D51: ధనుష్ - శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఏషియన్ సునీల్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ ని అందజేశారు మేకర్స్.
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా సౌత్ లో తెరకెక్కుతున్న మరో భారీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ అందుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఆ వివరాల్లోకి వెళితే.. ఈమధ్య కోలీవుడ్ హీరోలంతా మన టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది 'సార్' అనే స్ట్రైట్ తెలుగు సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ ధనుష్. తమిళం తో పాటు తెలుగులోనూ ఈ హీరోకి మంచి క్రేజ్ ఉంది. ధనుష్ నటించే ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలవుతూ ఉంటుంది. దాంతో ధనుష్ కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని తన సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం ధనుష్ తమిళంలో 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ధనుష్ మరో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ధనుష్ కెరియర్లో 51 వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. గతంలోనే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ని మేకర్స్ విడుదల చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారు.
తాజాగా సినిమా నుంచి మరో అప్డేట్ ని అందించారు మేకర్స్. శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన ను తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా అటు ధనుష్ తో ఇటు శేఖర్ కమ్ములతో రష్మిక మందన చేస్తున్న మొదటి సినిమా ఇదే. శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్స్ కి ఎంతో మంచి పాత్ర ఉంటుంది. అలాగే ఆ పాత్రకి ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. దానికి తోడు ధనుష్ సరసన హీరోయిన్ పాత్ర కావడంతో ఈ సినిమా రష్మికకు మరింత ప్లస్ అవుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. కాగా దీనిపై రష్మిక మందన స్పందిస్తూ.. తను ఓ సినిమా చేస్తున్నానని స్పెషల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.
Beginning of a new journey.💃🏻❤️#D51
— Rashmika Mandanna (@iamRashmika) August 14, 2023
A @sekharkammula film 🎥@dhanushkraja @AsianSuniel @puskurrammohan #AmigosCreations @SVCLLP pic.twitter.com/dQFghtqd6R
కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో ఒకపక్క స్లమ్ ఏరియా మధ్యలో డబ్బుల నోట్లు ఉండగా, పక్కనే పెద్ద పెద్ద ఎత్తైన బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్టర్ని బట్టి శేఖర్ కమ్ముల ధనుష్ తో ఈసారి ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నాడని అర్థమవుతుంది. మునుపెన్నడు చూడని పాత్రలో ధనుష్ ని ఈ సినిమాలో చూపించనున్నారట శేఖర్ కమ్ముల. సోనాలి నారాయణ సమర్పణలో అమిగోస్ క్రియేషన్స్ వారితో కలిసి సునీల్ నారంగ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనుంది.
Also Read : మెగాస్టార్‌కు మరో వారంలో మోకాళ్ళ సర్జరీ - మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ సంగతేంటి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial