News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Jawan: షారుఖ్ తెలుగు ట్వీట్ - ‘ఛలోనా’ పాటలో నయన్‌‌తో రొమాన్స్, ఇదిగో సాంగ్ వీడియో!

తాజాగా ‘ఛలోనా’ పాట విడుదల సందర్భంగా షారుఖ్.. తెలుగులో ఒక పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్‌లో రొమాంటిక్ సాంగ్స్‌కు ఉండే క్రేజే వేరు. అసలైతే సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల మందుకు వచ్చే పాటలను బట్టే ఆ మూవీ ఎంతవరకు హైప్ క్రియేట్ చేయగలదో తెలుస్తుంది. ముందుగా ఒక పాట విడుదలయ్యి.. అది అందరి దగ్గరకు చేరుకుంది అంటే సినిమాకు ఆటోమేటిక్‌గా ప్రమోషన్ దొరికినట్టే. ఇక తాజాగా బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ లిస్ట్‌లోకి ‘జవాన్’ నుండి ‘ఛలోనా’ కూడా వచ్చి చేరింది. ఈ పాటలో షారుఖ్ ఖాన్, నయనతార జోడీ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తోంది. మొదటిసారి ‘జవాన్’ కోసం జతకట్టిన వీరిద్దరూ ఆన్ స్క్రీన్‌పై చాలా క్యూట్‌గా అనిపిస్తారు. తాజాగా ‘ఛలోనా’ పాట విడుదల సందర్భంగా షారుఖ్.. తెలుగులో ఒక పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

షారుఖ్ క్రేజ్‌కు తగిన సాంగ్..

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. తమిళంలో తెరకెక్కించిన సినిమాల సంఖ్య తక్కువే. అయినా కూడా తను కథ చెప్పగానే షారుఖ్ ఖాన్.. వెంటనే తనకు అవకాశం ఇచ్చాడు. ఒక యంగ్ సౌత్ డైరెక్టర్.. ఒక బాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్ట్ చేసి ఎన్నో ఏళ్లు అయిపోయింది. అందుకే ఈ మూవీపై కోలీవుడ్‌లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ‘జవాన్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది ‘జవాన్’. అందులో భాగంగానే సినిమా నుండి ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యింది. అది కూడా షారుఖ్ క్రేజ్‌కు తగిన ఒక లవ్ సాంగ్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. 

అంతా అనిరుధ్ మ్యాజిక్..

అనిరుధ్ రవిచందర్.. ఇప్పటికే సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చలామణీ అవుతున్నాడు. ఒకవైపు స్టార్ హీరోలు, ఒకవైపు యంగ్ హీరోలు.. ఇలా అందరి సినిమాలకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్యూన్స్‌ను అందిస్తూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే టీజర్‌లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. బాలీవుడ్‌లో ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా ఆ మ్యూజిక్‌తో తమ ఫేవరెట్ హీరోల ఎడిట్స్ చేసుకుంటూ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ఇక తాజాగా విడుదలయిన ‘ఛలోనా’ పాటతో కూడా మెలోడీ లవర్స్‌ను ఆకట్టుకున్నాడు అనిరుధ్. 

‘ప్రేమ కొలవలేనిది , హద్దులు లేనిది అయ్యుండాలి ..  అటువంటిదే జవాన్ ప్రేమ! ‘ఛలోనా’ పాట ఇప్పుడు రిలీజ్ అయ్యింది !’ అంటూ షారుఖ్ తెలుగులో చేసిన ట్వీట్.. తన తెలుగు ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌గా నిలిచింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటకు ఆదిత్య ఆర్‌కే, ప్రియా మాలి తమ స్వరాలను అందించారు. బాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా ఫేమస్ కొరియోగ్రాఫర్‌గా వెలిగిపోతున్న ఫరాహ్ ఖాన్ పాటను కంపోజ్ చేశారు. సెప్టెంబర్ 7న షారుఖ్ ‘జవాన్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నయనతారతో పాటు విజయ్ సేతుపతి, దీపికా పదుకొనె లాంటి స్టార్ నటీనటులు ఇందులో ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: 4 రోజుల్లో రూ.400 కోట్లు - ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన ఆ రెండు సినిమాలు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 14 Aug 2023 02:38 PM (IST) Tags: Vijay Sethupathi Atlee Shah Rukh Khan Jawan Deepika Padukone Nayanthara chalona anirudh ravichandar

ఇవి కూడా చూడండి

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

'ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3పై - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రియమణి!

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్న రణ్ వీర్, అలియా భట్ రీసెంట్ హిట్ - ఎక్కడంటే?

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

Sai Pallavi: అది నీచమైన పని, నా కుటుంబం జోలికొస్తే..: సాయి పల్లవి మాస్ వార్నింగ్

టాప్ స్టోరీస్

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత