అన్వేషించండి
Dhandoraa Movie: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో 'దండోరా'... నవదీప్, శివాజీతో 'కలర్ ఫోటో' నిర్మాత సినిమా
Dhandoraa Movie Cast And Crew: నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ 'కలర్ ఫోటో', 'బెదురులంక 2012'లు నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత బెన్నీ ముప్పానేని కొత్త సినిమా 'దండోరా' పూజతో ప్రారంభమైంది.
శివాజీ, నవదీప్, రవికృష్ణ మీద క్లాప్ ఇస్తున్న సాహు గారపాటి
1/6

Actor Shivaji New Movie: ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో'తో పాటు కార్తికేయ గుమ్మకొండ బ్లాక్ బస్టర్ మూవీ 'బెదురులంక 2012' ప్రొడ్యూస్ చేసింది లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ (బన్నీ) ముప్పానేని. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బుధవారం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజతో ప్రారంభమైంది.
2/6

'దండోరా' ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ ఇవ్వగా... కల్ట్ ఫిల్మ్ 'బేబీ' నిర్మాత ఎస్.కె.ఎన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. విజయయవంతమైన సినిమాలు నిర్మిస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.
Published at : 11 Dec 2024 10:37 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















