By: ABP Desam | Updated at : 18 Nov 2021 08:20 PM (IST)
శ్రుతీ హాసన్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీ హాసన్ ఒకరు. అప్పుడప్పుడూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ప్రశ్నలు ఏవైనా ఉంటే అడగమని ఆమె అడుగుతారు. గురువారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందులో ఒకరు 'టీనేజర్ అబ్బాయితో డేటింగ్ చేస్తారా?' అని శ్రుతీ హాసన్‌ను అడిగాఋ. అందుకు బదులుగా ఆమె "నో (చేయను). ఎందుకంటే... అలా చేయడం ఇల్లీగల్. అది మొదటి కారణం అయితే, మరో ముఖ్యమైన కారణం ఏంటంటే... అది చాలా అసహజంగా ఉంటుంది. మీ ప్రశ్న కూడా చాలా అసహజంగా ఉంది" అని సమాధానం ఇచ్చారు.
'ఇరవై ఏళ్ల శ్రుతీకి ఇప్పుడు మీరు ఏం సలహా ఇస్తారు?' అని ప్రశ్నిస్తే... "ఇతరుల కోసం చేంజ్ అవ్వొద్దు. మంచి కోసం మారండి. చిల్ అవుట్" అని శ్రుతీ హాసన్ చెప్పారు. పదో తరగతిలో ఉన్నప్పుడు పరీక్షలు పాస్ కావడమే తన లక్ష్యమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'ఎవరో మీ వయసు ఎంత?' అని ప్రశ్నిస్తే... గూగుల్ చేసుకోమని రిప్లై ఇచ్చారు. తనకు పచ్చళ్లు అంటే ఇష్టమన్నారు. 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?' అని ఒకరు అడిగారు. 'నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చా?' అని శ్రుతీ హాసన్ అసహనం వ్యక్తం చేశారు.
Also Read: బాక్సాఫీస్ బరిలో మాజీ ప్రేమికుల సమరం... ఎవరైనా వెనక్కి తగ్గుతారా?
ఒకప్పుడు తనకు గోళ్లు కొరికే అలవాటు ఉందని, కానీ ఇప్పుడు మానేశానని శ్రుతీ హాసన్ తెలిపారు. తన కాళ్లకు అయిన గాయాలను కూడా శ్రుతీ హాసన్ వీడియో తీసి చూపించారు. వీలు దొరికినప్పుడు స్వయంగా వెళ్లి కిరాణా సరుకులు కొనుక్కుని తెచ్చుకుంటానని, వంట చేస్తానని... ఈ పనులు చేయడం ఎంజాయ్ చేస్తానని ఆమె చెప్పారు. అబద్ధాలు చెప్పే వాళ్లను చూసినప్పుడు... ఇతర మహిళలకు మద్దతుగా నిలవని మహిళలను చూసినప్పుడు తనకు కోపం వస్తుందని శ్రుతీ హాసన్ తెలిపారు.
Also Read: చర్చలకు నాలుగేళ్లు... చిత్రీకరణకు మూడేళ్లు... విడుదలకు 50 రోజులు!
Also Read: స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న తమిళ హీరో... తనకు సపోర్ట్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి
Also Read: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
Ilaiyaraaja: ‘స్ట్రేంజర్ థింగ్స్’ సీజన్-4కు ఇళయరాజా సంగీతం, ఫిదా చేస్తున్న థీమ్ మ్యూజిక్, ఇదిగో వీడియో!
Sita Ramam Movie Release Date: యుద్ధంతో రాసిన ప్రేమకథ 'సీతా రామం' ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తుందంటే? దుల్కర్ సల్మాన్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
The Gray Man Trailer - ‘ది గ్రే మ్యాన్’ ట్రైలర్: హాలీవుడ్ మూవీలో ధనుష్, మెరుపు తీగలా మాయమయ్యాడంటూ ట్రోల్స్!
Rashmika Mandanna: రష్మికకు అదొక సెంటిమెంట్ - ఆమె ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా షెడ్యూల్లో అది కామన్
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్