అన్వేషించండి
Satyabhama Serial Today December 11 Highlights : కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన మహదేవయ్య.. సత్య ఏం చేయబోతోంది - సత్యభామ డిసెంబరు 11 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode: క్రిష్.. మహదేవయ్య కొడుకు కాదని సత్య బయటపెడదాం అనుకుంటే ప్లాన్ రివర్సైంది. మహదేవయ్య రివర్స్ గేమ్ మొదలుపెట్టాడు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే....

satyabhama serial December 11 episode Highlights
1/11

సత్యను రప్పించి తీరుతా అని పనిమనిషితో సవాల్ చేస్తుంది భైరవి. పెద్ద కోడలిని పుట్టింటికి పంపుతా..అప్పుడు చిన్న కోడలు ఎందుకు రాదో చూస్తాను అనుకుంటుంది.
2/11

ఈ ఇల్లు దూరమైతే నాన్న తట్టుకోలేరు ఏం చేయాలి క్రిష్ అని చెప్పుకుని బాధపడుతుంది సత్య.వాడు ఎవడో చేసిన తప్పువల్ల మనం బలవడం ఏంటి? మన దగ్గర రౌడీలున్నారు కదా ఎదురుతిరుగుదాం అంటాడు.
3/11

మా బాధలు మేం పడతాం నువ్వు ఇబ్బందిపడొద్దంటుంది సత్య. నన్ను వేరుచేస్తున్నావేంటి అంటాడు క్రిష్. గతంలో నా పుట్టింటికి సాయం చేయాలని అనుకుని ఇబ్బందిపడ్డావ్..ప్రస్తుతానికి పుట్టింటికి అత్తింటికి మధ్య ఓ గీత ఉంది..దాన్ని అలానే ఉండనిద్దాం అంటుంది
4/11

సత్యకి కాల్ చేసి భైరవి ఇంట్లో చాయ్ పెట్టే దిక్కులేదు మోకాలి నొప్పులు..నువ్వు ఖుషీగా ఉన్నావ్ రావాల్సిందే అంటుంది. ఏం చేయాలని ఆలోచిస్తుంది. సత్య ఆలోచనలో పడుతుంది. మరోవైపు పనిమనిషి వచ్చి వంటచేయొద్దు చిన్నకోడలు వస్తుందని చెప్పారు కదా అంటుంది. సత్య రాకకోసం ఎదురుచూస్తుంది భైరవి.
5/11

కారు రావడంతో సత్య వచ్చిందనుకుంటుంది భైరవి. క్రిష్ ఓ పెద్ద క్యారియర్ తీసుకొచ్చి తల్లి ముందు పెడతాడు. తిండి కష్టమన్నావ్ కదా వండి పంపించిందని చెబుతాడు. జయమ్మ వచ్చి వండి పంపడం ఏంట్రా నాకు చెప్తే నేనైనా వండేదాన్ని అని భైరవిని తిడుతుంది జయమ్మ.
6/11

ఇంట్లో భోజనాలు సత్య సిద్ధం చేస్తుంది కానీ ఎవ్వరూ రారు.. నందిని మాత్రం నాకు ఆకలేస్తోందంటూ వచ్చి కూర్చుంటుంది. రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలనగానే ఆలోచన కుదురుగా ఉండనివ్వడం లేదని విశ్వనాథం ఏడుస్తాడు.
7/11

ఎవరూ రాకపోతే నేను ఇంటికి వెళ్లిపోతా అంటుంది. అంతా కలసి భోజనం చేస్తారు..ఇంతలో కరెంట్ పోతుంది. అందరి ఇంట్లో కరెంట్ ఉంది..మనకు లేదేంటని హర్ష కరెంట్ ఆఫీసుకి కాల్ చేస్తాడు.రెండు లక్షల బిల్లు పెండింగ్ ఉంది..అందుకే కరెంట్ కట్ చేశాం అంటారు. విశ్వనాథం తిండి తినకుండా లేచెళ్లిపోతాడు
8/11

సంధ్య ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఇంట్లో కరెంట్ లేదు..దోమలు..చదువుకునేందుకు కూడా లేదు నేను పరీక్షలు రాయలేను అని చెప్పుకుని బాధపడుతుంది. ఆ మాటలు విని బాధపడుతుంది సత్య.
9/11

తర్వాత హర్ష - నందిని...మైత్రి గురించి మాట్లాడుకోవడం విని బాధపడుతుంది సత్య. ఇంట్లో సమస్యలన్నీ మైత్రి వల్లే దాని ఫారిన్ టూర్ కోసం చేసిన అప్పువల్లే కదా ఈ పరిస్థితి అని నందిని ఫైర్ అవుతుంది.
10/11

విశ్వనాథం కూడా విశాలాక్షిపై కోప్పడతాడు.. ఏడుస్తున్న విశాలాక్షిని ఓదార్చుతాడు... ఇంట్లో పరిస్థితి చూసి సత్య విలవిల్లాడిపోతుంది...
11/11

సత్యభామ డిసెంబరు 12 ఎపిసోడ్ లో.. సత్యకు కాల్ చేసిన మహదేవయ్య సమస్యల నుంచ తేలాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేయి అని ఆఫర్ ఇస్తాడు మహదేవయ్య.. సత్య ఏం చేస్తుందో చూడాలి...
Published at : 11 Dec 2024 09:57 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion