ఆ పదం నాకు నచ్చదు, పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే: నాని
‘కింగ్ ఆఫ్ కోత’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. దీనికి టాలీవుడ్ హీరోలు నాని, రానాలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుల్కర్ ను ఉద్దేశిస్తూ నాని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.
'సీతా రామం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కింగ్ ఆఫ్ కోత'. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2023 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో పలు టాలీవుడ్ స్టార్ హీరోలు భాగం అవుతూ దుల్కర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆ మధ్య KoK టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయగా, కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ట్రైలర్ ను ఆవిష్కరించి బెస్ట్ విషెస్ అందజేశారు. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి, న్యాచురల్ స్టార్ నాని చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ''దుల్కర్, రానాలకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దుల్కర్ తన తెలుగు కెరీర్ స్టార్ట్ చేసిన 'ఓకే బంగారం' సినిమాలో నా వాయిస్ కూడా ఉంది. తెలుగులో తన కెరీర్ నెక్స్ట్ లెవల్ కి వెళుతున్న ఈ తరుణంలో నేను ఈ వేడుకలో వుండటం చాలా ఆనందంగా ఉంది. తన జర్నీలో నేనూ ఒక భాగం అనే ఫీలింగ్ ఉంది. దుల్కర్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది'' అని అన్నారు.
''మనందరం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నాం. నాకు నిజంగా ఆ పదం పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్ లో పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది దుల్కర్ మాత్రమే. ఎందుకంటే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం డైరెక్టర్ అందరూ దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్టర్ అనే మాటకు ఇదే నిజమైన నిర్వచనమని భావిస్తున్నాను'' అని నాని అన్నారు.
Also Read: ‘రోలెక్స్’ రాబోతున్నాడు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్య!
'కింగ్ ఆఫ్ కోత’ చాలా ప్రామెసింగ్ గా కనిపిస్తోంది. ట్రైలర్, విజువల్స్, జేక్స్ బిజోయ్ మ్యూజిక్, సౌండ్.. చాలా ఎనర్జిటిక్ గా వున్నాయి. ఐశ్వర్య లక్ష్మి గారి సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆమె నటించిన చాలా సినిమాలు చూసాను. ఐశ్వర్య నటించిన కొన్ని అమేజింగ్ మలయాళ సినిమాలు చూసే అవకాశం కల్పించిన ఓటీటీలకు థ్యాంక్స్. మిగతా నటీనటులకు దర్శక నిర్మాతలకు, చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. 'సీతారామం'తో దుల్కర్ మనందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ సినిమాతో అది నెక్స్ట్ లెవల్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించి, సినిమాలో భాగమైన వారందరి కెరీర్ లో స్పెషల్ ఫిల్మ్ గా నిలవాలని కోరుకుంటున్నాను అని నాని అన్నారు.
యాక్టింగ్ స్కూల్ లో దుల్కర్ నా జూనియర్: రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘కింగ్ ఆఫ్ కోత’ ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైట్మెంట్ కలిగింది. దీనికి కారణం దుల్కర్ సల్మాన్ ఒక యాక్షన్ మూవీ చేయడమే. మా యాక్టింగ్ స్కూల్ లో దుల్కర్ నా జూనియర్. అక్కడి నుంచి మా పరిచయం మొదలైంది. తను చాలా పద్దతైన వ్యక్తి. మృదు స్వభావి. అలాంటి దుల్కర్ ఇప్పుడు ఇలాంటి ఒక వైల్డ్ యాక్షన్ సినిమా చేస్తున్నాడంటే నాకన్నా ఎవరూ ఎక్కువ చాలా ఎగ్జైటింగ్ గా ఉండరు. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. దుల్కర్ ఆల్మోస్ట్ తెలుగు హీరోలాగే ఉంటాడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి అని అన్నారు.
కాగా, ‘కింగ్ ఆఫ్ కోథ’ చిత్రంతో అభిలాష్ జోషి అనే డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా.. ప్రసన్న, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి దుల్కర్ తన సొంత ప్రొడక్షన్ వేఫేరర్ ఫిల్మ్స్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. మరి ఈ యాక్షన్ మూవీ దుల్కర్ సల్మాన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.
Also Read: నేను మా అమ్మకి కార్బన్ కాపీని, మా నాన్నలా కాదు: అభిషేక్ బచ్చన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial