అన్వేషించండి

మెగాస్టార్‌కు మరో వారంలో మోకాళ్ళ సర్జరీ - మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ సంగతేంటి?

మెగాస్టార్ చిరంజీవి మోకాలి సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన మోకాళ్ళ నొప్పితో బాధపడుతుండగా, తాజాగా నొప్పి ఎక్కువవడంతో ఈ వారంలోనే సర్జరీ జరగనున్నట్లు సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి తన మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నారట. గత కొంతకాలంగా విరామం లేకుండా పనిచేస్తుండడంతో ఆయన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా ఆయనకి మోకాలి సర్జరీ జరగబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 70 పదుల వయసు దగ్గర పడుతున్న సమయంలోనూ చిరంజీవి వరుస సినిమాలు చేస్తున్నారు. కేవలం ఏడాది వ్యవధిలోనే మెగాస్టార్ నుంచి నాలుగు సినిమాలు రావడం విశేషం. ఓ సీనియర్ హీరో ఇంత వేగంగా సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. గత ఏడాది ఏప్రిల్ లో చిరంజీవి నటించిన 'ఆచార్య' విడుదలవగా.. అక్టోబర్‌లో 'గాడ్ ఫాదర్' అలాగే 2023 ప్రారంభంలో లో 'వాల్తేరు వీరయ్య' రిలీజ్ అవ్వగా తాజాగా మరోసారి 'భోళాశంకర్' తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

ఇలా వరుస సినిమా షూటింగ్స్ తో విశ్రాంతి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నందున ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ నొప్పి ఎక్కువడంతో ఆయన సర్జరీ చేయించుకోబోతున్నట్లు సమాచారం. హైదరాబాదులో లేకపోతే విదేశాల్లో మెగాస్టార్ కి ఈ సర్జరీ జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారం లోనే మెగాస్టార్ కి సర్జరీ ఉండబోతున్నట్లు చెబుతున్నారు. సర్జరీ అనంతరం సుమారు నెల నుంచి నెలన్నర వరకు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారట. అంతేకాదు పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన నెక్స్ట్ మూవీ స్టార్ట్ కానుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆయన ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోకి సర్జరీ విజయవంతమై పూర్తిగా కోలుకొని త్వరలోనే మళ్లీ కొత్త సినిమాను స్టార్ట్ చేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక మరోవైపు తాజాగా 'భోళాశంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి అభిమానులను నిరాశపరిచారు. రొటీన్ కమర్షియల్ స్టోరీ కావడం, సిస్టర్ సెంటిమెంట్ అంతగా వర్కౌట్ అవ్వకపోవడం, అలాగే అనవసరమైన కామెడీని ఇరికించి అందులో జబర్దస్త్ గ్యాంగ్ ని పెట్టడం ఇలాంటి అంశాలన్నీ సినిమాకు మైనస్ లుగా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళం లో హిట్ అయిన 'బ్రో డాడీ' సినిమాకి రీమేక్ గా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందట. మెగాస్టార్ తో పాటు యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. అయితే 'భోళాశంకర్' డిజాస్టర్ తో చిరు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఇకపై రీమేక్ జోలికి వెళ్లొద్దంటూ మెగాస్టార్ ని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి 'బ్రో డాడి'ని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద మెగాస్టార్ కి సర్జరీ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కొనసాగుతున్న సస్పెన్స్.. వీటన్నిటిని చూస్తే 2024 వేసవి వరకు ఆయన నుంచి మరో సినిమా ఉండకపోవచ్చు.

Also Read : దళితులపై హీరో ఉపేంద్ర అనుచిత వ్యాఖ్యలు - కేసు నమోదు, ఆయన స్పందన ఇదీ!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Comrade Kalyan : ఆ డైరెక్టర్స్ క్రిమినల్స్... వారిని బ్యాన్ చేయాలి - ప్రొడ్యూసర్ కోన వెంకట్ స్ట్రాంగ్ రియాక్షన్
ఆ డైరెక్టర్స్ క్రిమినల్స్... వారిని బ్యాన్ చేయాలి - ప్రొడ్యూసర్ కోన వెంకట్ స్ట్రాంగ్ రియాక్షన్
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
Embed widget