Game Changer: గేమ్ ఛేంజర్ టైం స్టార్ట్ అయ్యింది - డబ్బింగ్ వర్క్ మొదలెట్టిన మూవీ టీం, ఇక ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్ జాతరే...
Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. తాజాగా మూవీ టీం ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే అప్‌డేట్ వదిలింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
![Game Changer: గేమ్ ఛేంజర్ టైం స్టార్ట్ అయ్యింది - డబ్బింగ్ వర్క్ మొదలెట్టిన మూవీ టీం, ఇక ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్ జాతరే... Ram Charan Game Changer Movie Team Starts Dubbing Work Game Changer: గేమ్ ఛేంజర్ టైం స్టార్ట్ అయ్యింది - డబ్బింగ్ వర్క్ మొదలెట్టిన మూవీ టీం, ఇక ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్ జాతరే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/07/954fb9d969db6a0f84a861f8a951dbae1723020441713929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Game Changer Kickstarted the dubbing works: 'గేమ్ ఛేంజర్' (Game Changer) టైం స్టార్ అయ్యింది. ఇక ఫ్యాన్స్‌కి అప్‌డేట్స్‌తో సర్‌ప్రైజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ చిత్రం స్లో స్లోగా షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు రెండేళ్లుగా షూటింగే జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఒకానోక సందర్బంలో అసలు గేమ్ ఛేంజర్ మూవీ ఉందా? లేదా? అనే సందేహాలు వచ్చాయి.
Team #GameChanger Kickstarted the dubbing works ❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) August 7, 2024
All set for the Mega fireworks - Christmas 2024 🔥
Mega Powerstar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara@MusicThaman @DOP_Tirru @artkolla @SVC_official @ZeeStudios_ @zeestudiossouth @saregamaglobal @saregamasouth pic.twitter.com/wuBEYpDOX3
ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుందని అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపారు. ఇప్పుడు ఏకంగా మూవీ (Game Changer Release) ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందంటూ మూవీ టీం క్రేజీ అప్‌డేట్ వదిలింది. దీంతో ఆడియన్స్, ఫ్యాన్స్ అంతా పండగా చేసుకుంటున్నారు. "గేమ్ ఛేంజర్ డబ్బింగ్ వర్క్ మొదలైంది. మెగా ఫైర్‌వర్క్‌కి అంతా సెట్ అయ్యింది. ఈ క్రిస్మస్‌కి 'గేమ్ ఛేంజర్' పండగే" అంటూ మూవీ టీం ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఇక గేమ్ ఛేంజర్ టైం వచ్చేసిందంటూ మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దేవర మేనియా అయిపోగానే ఇక 'గేమ్ ఛేంజర్' జోష్ స్టార్ట్ అంటూ ఆడియన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
కాగా పోలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ నుంచి లీక్ అయినా సన్నివేశాలు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఇటీవల విడుదలైన ఎయిర్‌పోర్టు సీన్‌తో గేమ్ ఛేంజర్‌పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక్కడ హీరో రామ్ చరణ్ విలన్స్‌కి మధ్య కీలక సన్నివేశమని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టు బోర్డింగ్ ఎరియాలో విమానాల ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు.
చూస్తుంటే ఇది చాలా ఇంటెన్స్ ఉన్న సన్నివేశమని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్, సముద్ర ఖనితో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. కాగా గేమ్ ఛేంజర్ మూవీని ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
Also Read: పవన్ కళ్యాణ్-రవితేజతో మల్టీస్టారర్ - క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన హరీశ్ శంకర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)