నితిన్ బర్త్‌డే అప్‌డేట్స్, సందీప్ కిషన్ ‘వైబ్’ ఫస్ట్‌లుక్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
సందీప్ కిషన్ 'వైబ్' ఫస్ట్‌లుక్ - అప్పుడే కొత్త సినిమా ప్రకటించిన ఈ యంగ్ హీరో, డైరెక్టర్ ఎవరో తెలుసా?
యంగ్ హీరో సందీప్ కిషన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆ మధ్య సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చిన ఈ హీరో 'మైఖేల్' అనే పాన్ ఇండియా మూవీ రీఎంట్రీ ఇచ్చాడు. భారీ అంజనాలతో వచ్చిన ఈచిత్రం డిజాస్టర్ అయ్యింది. అయినా మూవీ ఫలితాలతో సంబంధం వరుస సినిమాలు ప్రకటిస్తున్నాడు. రీఎంట్రీలో సెకండ్ హీరో చాన్స్‌లు కూడా వదులుకోవడం లేదు. ఇక ఇటీవల ఊరు పేరు 'భైరవకోన' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సందీప్ కిషన్ అప్పుడే మరో సినిమాను లైన్లో పెట్టాడు. తాజాగా తన 31వ సినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చాడు. ‘వైబ్’ అనే టైటిల్‌తో ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ వదిలాడు సందీప్ కిషన్. ఇందులో అతడు ఫుల్ యాక్షన్ అవతార్‌లో కనిపించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నితిన్ బర్త్ డే స్పెషల్.. రాబిన్ హుడ్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రాబిన్ హుడ్'. హీరో నితిన్ పుట్టిన రోజు సందర్భంగా 'రాబిన్ హుడ్' టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. నితిన్ కి బర్త్ డే విషెస్ చెప్తూ స్పెషల్ పోస్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ తన ఇన్ స్టా ద్వారా ఈ పోస్టర్ ని రిలీజ్ చేసింది. 'ఏజెంట్ రాబిన్ హుడ్ రిపోర్ట్స్ ఆన్ డ్యూటీ ఫర్ అడ్వంచర్స్' అంటూ రాసుకొచ్చింది ఆ పోస్ట్ లో. దాంట్లో నితిన్ పవర్ ఫుల్ గా కనిపించారు. గన్స్ తో, ఫోన్ లో మాట్లాడుకుంటూ నడుస్తున్నట్లుగా ఉంది ఆ ఫొటో. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టిల్లన్న డీజే ఈ సారి గట్టిగానే మోగింది - ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాకే!
‘డీజే టిల్లు’తో రికార్డులు సృష్టించాడు సిద్దు జొన్నలగడ్డ. 2022లో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మేకర్స్. ‘టిల్లు స్క్వేర్’ టైటిల్ తో సీక్వెల్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈసినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ లో కూడా దూసుకుపోతోంది. ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.23.7 కోట్లు దాటింది. ఇండియాలో కలెక్షన్ రూ.11.2 కోట్లు కాగా.. ఓవర్ సీస్ మొత్తం కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ.23.7 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
స్పిరిట్ మూవీ అప్‌డేట్ - ప్రభాస్ కోసం తెరపైకి ముగ్గురు హీరోయిన్ల పేర్లు? సందీప్ ఫోకస్ ఆమెపైనేనట!
ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ రిలీజ్‌కి రెడీ అవుతుంది.ఈ సమ్మర్ కానుకగా మూవీ థియేటర్లోకి రాబోతుంది. దీంతో అంతా ఇప్పుడు ప్రభాస్ తదుపరి చిత్రం స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం 'యానిమల్' మూవీ బిగ్ బ్లాక్‌బాస్టర్ అవ్వడంతో ఈ సక్సెస్ జోష్‌లో ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ అని ప్రకటనతోనే తెల్చేశారు. దీంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇది ప్రభాస్ 25వ చిత్రం కావడంతో ఓ రేంజ్‌లో స్పిరిట్ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పవర్ స్టార్ మూవీ పేరుతో నితిన్ కొత్త మూవీ, ‘తమ్ముడు‘ ఫస్ట్ లుక్ అదుర్స్
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా నితిన్ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘తమ్ముడు‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆడవాళ్లు లారీని నడుపుతూ కనిపించారు. లారీ మీద కుమార స్వామి ఆయుధాన్ని పట్టుకుని నితిన్ కూర్చున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ టైటిల్ చూసి నితిన్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)