Operation Valentine: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ రిలీజ్ డేట్ ఫిక్స్, భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది!
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్‘. సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను షేర్ చేశారు.
![Operation Valentine: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ రిలీజ్ డేట్ ఫిక్స్, భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది! Operation Valentine Release date Varun Tej Manushi Chhillar Film Release December 8th Tollywood News Operation Valentine: వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ రిలీజ్ డేట్ ఫిక్స్, భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/788a62acfe95317b822c525f4094765f1692002460646544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Operation Valentine Release date: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్‘. పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 8న ‘ఆపరేషన్ వాలెంటైన్‘ విడుదల
తాజాగా ‘ఆపరేషన్ వాలెంటైన్‘ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 8(2023)నాడు ఈ చిత్రం థియేటర్లలోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు వరుణ్ తేజ్ రిలీజ్ డేట్ అనౌన్స్ పోస్టర్ ను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. ‘భారతీయ గర్జన ఆకాశమంతా ప్రతిధ్వనించబోతోంది’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు.
View this post on Instagram
జెట్ పైలెట్ గా వరుణ్, రాడార్ ఆఫీసర్ గా మానుషి
ఈ చిత్రంలో వరణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా ఆయన సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయ్యింది. యాక్షన్ డ్రామా రూపొందుతున్న ఈ సినిమాలో మానుషి కీలక పాత్ర పోషించబోతోంది. ‘రాడార్ ఆఫీసర్’ గా ఆమె కనిపించబోతుంది. ఇందులో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించబోతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. న్యాయవాదిగా ఉన్న ప్రతాప్ సింగ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో ఆయన ఇప్పటికే పలు యాడ్ ఫిల్మ్స్ చేశారు. ఈ సినిమా కథ కోసం చాలా రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. వరుణ్ కెరీర్ లో ఈ చిత్రం తొలి హిందీ మూవీగా నిలువబోతోంది. మానుషి కెరీర్ రెండో హిందీ చిత్రం. ఇప్పటికే అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో ఆమె హీరోయిన్ గా నటించింది. భారతీయ వాయుసేనలో జరిగిన కొన్న వాస్తవ సంఘటనల ప్రేరణతో ‘ఆపరేషన్ వాలెంటైన్‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, స్టిల్స్, వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
ఆగస్టు 25న 'గాంఢీవధారి అర్జున' విడుదల
అటు వరుణ్ తేజ్ నటిస్తున్న మరో సినిమా 'గాంఢీవధారి అర్జున'. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Read Also: మెగా ఫ్యాన్స్ ఇది చూశారా? ఇక బుల్లితెరపైనా ఆ జర్నలిస్ట్ రచ్చ, చిరు పాటతో ఎంట్రీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)