By: ABP Desam | Updated at : 17 Dec 2021 08:26 PM (IST)
Image Credit: Star Maa/Hotstar (Screen Shot)
‘బిగ్ బాస్’ హౌస్‌లో టాప్-5లో ఉన్న సభ్యుల్లో విజేతలు ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. అయితే, బిగ్ బాస్ ఆ ఐదుగురిలో ఒకరిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించేందుకు ప్లాన్ చేసినట్లు తాజా ప్రోమోలో చూపించాడు. ఐదుగురు సభ్యులను తమ సూట్‌కేసులతో గార్డెన్ ఏరియాకు రావాలని పిలిచిన బిగ్ బాస్.. ఈ రోజు ఎవరు ఎలిమినేట్ కానున్నారో చెప్పాలని అడిగాడు. దీంతో షన్ను.. సన్నీ పేరు చెప్పాడు. మానస్ షన్ముఖ్ పేరు, శ్రీరామ్.. సిరి పేరు, సన్నీ.. షన్ను పేరు చెప్పాడు. చివరిగా ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సభ్యులు సిరి అని ప్రకటించాడు. దీంతో బిగ్ బాస్ మీరు జోక్ చేస్తున్నారు.. నేను వెళ్లను అని కూర్చుంది. చివరికి ఇంటి నుంచి బయటకు వెళ్తూ.. షన్నుకు హగ్ ఇచ్చింది. సిరి వెళ్లడంతో షన్ముఖ్ భావోద్వేగానికి గురయ్యాడు.
అయితే, ఈ ప్రోమో చూసిన నెటిజనులు మాత్రం.. ఇంకా ఒక్క రోజులో బయటకు వెళ్లి కలుస్తారు కదా.. ఆ మాత్రం దానికి అంత ఎమోషనల్ కావడం అవసరమా అని అంటున్నారు. అయితే, ఇది ఫేక్ ఎలిమినేషన్ అని, బిగ్ బాస్ అందరినీ ఫూల్ చేస్తున్నాడని మరికొందరు అంటున్నారు. అయితే, అది రియల్ ఎలిమినేషనా లేదా ఫేకా అనేది ఈ రోజు ప్రసారం కానున్న బిగ్ బాస్ 104వ ఎపిసోడ్‌ను చూస్తేనే అర్థమవుతుంది. అయితే, ఈ ఎలిమినేషన్ ప్రోమో, ఎపిసోడ్స్ వల్ల సిరి ఓట్లపై ప్రభావం తీవ్రంగా పడుతుంది. సిరిని గెలిపించాలని భావించేవారు షన్నుకు ఓట్లేసే అవకాశాలున్నాయి.
Also Read: ‘బిగ్ బాస్’ విజేత ఎవరు? ఇలా ఓటేసి విన్నర్‌ను మీరే నిర్ణయించండి
ఈ నేపథ్యంలో సన్నీ, షన్నుల మధ్య గట్టి పోటీ ఉంటుందనేది బిగ్ బాస్ ప్లాన్ కావచ్చు. సిరి ఎలిమినేషన్ నిజమైతే.. షన్ను ‘లెక్క’ మారి ‘లక్’ కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సన్నీ, షన్నుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ఓట్లు పడుతున్నట్లు సమాచారం. మానస్ కూడా షన్నుకు గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలిసింది. అయితే, ఇప్పటివరకు బిగ్ బాస్‌లో టాప్-5 నుంచి ఎవరినీ ఇలా ఎలిమినేట్ చేయలేదు. సిరి.. హౌస్ నుంచి వెళ్లిపోతే షన్ను ఎలా ఉంటాడో చూడాలనే ఉద్దేశంతో కూడా బిగ్ బాస్ ఇలా చేసి ఉంటాడని తెలుస్తోంది. అయితే, సిరిది ఫేక్ ఎలిమినేషన్ అని తెలిసింది. ఆమెను కాసేపు సీక్రెట్ రూమ్‌లో ఉంచి మళ్లీ వెనక్కి పంపినట్లు సమాచారం. మరి సిరి ఎలిమినేషన్‌పై మీరు ఏమంటారు?
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
House nundi eliminate aina #Siri #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBosTelugu pic.twitter.com/Ww0q2wpjWB
— starmaa (@StarMaa) December 17, 2021
Bigg Boss 7 Telugu: అర్జున్ ఎలిమినేట్ అవ్వాల్సింది కానీ.. అంటూ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన నాగార్జున
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌కు క్యాష్ ప్రైజ్ ఎంతో రివీల్ చేసిన నాగార్జున, డబ్బులతో పాటు అవన్నీ కూడా!
Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ స్టేజ్‌పై ‘నా సామిరంగ’ హీరోయిన్ - ఇంప్రెస్ చేసి ఫ్లయింగ్ కిస్ కొట్టేసిన అమర్
Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
/body>