By: ABP Desam | Updated at : 13 Aug 2023 11:16 PM (IST)
Image Credit: Suriya/Instagram
'విక్రమ్' సినిమాలో హీరో సూర్య శివ కుమార్ పోషించిన రోలెక్స్ రోల్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సూర్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఆయన క్యాక్టరైజేషన్, లుక్, హావభావాలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో 'రోలెక్స్' పాత్రపై పూర్తి స్థాయిలో ఒక సినిమా చేస్తే చూడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోలెక్స్ ప్రాజెక్ట్ పై తాజాగా సూర్య క్లారిటీ ఇచ్చారు.
హీరో సూర్య ఆదివారం తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా తన తదుపరి ప్రాజెక్ట్స్ విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా 'రోలెక్స్' ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్ ఆ పాత్రని బేస్ చేసుకొని ఓ కథ చెప్పారని తెలిపారు. అది తనకెంతో నచ్చిందని.. త్వరలోనే ఆ సినిమా మొదలవుతుందని స్పష్టం చేసారు. అంతేకాదు రోలెక్స్ మూవీ పూర్తయిన తర్వాత లోకేష్ దర్శకత్వంలో ‘ఇరుంబు కై మాయావి’ అనే సినిమా చేయనున్నట్లు సూర్య వెల్లడించారు.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘విక్రమ్’ సినిమాలో డ్రగ్ మాఫియాను శాసించే రోలెక్స్ పాత్రలో నటించారు. మెడ మీద టాటూ, డిఫెరెంట్ హెయిర్ స్టైల్ మరియు గడ్డంతో కొత్తగా కనిపించారు. మూవీ క్లైమాక్స్‌లో వచ్చే ఆయన పాత్ర సినీ అభిమానులను ఎంతో సర్ప్రైజ్ చేసింది. అతను తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా, దానికే థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి. 'లైఫ్ టైం సెటిల్ మెంట్ రా' అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఎంతగా వైరల్ అయిందో మనం చూసాం. ఈ నేపథ్యంలోనే సూర్య పాత్రను బేస్ చేసుకుని లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా చేస్తారంటూ గతంలో ప్రచారం సాగింది. లేటెస్టుగా సూర్య వ్యాఖ్యలతో రోలెక్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది.
Also Read: నేను మా అమ్మకి కార్బన్ కాపీని, మా నాన్నలా కాదు: అభిషేక్ బచ్చన్
'విక్రమ్' సినిమాలో 'ఖైదీ' పాత్రలను జోడించి మల్టీవర్స్ వరల్డ్ ని క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్.. లోకేష్ సినిమాటిక్ మల్టీవర్స్ (LCU)లో మరికొన్ని సినిమాలు రూపొందించనున్నారు. ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న ‘లియో’ మూవీ కూడా అందులో భాగమే అనే టాక్ వినిపిస్తోంది. 'ఖైదీ 2' 'విక్రమ్ 2' సినిమాలు కూడా లైనప్ లో ఉన్నాయి. వీటిల్లో కూడా సూర్య పాత్రకు స్కోప్ ఉంది. ఇదే క్రమంలో 'రోలెక్స్', 'ఇరుంబు కై మాయావి' సినిమాలు రాబోతున్నట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిన లోకేష్ తో సూర్య రానున్న రోజుల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేసే అవకాశం ఉంది. దీంతో సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'కంగువ' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ మూవీ తాము ఊహించిన దానికంటే వంద రెట్లు అద్భుతంగా వచ్చిందని సూర్య తెలిపారు. రాబోయే అక్టోబర్ నుంచి తన 43వ చిత్రాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు. వెట్రిమారన్ ‘విడుదలై 2’ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత తమ కాంబినేషన్ లో ‘వాడి వసల్’ సినిమా తిరిగి పట్టాలెక్కుతుందని చెప్పుకొచ్చారు.
Also Read: ఇక్కడ 'అఖండ', అక్కడ 'గదర్ 2' - థియేటర్లకు ట్రాక్టర్లలో వస్తున్న జనాలు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ
Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
/body>