Pawan Kalyan: త్వరలోనే సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ - అప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్, క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
Ustaad Bhagat Singh Shooting: డైరెక్టర్ హరీష్ శంకర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీఎంట్రీపై స్పందించారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చారు.
Harish Shankar About Ustaad Bhagat Singh: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా సినిమాలు పక్కన పెట్టి ఆయన రాజకీయాల్లోకి యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమాలను పక్కన్న పెట్టి ఆయన ప్రచారంలో బిజీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల్లో గెలవడం.. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టడంతో పొలిటిక్స్‌లో ఆయన మరింత బిజీ అయిపోయారు. దానివల్ల ప్రస్తుతం ఆయన సినిమాలు చేయలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన చేతిలో ఉన్న మూడు సినిమాలు వాయిదా పడ్డాయి.
దీంతో ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతారు.. ఆ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? అనేది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా ఉన్న అంశం. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ సెట్స్‌లో ఎప్పుడు అడుగుపెడతారనే తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి చెప్పుకొచ్చారు. మళ్లీ ఆయన సినిమాల్లో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారని అడగ్గా.. త్వరలోనే వచ్చే చాన్స్ ఉందని డైరెక్టర్ హరీష్ శంకర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమాలు చేయడం కుదురలేదు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. వీలైనంత తొందరగా తన సినిమాలు పూర్తి చేస్తానని చెప్పారట. ఆయన ఫ్రీ అయయాక ఫస్ట్ 'OG', 'హారిహార వీరమల్లు' సినిమాల షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలకు కొన్ని డేట్స్ ఇస్తే సరిపోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా 20 శాతం షూటింగ్ మాత్రమే అయ్యింది. ఆయన ఎప్పుడు డేట్స్ ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ఏపీ ఎన్నికల్లో పవన్ గెలవడంతో ఆయన ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పుబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు వీలు కుదిరినప్పుడు ఆయన OG, హారిహార వీరమల్లు సినిమాలు పూర్తి చేస్తారని, ఇంకా తొలి దశలోనే ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటూ ఆ మధ్య నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా హరీష్ శంకర్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఆ రూమర్స్‌కి చెక్ పడినట్టు అయ్యింది. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల పోలింగ్‌కి ముందు హరీష్ శంకర్ భగత్ సింగ్ బ్లేజ్ అంటూ చిన్న వీడియో వదిలి పొలిటికల్ హీట్ పెంచారు. ఈ వీడియోలో పొలిటికల్ సిట్యూవేషన్‌కు తగినట్లుగా "గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది" అని పవన్‌తో డైలాగ్ చెప్పించి పిచ్చెక్కించారు.