Thammudu Movie First Look: పవర్ స్టార్ మూవీ పేరుతో నితిన్ కొత్త మూవీ, ‘తమ్ముడు‘ ఫస్ట్ లుక్ అదుర్స్
పుట్టిన రోజు సందర్భంగా హీరో నితిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పవర్ స్టార్ మూవీ పేరుతో కొత్త సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ పేరు చూసి నితిన్ అభిమానులతో పాటు పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
![Thammudu Movie First Look: పవర్ స్టార్ మూవీ పేరుతో నితిన్ కొత్త మూవీ, ‘తమ్ముడు‘ ఫస్ట్ లుక్ అదుర్స్ actor nitin thammudu movie first look poster released Thammudu Movie First Look: పవర్ స్టార్ మూవీ పేరుతో నితిన్ కొత్త మూవీ, ‘తమ్ముడు‘ ఫస్ట్ లుక్ అదుర్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/30/85ca0834194eecdc0992c07a92bce5921711777322740544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Actor Nitin Thammudu Movie First Look Poster Out: నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా నితిన్ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు ‘తమ్ముడు‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆడవాళ్లు లారీని నడుపుతూ కనిపించారు. లారీ మీద కుమార స్వామి ఆయుధాన్ని పట్టుకుని నితిన్ కూర్చున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ టైటిల్ చూసి నితిన్ అభిమానులతో పాటు పవర్ స్టార్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.
A story of ambition, courage, and determination🎯
— Sri Venkateswara Creations (@SVC_official) March 30, 2024
Presenting the passion-filled first look of #THAMMUDU ❤️🔥
Wishing everyone's Favourite Brother @actor_nithiin a very Happy Birthday ❤️🎉#HBDNithiin
A Film by #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/30PgqvLvIZ
పవర్ స్టార్ కు నితిన్ పెద్ద అభిమాని
నిజానికి నితిన్ పవర్ స్టార్ కు పెద్ద అభిమాని. అంతేకాదు, గతంలో నితిన్ సినిమా ఈవెంట్లకు పవర్ స్టార్ హాజరైన సందర్భాలున్నాయి. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ప్రతి ఏటా వేసవిలో పవర్ స్టార్ తన ఫామ్ హౌస్ లో పండే మామిడి పండ్లను నితిన్ కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు పవన్ సినిమా టైటిల్ తో నితిన్ సినిమా చేయడం ప్రేక్షకులలో ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.
శరవేగంగా కొనసాగుతున్న ‘తమ్ముడు‘ షూటింగ్
నితిన్ చివరగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‘ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక సినిమాను ‘వకీల్ సాబ్‘తో హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో చేస్తున్నారు. ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా వైజాగ్ లో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. గతంలోనే ఈ సినిమాకు పవర్ స్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకదాని టైటిల్ పెడతారనే టాక్ వినిపించింది. ఊహాగానాలను నిజం చేస్తూ మేకర్స్ ‘తమ్ముడు‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నితిన్, పవన్ అభిమానులు
ఇక ‘తమ్ముడు‘ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘కాంతార‘ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతాన్ని అందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఫస్ట్ లుక్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ టైటిల్ తో నితిన్ సినిమా తీస్తుండటంతో నితిన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాదు, నితిన్ నిజమైన పవన్ అభిమాని అని నిరూపించుకున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: ‘ఔను, నేను రిలేషన్ షిప్‌లో ఉన్నా’ అంటూనే ట్విస్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)