్ కట్టి ఫ్లాట్స్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసింది. ఈ క్రమంలోనే పలువురు ప్రజలు ఇందులో పెట్టుబడులు పెట్టారు. అలా పెట్టుబడుల దారుల నుంచి రూ.88 కోట్ల రావడంతో రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో మోసపోయాని గమనించిన బాధితులు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇందులో ఓ బాధితుడు ఈ సంస్థకు సంబంధించిన ప్రకటనలో యాంకర్ సుమ, ఆమె భర్త నటించడంతో నమ్మి పోసపోయామని, ఈ విషయంపై ఆమె స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాకీ అవెన్యూస్ కట్టిన ఫేజ్-1 బిల్డింగ్స్ చూశామని, ఫేజ్-2 త్వరలో కడతామని సుమతో ప్రచారం చేయించడం వల్ల ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చామంటూ వాపోతున్నారు.