Samyuktha Menon: 'విరూపాక్ష' బ్యూటీ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ - ఈసారి నిఖిల్‌తో రొమాన్స్ చేయనున్న సంయుక్త?
బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్.. తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు తెలుస్తోంది. నిఖిల్ సిద్దార్థ సరసన హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ నడుస్తోంది.
మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 'బింబిసార' 'భీమ్లా నాయక్' 'సార్' 'విరూపాక్ష' వంటి బ్యాక్ టూ బ్యాక్ నాలుగు హిట్లు పడటంతో టాలీవుడ్ లక్కీ చార్మ్ గా పిలవబడుతోంది. ప్రస్తుతం అమ్మడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో బిజీగా గడుపుతోంది. అయితే ఈ కేరళ కుట్టి చేతికి మరో పెద్ద సినిమా వచ్చిందని తెలుస్తోంది. ఈసారి యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థతో రొమాన్స్ చేయనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
‘కార్తికేయ 2’ చిత్రంతో పాన్ ఇండియా హిట్టు కొట్టిన నిఖిల్.. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ‘స్వయంభూ’ అనే చిత్రం చేస్తున్నారు. ఇది పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. యువ హీరో కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా సంయుక్త మీనన్ ను ఎంపిక చేసారు.
గోల్డెన్ లెగ్ గా మారిపోయిన సంయుక్త మీనన్, ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ సరసన 'డెవిల్' అనే మల్టీలాంగ్వేజ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. 'బింబిసార' తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రమిది. ఈ క్రమంలో నిఖిల్ సిద్దార్థతో కలిసి నటించే అవకాశం అందుకుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ‘స్వయంభూ’ 'డెవిల్' రెండూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాబట్టి, అమ్మడి కెరీర్ నెక్స్ట్ లెవల్ కు చేరడానికి హెల్ప్ అవుతాయని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
Also Read: పాన్ ఇండియా అనే పదం నాకు నచ్చదు.. అలాంటి యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే: నాని
కాగా, ‘స్వయంభూ’ నిఖిల్ కెరీర్ లో 20వ సినిమా. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసి, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో ఇంతకముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పొడవాటి జుట్టు, ఒక చేతిలో ఆయుధం మరొక చేతిలో డాలు పట్టుకొని ఒక పోరాట యోధుడిలా దర్శనమిచ్చారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
ఇక ‘స్వయంభూ’తో పాటుగా ‘ది ఇండియా హౌస్’ అనే మరో పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేశారు నిఖిల్. రామ్ వంశీ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ & వి మెగా పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'స్పై' మూవీతో ప్లాప్ అందుకున్న నిఖిల్.. ఈ రెండు భారీ చిత్రాలతో ఎలాంటి ఫలితాలు అందుకుంటారో వేచి చూడాలి.
Also Read: తెలుగు ప్రేక్షకులు భాషలకు అతీతంగా సినిమాలను ఆదరిస్తారు: దుల్కర్ సల్మాన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial