RRR: చర్చలకు నాలుగేళ్లు... చిత్రీకరణకు మూడేళ్లు... విడుదలకు 50 రోజులు!
'ఆర్ఆర్ఆర్'కు సినిమాకు, నవంబర్ 18వ తేదీకి ఓ అవినాభావ సంబంధం ఉంది. అదేంటో తెలుసా?
రాజమౌళి, రామారావు (ఎన్టీఆర్), రామ్ చరణ్... ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ ఫాంటసీ సినిమా 'ఆర్ఆర్ఆర్'. 'బాహుబలి' తర్వాత దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న చిత్రమిది. దీనికి, నవంబర్ 18వ తేదీకి ఓ అవినాభావ సంబంధం ఉంది. అదేంటో తెలుసా? ఈ రోజు... అనగా గురువారం, నవంబర్ 18కి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు హీరోలు, దర్శకుడు శ్రీకారం చుట్టారు. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున (2017లో) సినిమాకు సంబంధించి ముగ్గురూ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఏడాదికి (2018లో) సినిమా షూటింగ్ ప్రారంభించారు. సెట్స్ మీదకు సినిమాను తీసుకు వెళ్లారు. ఇప్పుడు మరో 50 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాలుగేళ్ల క్రితం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ దిగిన ఫొటోను 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం ట్వీట్ చేసింది. "ఊహించని చిత్ర విచిత్రం... స్నేహం చాచిన హస్తం" అని పేర్కొంది. జనవరి 7న బ్లాస్ట్ ఖాయం అని యూనిట్ అంటోంది.
4 years since he posted this pic leaving room for so many speculations… 3 years since we began filming #RRRMovie… 50 Days for you to experience the magic on the big screen 💥💥
— RRR Movie (@RRRMovie) November 18, 2021
Oohinchani Chitra Vichitram… Snehaaniki Chaachina Hastham…❤️🙌🏻
Jan 7th, Let’s blast!! https://t.co/S0prnnO4FM
కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్న ఈ సినిమాలో సీతగా హిందీ హీరోయిన్ ఆలియా భట్ నటించారు. రామ్ చరణ్, ఆలియా జంటగా కనిపించనున్నారు. ఎన్టీఆర్ జోడీగా విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటించారు. హిందీ హీరో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు డి.వి.వి దానయ్య నిర్మాత. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. 'దోస్తీ' మ్యూజిక్ వీడియోను ఎప్పుడో విడుదల చేశారు. ఇటీవల 'నాటు నాటు నాటు' సాంగ్ రిలీజ్ చేశారు. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. త్వరలో మిగతా పాటలను విడుదల చేయనున్నారు. ఆల్రెడీ రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
Also Read: స్టేజి మీద కన్నీళ్లు పెట్టుకున్న తమిళ హీరో... తనకు సపోర్ట్ చేయాలని అభిమానులకు విజ్ఞప్తి
Also Read: పెద్ద చిన్నా అని ఏమీ లేదు... మళ్లీ నా సినిమాలు థియేటర్లకు వస్తాయ్! - వెంకటేష్
Also Read: కోతులకు అరటిపళ్లు తినిపిస్తున్న సల్మాన్ ఖాన్, ఆయన మేనల్లుడు... వీడియో చూశారా?
Also Read: స్టాఫ్‌కూ ఫైవ్ స్టార్ హోటల్ డిమాండ్ చేసిన హీరోయిన్? అందుకే సినిమా నుంచి తప్పించారా? లేదంటే...
Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న పెళ్లి చెల్లదన్నకోర్టు... హమ్మయ్య అనుకున్న హీరోయిన్ ఎంపీ !
Also Read: మెగాస్టార్ చిరును పొగిడేసిన పవన్ భక్తుడు... ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో సినిమా వారికి యాభై శాతం ఫీజు తగ్గింపు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి