‘జవాన్’ కొత్త సాంగ్, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
షారుఖ్ తెలుగు ట్వీట్ - ‘ఛలోనా’ పాటలో నయన్‌తో రొమాన్స్, ఇదిగో సాంగ్ వీడియో!
బాలీవుడ్‌లో రొమాంటిక్ సాంగ్స్‌కు ఉండే క్రేజే వేరు. అసలైతే సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల మందుకు వచ్చే పాటలను బట్టే ఆ మూవీ ఎంతవరకు హైప్ క్రియేట్ చేయగలదో తెలుస్తుంది. ముందుగా ఒక పాట విడుదలయ్యి.. అది అందరి దగ్గరకు చేరుకుంది అంటే సినిమాకు ఆటోమేటిక్‌గా ప్రమోషన్ దొరికినట్టే. ఇక తాజాగా బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ లిస్ట్‌లోకి ‘జవాన్’ నుండి ‘ఛలోనా’ కూడా వచ్చి చేరింది. ఈ పాటలో షారుఖ్ ఖాన్, నయనతార జోడీ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. మొదటిసారి ‘జవాన్’ కోసం జతకట్టిన వీరిద్దరూ ఆన్ స్క్రీన్‌పై చాలా క్యూట్‌గా అనిపిస్తారు. తాజాగా ‘ఛలోనా’ పాట విడుదల సందర్భంగా షారుఖ్.. తెలుగులో ఒక పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అందుకే ప్రభాస్ - మారుతీ కాంబో మూవీని అధికారికంగా ప్రకటించలేదు: నిర్మాత టీజీ విశ్వప్రసాద్
ప్రభాస్ మూవీ అంటేనే భారీ అంచనాలుంటాయి. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే.. నెక్స్ట్ మూవీ ఎవరితో, ఏంటీ అన్న ప్రశ్నలు ఇప్పట్నుంచే మొదలవుతాయి. సినిమాలోని నటీనటులే కాదు, డైరెక్టర్, నిర్మాతలు ఎవరన్న దానిపైనా పలు సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది లైనప్ లో ఉన్నారనే టాక్ ఉంది. అలాంటిది ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే ఎవరైనా గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ డైరెక్టర్ మారుతీ గానీ, ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ గానీ ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ రిలీజ్ డేట్ ఫిక్స్, భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది!
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్‘. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన!
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా సౌత్ లో తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ అందుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఆ వివరాల్లోకి వెళితే.. ఈమధ్య కోలీవుడ్ హీరోలంతా మన టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 'సార్' అనే స్ట్రైట్ తెలుగు సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ హీరోకి మంచి క్రేజ్ ఉంది. ధనుష్ నటించే ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలవుతూ ఉంటుంది. దాంతో ధనుష్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'విరూపాక్ష' బ్యూటీ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ - ఈసారి నిఖిల్‌తో రొమాన్స్ చేయనున్న సంయుక్త?
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'బింబిసార' 'భీమ్లా నాయక్' 'సార్' 'విరూపాక్ష' వంటి బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్లు పడటంతో టాలీవుడ్ లక్కీ చార్మ్ గా పిలవబడుతోంది. ప్రస్తుతం అమ్మడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో బిజీగా గడుపుతోంది. అయితే ఈ కేరళ కుట్టి చేతికి మరో పెద్ద సినిమా వచ్చిందని తెలుస్తోంది. ఈసారి యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థతో రొమాన్స్ చేయనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)