Ammayi garu Serial Today October 3rd: అమ్మాయిగారు సీరియల్: విజయాంబిక, దీపక్ లపై మందారం సెటైర్లు! సూర్యప్రతాప్ మనసు మార్చుకున్నాడా?
Ammayi garu Serial Today Episode October 3rd రాజు, రూపలు రాఘవని కాపాడాలి అనుకోవడం విజయాంబిక చంపేయాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్, విజయాంబికల్ని రాజు, రూపలు దొంగతనం చేశారని చితక్కొడతారు. తర్వాత ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి నోరు మూయిస్తారు. అక్క నాలా మంచివైపు నిలబడు ఆ అమ్మవారు నీకు అండగా ఉంటుంది. అదే చెడువైపు నిలబడితే సొంత వాళ్లు కూడా నీకు ఉండరని అంటాడు.
గుడిలో తగిలిన దెబ్బలకు విజయాంబిక, దీపక్‌లు కుయ్యోమొర్రో అంటారు. వాళ్ల మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి.. మనం కొట్టే దెబ్బకి వాళ్ల శవాలు తేలాలని విజయాంబిక అంటుంది.. మందారం ఫోన్ మాట్లాడినట్లు ఇవన్నీ జరిగే పనులు కావని సెటైర్లు వేస్తుంది. విజయాంబిక, దీపక్‌లు కోపంగా మందారాన్ని చూస్తారు. పుండు మీద కారం వేసినట్లు మరింత రగిలిపోతారు. ఇది మనకు ఇన్‌డైరెక్ట్‌గా చెప్తుందని విజయాంబిక అంటే మందారం ఫోన్ పట్టుకొని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాల్సిన అవసరం నాకు ఏంటి డైరెక్ట్‌గా చెప్తున్నా అని మళ్లీ అత్త భర్తల నోరు మూయిస్తుంది. కొరడా దెబ్బలకు మందు పూయమంటారా అని సెటైర్లు వేస్తుంది.
విజయాంబిక కోపంగా ఇదంతా మీ వాళ్ల ప్లాన్ అని నాకు తెలుసు.. ఈ విషయం నీకు తెలుసు అని మాకు తెలుసు అంటుంది. మీరు చేసిన పనికి మీకు శిక్ష పడింది అని మందారం అంటే దీపక్ కొట్టడానికి చేయి ఎత్తి చేయి బెనికి అరుస్తాడు. విజయాంబిక కూడా మందారాన్ని కొట్టడానికి చేయి ఎత్తి కొరడా దెబ్బల నొప్పికి విలవిల్లాడిపోతుంది. చేతులు కాలు రావడం లేదు మీకు ఇప్పుడు నేనే దిక్కు నేనే తినిపిస్తా అంటూ మందారం అని మళ్లీ ఫోన్ తీసి హలో ఎవరి శిక్షలకు వాళ్లే అనుభవిస్తారు అని అంటుంది. అప్పుడే కోమలి అక్కడికి రావడంతో ఒకే జాతి పక్షులు ఒకే చోటుకి చేరుతాయి అని మందారం చురకలు వేసి వెళ్లిపోతుంది. అసలే గాయాలతో బాధ పడుతుంటే ఈ మందారం దెప్పి పొడుపులు ఏంటి అని కోమలి అంటే దాన్ని పట్టించుకోవద్దని విజయాంబిక అంటుంది. మనల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ఈ సారి వాళ్లకి అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటారు.
కోమలి కాలిన గాయాన్ని సూర్యప్రతాప్ చూస్తాడు. రూప ఏమైందమ్మా అని అడుగుతాడు. అరచేతి గాయం గుర్తు పట్టేశాడు అంటే మన ఒంటి మీద గాయాలు గుర్తు పట్టేస్తే మన పని అయిపోతుందని విజయాంబిక కొంగు కప్పుకుంటుంది. ఏమైందని సూర్యప్రతాప్ అడిగితే రాజు సూర్యప్రతాప్‌తో మీరు బాగుండాలని అరచేతిలో కర్పూరం వెలిగించుకున్నారని అంటాడు. నువ్వు అమ్మా కలిసి పోవాలని అక్క గుడిలో హారతి వెలిగించుకొని 11 ప్రదక్షిణలు చేసిందని చెప్తుంది. ఇలా ఇరికించేసిందేంటని కోమలి అనుకుంటుంది. సూర్యప్రతాప్ కోమలిని కోప్పడతాడు. మీరు ఆపాలి కదా అని సూర్యప్రతాప్ సుమ, చంద్ర మీద అంటే మేం అందరం ఎంత చెప్పినా వినలేదని రూప చెప్తుంది.
సూర్యప్రతాప్ కోమలితో చూడు రూప అలా జరగాలి అని నువ్వు కోరుకోవడం తప్పు అని నేను అనడం లేదు.. తప్పు చేసిన వాళ్లని శిక్షించడానికి.. తప్పు చేయకుండా తలదించుకున్న వాళ్ల తల ఎత్తడానికి పైన దేవుడు ఉన్నాడు.. మనుషుల తీరు మారొచ్చు కానీ పైవాడు రాసిన రాత మారదు అని సూర్యప్రతాప్ చెప్తాడు. సూర్యప్రతాప్ విరూపాక్షి గురించి పాజిటివ్‌గా మాట్లాడటంతో విజయాంబిక, దీపక్, కోమలి షాక్ అయిపోతే రూప, రాజు వాళ్లు చాలా హ్యాపీగా ఫీలవుతారు. విరూపాక్షితో రాజు, రూపల గ్యాంగ్ సూర్యప్రతాప్‌లో ఈ మార్పు చాలా సంతోషంగా ఉందని విరూపాక్షికి ధైర్యం చెప్తుంది. మీరు ఇద్దరూ కలవడం అతి త్వరలోనే జరుగుతుందని అంటారు. మీరు ఏం తప్పు చేయలేదని అన్నయ్య నమ్ముతున్నారని చంద్ర విరూపాక్షితో చెప్తాడు. విరూపాక్షి చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. రాఘవ లేచి నిజం చెప్తేనే మనం అనుకున్నది జరుగుతుంది లేదంటే కష్టం అనిపిస్తుందని రాఘవ రావడం వల్లే సూర్యప్రతాప్‌లో మార్పు వచ్చిందని విరూపాక్షి అంటుంది. సూర్యప్రతాప్‌లో మార్పు వస్తుంది అలా జరగకుండా చూసుకోవాలని విజయాంబిక తన గ్యాంగ్‌తో చెప్తుంది. రాఘవ చనిపోతేనే ఏ ప్రాబ్లమ్ ఉండదు అనుకుంటారు. రాజు, రూపలు రాఘవని కాపాడుకోవాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















