Illu Illalu Pillalu Serial Today October 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్, ఐశ్వర్యల చనువు చూసి ప్రేమ ఏం చేసింది! ఫ్యాన్స్ కోరుకునేది ఇదే కదా!
Illu Illalu Pillalu Serial Today Episode October 3rd ప్రేమ ధీరజ్‌తో రొమాంటిక్ డ్యాన్స్ వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద తిరుపతితో ఎదురింటి వాళ్లకి ఫొటోల విషయం ఎవరు చెప్పారో తెలుసుకోమని చెప్తుంది. తిరుపతిని రెచ్చగొట్టి పంపేస్తుంది. పార్టీలో ఐశ్వర్య ధీరజ్‌ని చూస్తూ లైన్ వేయడం ప్రేమ చూసి ధీరజ్ దగ్గరకు వెళ్తుంది. ఏంట్రా తెగ చూస్తున్నావ్.. ఏమైనా సిగ్నల్ ఇస్తున్నావా అని ఐశ్వర్యని చూపిస్తుంది.
ధీరజ్ చూసే టైంకి ఐశ్వర్య ముఖం తిప్పేస్తుంది. తను ఎటో చూస్తుంది కదా అని ధీరజ్ అంటాడు. దానికి ప్రేమ నువ్వు చూస్తున్నప్పుడు వేరే ఎక్కడో చూస్తుంది. నిన్ను ఏటో చూస్తే నిన్ను చూస్తుంది నాకు బాగా ఎక్కువ అయిందిరా అని ప్రేమ ధీరజ్ మీదకు వెళ్లే టైంకి పార్టీ స్టార్ట్ అయిపోవడంతో ధీరజ్ పారిపోతాడు. ఇక ధీరజ్ని మందు తాగమని ఫ్రెండ్స్ అంటారు. బలవంతం చేసి మందు గ్లాస్ చేతికి ఇస్తారు. ధీరజ్ తాగే టైంకి ప్రేమని చూసి గ్లాస్ పక్కన పెట్టేస్తాడు. ప్రేమని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లాలి కదా అందుకే తాగనురా అని అంటాడు. భార్య మీద నీ కేరింగ్‌కి హాట్సాఫ్ అని అందరూ అంటారు. మిగతా ఆడవాళ్లు అందరూ మందు తాగుతూ మోడ్రన్ డ్రస్‌లో ఉంటే ప్రేమ మాత్రం లంగావోణిలో ఉంటుంది. ప్రేమని తాగమని ఓ ఫ్రెండ్ అంటే ప్రేమ వద్దు అనేస్తుంది.
ఐశ్వర్య ప్రేమ దగ్గరకు వచ్చి మీది లవ్ మ్యారేజ్‌నా.. ధీరజ్ సెలక్షన్ ఇంత బ్యాడ్ అనుకోలేదు అంటుంది. నాకు ధీరజ్ అంటే ఇష్టం..ధీరజ్‌కి నేను ఇష్టం.. ఇంత అందమైన నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు పాపం అని అంటుంది. ప్రేమ ఫుల్లగా హర్ట్ అయిపోతుంది. మరోవైపు తిరుపతి ఇంటికి వెళ్తే సేన తిరుపతిని తిట్టి వెళ్లిపోమని అంటాడు. భద్రావతి కోపంగా మొన్న నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అని అంటుంది. ఫొటోల్లో ప్రేమ పక్కన ఎవరో ఉన్నా కనీసం అనుమానంతో కాదు కదా ఒక్క మాట కూడా రామరాజు బావ అడగలేదు అందుకే బావని సపోర్ట్ చేశా అని అంటాడు.
తిరుపతి వాళ్లతో మీరు అనవసరంగా అన్నారని అంటాడు. ఆధారాలు లేకుండా అనడం లేదు పక్కా ఆధారాలతో అంటున్నాం అని విశ్వ అంటాడు. విశ్వతో నిజం చెప్పించడానికి తిరుపతి రెచ్చగొడతాడు. దాంతో విశ్వ భాగ్యం విషయం చెప్పిందని చెప్పేస్తాడు. తిరుపతి షాక్ అయిపోతాడు. తిరుపతి కోసం నర్మద వెయిట్ చేస్తుంది. వల్లీ వాళ్ల అమ్మే చెప్పిందని తిరుపతి నర్మదకు చెప్తాడు.
పార్టీలో అందరూ డ్యాన్స్‌లు చేస్తుంటారు. ధీరజ్‌ని ఐశ్వర్య తీసుకెళ్లి డ్యాన్స్ చేస్తుంది. ప్రేమ చాలా హర్ట్ అయిపోతుంది. కోపంతో ప్రేమ కూల్ డ్రింక్ అనుకొని మందు తాగేస్తుంది. మత్తులో ఐశ్వర్యని నెట్టేసి ధీరజ్‌తో నువ్వు డ్యాన్స్ అంటూ చేస్తే నాతోనే చేయాలి.. నా కంటే అందగత్తెనా అది చెప్పరా అని నాతో డ్యాన్స్ చేయరా అని ధీరజ్‌ని లాగేస్తుంది. ఇద్దరూ డ్యాన్స్ చేసి ముద్దు పెట్టుకుంటారు. తర్వాత ప్రేమ మత్తుతో పడిపోతుంది. ధీరజ్ ఎత్తుకొని తీసుకెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















