Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 3rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కన్నకూతుర్ని చంపుకుంటున్న పద్మాక్షి! సహస్రకు యాక్సిడెంట్.. సీరియస్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 3rd లక్ష్మీని చంపేయాలని పద్మాక్షి రౌడీలకు చెప్పడం లక్ష్మీ ఉండాల్సిన ఆటోలో సహస్ర ఉండటం సహస్రను రౌడీలు ఢీ కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. భర్త సపోర్ట్ చేయడం లేదని సహస్ర బాధ పడటం గుర్తు చేసుకొని జాలి పడుతుంది. ఇంతలో యమున లక్ష్మీ దగ్గరకు వస్తుంది. ఎలా భరిస్తున్నావ్ లక్ష్మీ ఇదంతా అని యమున ఏడుస్తూ అడుగుతుంది.
లక్ష్మీ నేను అంతా చూశాను.. ఎలా వస్తుంది లక్ష్మీ నీకు భూదేవి అంత ఓర్పు.. ఆ సీతమ్మ పడిన కష్టాలు కంటే ఎక్కువ కష్టాలు ఎలా అనుభవిస్తున్నావు.. ఏం తప్పు చేశావని నీకు ఆ దేవుడు ఇంత శిక్ష వేస్తున్నాడు.. నీ విషయంలో ఎవరు ఇష్ట వచ్చినవాళ్లు వాళ్లకి నచ్చిన శిక్ష వేస్తున్నారు అందులో నేను ఉన్నాను.. నువ్వు కన్నీరు పెట్టుకున్న కనికరించలేదు.. నా కొడుకుతో నీకు కలిసిన బంధం అబద్ధం అని మూర్ఖంగా అనుకున్నానని ఏడుస్తుంది. లక్ష్మీ ఏడ్వొద్దని మీ ఆరోగ్యం బాలేదని అంటుంది. నేను ఇంత చేసినా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు.. నీలో పది శాతం నేను ఆలోచించినా నీకు ఇన్ని సమస్యలు వచ్చేవి కావు అంటుంది. ఇన్ని రోజులు కళ్ల ముందు దేవత లాంటి నిన్ను పెట్టుకొని దిష్టిబొమ్మల వెనక తిరిగాను అని యమున ఏడుస్తుంది.
లక్ష్మీ యమునతో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. నువ్వే అసలైన కోడలివి అని లక్ష్మీ.. ఈ ఇంటి వారసుడి ఆయుష్షు మోస్తున్నావని తెలుసుకున్నాను.. అందుకే అమ్మవారు నిన్ను ఎంచుకుందని తెలిసుకొని మాట్లాడుతున్నానని అంటుంది. మా స్వార్థం వలన నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు లక్ష్మీ అని ఏడుస్తుంది. నీకు ఇన్ని రోజులు అన్యాయం జరిగింది నీకు న్యాయం జరగాలి అంటే ఈ నిజం అందరికీ చెప్పేస్తా అని యమున వెళ్తుంటే లక్ష్మీ ఆపుతుంది. అమ్మ నేను ఇలా బాగున్నాను.. నా కళ్ల ముందు భర్త ఉన్నాడు.. అమ్మలా చూసుకునే అత్త ఉంది.. ఇది నాకు చాలు ఇంకేం ఆశలు లేవు అని లక్ష్మీ ఆపుతుంది.
యమున ఏడుస్తూ ఇంత మంచిదానివి ఏంటి లక్ష్మీ నువ్వు.. ఇంత మంచి కోడల్ని ఇచ్చిన ఆ దేవుడు.. అందరిలో నా కోడలు అని చెప్పుకునే అవకాశం ఎందుకు ఇవ్వలేదు.. కానీ లక్ష్మీ నేను చేసిన తప్పులకు మాటలకు నీ కాళ్లు పట్టుకుంటే ప్రాయశ్చిత్తం కాదు అని యమున అంటే అమ్మా మీరు ఏం చేస్తున్నారు.. నా తలరాతే ఇంత.. ఏడుస్తుంది. నన్ను కొట్టు అమ్మా అని యమున లక్ష్మీతో కొట్టించుకుంటే వద్దమ్మ వదిలేయండి అని లక్ష్మీ బాధ పడొద్దని చెప్తుంది. అమ్మా దయచేసి బాధ పడకండి.. మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి మందులు వేసుకోవాలి ఎప్పుడు తిన్నారో ఏంటో తిందురు పద అని తీసుకెళ్తుంది లక్ష్మీ.
లక్ష్మీ ఉదయం గుడికి వెళ్తానని యమునకు చెప్పి వెళ్తుంది. పద్మాక్షి అది చూస్తుంది. లక్ష్మీ ఆటోలో వెళ్లడం చూసి తన మనుషులకు చెప్పి ఆటోలో లక్ష్మీ వస్తుంది. గుద్ది చంపేయమని ఆటో నెంబరు చెప్తుంది. రౌడీలు బస్సులో ఆటో కోసం వెళ్తారు. ఇక సహస్ర కారులో వెళ్తూ ఉంటుంది. కారు చెడిపోవడంతో ఓ చోట ఆగుతుంది. అదే రూట్‌లో లక్ష్మీ వస్తుంది. సహస్ర ఆటో ఆపితే లక్ష్మీ సహస్రని చూసి ఆపుతుంది. కారు పోయిందని సహస్ర చెప్తే లక్ష్మీ నడుచుకుంటూ వెళ్తానని చెప్పి సహస్రని ఆ ఆటోలో ఎక్కిస్తుంది. పద్మాక్షి లక్ష్మీని చంపేస్తున్నానని హ్యాపీగా ఫీలవుతుంది. రౌడీలు ఆటోని ఫాలో అయి అందులో సహస్ర ఉందని తెలీక ఆటోని గుద్దేస్తారు.
సహస్ర ముక్కు నుంచి రక్తం వచ్చి ఆటోలో పడిపోతుంది. రౌడీలు పద్మాక్షికి కాల్ చేసి ఆటోని గుద్దేశాం లక్ష్మీ చనిపోయింటుందని చెప్తాడు. పద్మాక్షి హ్యాపీగా ఫీలై వీడియో కాల్ చేయమని అంటుంది. అందులో లక్ష్మీ స్థానంలో సహస్ర ఉండటం చూసి పద్మాక్షి బిత్తరపోతుంది. సహస్ర అని అరుస్తుంది. రౌడీలతో సహస్రని హాస్పిటల్‌కి తీసుకెళ్లమని చెప్తుంది. వాళ్లు అది తమ పని కాదు కేసులో ఇరుక్కుంటామని వెళ్లిపోతారు. పద్మాక్షి ఏడుస్తూ వెళ్లి మరి కొంత మంది ఆడవాళ్ల సాయంతో సహస్రని కారులో ఎక్కించుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది. నా చేతితో నా కంటినే పొడుచుకున్నానా.. సహస్ర లేవవే అని ఏడుస్తుంది. సహస్రని ఐసీయూలో చేర్చి ట్రీట్మెంట్ ఇస్తారు. పద్మాక్షి తల బాదుకొని ఏడుస్తుంది.
లక్ష్మీ గుడికి రావడం తెలుసుకొని విహారి వెళ్తాడు. నా ప్రేమ అర్థం చేసుకో అని విహారి అంటే మీకు సహస్రమ్మకి దేవుడు ముడేశాడు. మీ ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉన్నా నన్ను పక్కకి తప్పిస్తాడు.. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ సహస్రమ్మ మీద చూపించండి అని లక్ష్మీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















