అన్వేషించండి

అందుకే ప్రభాస్ - మారుతీ కాంబో మూవీని అధికారికంగా ప్రకటించలేదు: నిర్మాత టీజీ విశ్వప్రసాద్

మారుతీ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుండగా ఇప్పటివరకూ అనౌన్స్ చేయకపోవడంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్... టైం వచ్చినప్పుడు చెప్తామన్నారు.

Prabhas - Maruthi Movie: ప్రభాస్ మూవీ అంటేనే భారీ అంచనాలుంటాయి. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే.. నెక్స్ట్ మూవీ ఎవరితో, ఏంటీ అన్న ప్రశ్నలు ఇప్పట్నుంచే మొదలవుతాయి. సినిమాలోని నటీనటులే కాదు, డైరెక్టర్, నిర్మాతలు ఎవరన్న దానిపైనా పలు సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇండస్ట్రీలో చాలా మంది లైనప్ లో ఉన్నారనే టాక్ ఉంది. అలాంటిది ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే ఎవరైనా గర్వంగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. కానీ డైరెక్టర్ మారుతీ గానీ, ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ గానీ ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. 

ఈ విషయంపై నేరుగా టీజీ విశ్వ ప్రసాద్ నే అడగగా.. దానికో టైం ఉంటుంది అని సమాధానమిచ్చారు. ప్రభాస్ తో సినిమా అంటే చెప్పుకోవడానికి ఎందుకు గర్వంగా ఉండదు. కానీ దానికి సమయం ఉంటుంది కదా అని ఆయన చెప్పారు. తాము ఎప్పుడైతే అనౌన్స్ చేయాలనుకున్నామో అప్పుడే చేస్తామన్నారు. ఇక సినిమా ఎప్పుడు విడుదల కావచ్చన్న ప్రశ్నపై సమాధానమిచ్చిన విశ్వ ప్రసాద్.. అది కూడా చెప్పలేమని తెలిపారు. 2024లో అయితే విడుదలయ్యే అవకాశం ఉండొచ్చని ఆయన చెప్పారు. తాము చేసిన ప్లానింగ్ ప్రకారం మూవీ తొందరగా అయిపోతుందని విశ్వ ప్రసాద్ అన్నారు. 

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే . మారుతి మార్క్ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమా...  హారర్ కామెడీ థ్రిల్లర్ గా రానుంది. ఈ మూవీకి 'డీలక్స్ రాజా' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోయిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత అతి తక్కువ బడ్జెట్ సినిమాలో నటిస్తుండడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. మారుతీ అండ్ టీం ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే దాదాపు సగం పూర్తి చేసుకుందని, మిగిలిన భాగాన్ని కూడా శరవేగంగా చిత్రీకరిస్తున్నారని సమాచారం.

అంతేకాదు సినిమా చాలా బాగా రూపుదిద్దుకుంటుందని కూడా సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ చిత్రం కోసం భారీ వ్య‌యంతో చిత్ర యూనిట్.. ఓ పాత‌కాలం నాటి థియేట‌ర్ సెట్‌ను కూడా వేసిన‌ట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ కామెడీ క‌థాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ ఈ మూవీలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ పై మాత్రం చిత్ర యూనిట్ సస్పెన్స్ ను అలానే కంటిన్యూ చేస్తోంది. ఇప్పటివరకు టైటిల్‌తో గానీ, షూటింగ్‌, క్యాస్టింగ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌పై ఎలాంటి అఫీషియ‌ల్ కూడా అనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. లిమిటెడ్ బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

Read Also : Operation Valentine: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ రిలీజ్ డేట్ ఫిక్స్, భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget